• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • CHANDRA GRAHAN 2019 FULL MOON AND LUNAR ECLIPSE WILL BE IMPACT ON THESE ZODIAC SIGNS SB

Chandra Grahan 2019: చంద్రగ్రహణం వేళ... ఈ పనులు చేయకండి

Chandra Grahan 2019: చంద్రగ్రహణం వేళ... ఈ పనులు చేయకండి

చంద్ర గ్రహణం

Chandra Grahan 2019: గ్రహణ కాలములో లైంగిక సంపర్గము , ఏ కారణము వలనైన అలంకారము చేయరాదు.

  • Share this:
    ఇవాళ చంద్రగ్రహణం. ఏడాదిలో వచ్చిన రెండో చంద్రగ్రహణం ఇది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఏర్పడుతోంది. వికారినామ సంవత్సర ఆషాడ శుద్ద పౌర్ణమి 16 - 07 - 19 మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రము నందు ధనస్సు మరియు మకర రాశి - ఉత్తరాషాడ నక్షత్రము నందు కేతు గ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి 1.30 ధనుస్సు రాశి ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో ప్రారంభమై తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశి ఉత్తరాషాడ రెండో పాదంలో ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని  ధనుర్ రాశీ,మకర రాశీ వారు చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఖండగ్రాస కేతు గ్రస్త చంద్రగ్రహణమని జ్యోతిషులు పేర్కొంటున్నారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరషాడ, శ్రావణం నక్షాల వారు శాంతుల చేసుకోవాలి.

    గ్రహణ కాలంలో ఎటువంటు ద్రవ ఆహార పదార్థాలు స్వీకరించరాదని చెబుతున్నారు. గ్రహణ మొక్ష కాలము తర్వాత స్నాన పూజాది కార్యక్రమాలు చేసి ఏమైనా తినవచ్చు. గ్రహణము కంటే ముందుగా వండిన పదార్థాలు గ్రహణ కాలములో చేసినవి తినకూడదు. దేవాలయం మరియు పూజ ప్రతిమలను కూడా ముట్టుకోరాదు. గ్రహణ కాలములో లైంగిక సంపర్గము , ఏ కారణము వలనైన అలంకారము చేయరాదు.

    కర్కాటక , తుల , కుంభ , మీన రాశుల వారికి శుభపలం కలగనుంది.  మేష , మిథున , సింహ , వృశ్చిక రాశుల వారికి మిశ్రమ ఫలం  దక్కనుంది. వృషభ , ధనస్సు , కన్యా , మకర రాశుల వారికి అశుభ ఫలం కలగనుంది. ఇక చంద్రగ్రహణం రోజున  బియ్యం , ఉలవలు దానం చేయడం మంచింది. దీంతో పాటు... రాహు,కేతు నాగ పడగలు, రాగిపళ్ళెము, అవునెయ్యి వీటితో దక్షిణ సమేతముగా దానము చేస్తే మంచి జరుగుతోంది.

    ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం 149 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున సంభవించడం విశేషం.
    First published: