హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

New Challenge: కోడిగుడ్ల రోల్.. 20 నిమిషాల్లో తింటే 20 వేల బహుమతి.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి

New Challenge: కోడిగుడ్ల రోల్.. 20 నిమిషాల్లో తింటే 20 వేల బహుమతి.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి

ఈ రోల్ 20 నిమిషాల్లో తినండి.. 20వేల రూపాయలు గెలుచుకోండి

ఈ రోల్ 20 నిమిషాల్లో తినండి.. 20వేల రూపాయలు గెలుచుకోండి

Kathi Roll Challenge: కష్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు ఓ హోటల్ యజమాని.. అది చిన్న హోటలే అయినా.. ప్రజలను ఆకర్షించడానికి ఇలా సరికొత్త ఛాలెంజ్ విసిరాడు. తాను చేసిన రోల్ ను 20 నిమిషాల్లో తిన్నవారికి 20 వేల బహుమతి ఇస్తాను అంటున్నాడు. ఇంతకీ ఏంటి దాని స్పెషల్ తెలుసా..?

ఇంకా చదవండి ...

  Kathi Roll Viral Video: వ్యాపారం (business)  ఏదైనా.. చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే.. ప్రజలను ఆకర్షించడానికి.. పోటీని తట్టుకోడానికి కొత్త కొత్త ఆఫర్లు(New Bumper Offers) ప్రకటించాల్సిందే.. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకున్న వ్యాపారం… మంచి లాభాలను సంపాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకనే బడాబడా కంపెనీలు తమ స్టేజ్ కు తగిన విధంగా యాడ్స్ ను తయారు చేయించి తమ ప్రోడక్ట్స్ ను మార్కెట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగానే సీజన్స్ వారీగా ఆఫర్లు ప్రకటిస్తారు. మరి అదే చిన్న చిన్న వ్యాపార సంస్థలు అయితే జనాన్ని ఆకర్షించాలంటే.. భారీ ప్రకటనలు వేయించలేరు. ఈ నేపథ్యంలో తమ తెలివితేటలకు పదును పెట్టి.. తమదైన శైలి కస్టమర్స్ ను ఆకర్షితున్నారు. తాజాగా ఓ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ (Food Stall) సరికొత్త పోటీని తెరమీదకు తీసుకొచ్చింది. తాను చేసే భారీ రోల్ ను.. 20 నిమిషాల్లో తిన్న వారికి 20 వేల బహుమతి ఇస్తారని సరికొత్త ఛాలెంజ్ చేశాడు. 20 నిమిషాల్లో (20 minutes only) రోల్ ని తినమని ఛాలెంజ్ చేస్తున్నాడంటే మరి దాని స్పెషల్ ఏంటి.. తినడం అంత కష్టామా అని డౌట్ పడుతున్నారు..

  దేశ రాజధాని ఢిల్లీలో మోడల్ త్రీ టౌన్ లో ఓ రోడ్డు సైడ్ పుడ్ స్టాల్ ఓనర్ ఓ భారీ కాఠీ రోల్‌ని తయారు చేయించాడు. దాదాపు పది కేజీల బరువు ఉన్న ఈ కఠీ రోల్‌ని తినండి.. 20 వేలు గెలుచుకోండి అంటూ టెంప్టింగ్ ఆఫర్ ను పెట్టాడు.. ఆహార ప్రియులకు అదిరిపోయే చాలెంజ్ విసిరాడు.

  .ఇదీ చదవండి: వర్షాలతో చలేస్తోందని.. వేడి నీటితో స్నానం చేస్తున్నారా? కానీ చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు 

  ఈ రోల్ ను 30 గుడ్లతో తయారు చేశారు. ఈ భారీ కాఠీ రోల్‌ను 20 నిమిషాల్లో తిన్నవారికి బహుమతిగా రూ. 20 వేల రూపాయలను షాప్ యాజమాన్యం ప్రకటించింది. ఈ రోల్ ను కూరగాయలు, గుడ్లు, నూడుల్స్ తో తయారు చేశారు. తినడానికి సాస్ ను కూడా ఇస్తున్నారు. ఫుడ్ వ్లాగింగ్ పేజీ ది ఫుడ్ కల్ట్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఈ అతి పెద్దదైన రోల్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమకు రోల్ ని తినాలని ఉందనే కోరికను వ్యక్తం చేశారు. మరికొందరు ఈ రోల్ తిన్న తర్వాత నెక్స్ట్ డే అజీర్తితో ఆసపత్రికి చేరాల్సి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు, లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ కాఠీ రోల్‌ పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి… తినాలని.. బహుమతి కోసం ట్రై చేయాలనీ పిస్తే దేశ రాజధాని ఢిల్లీకి పరుగులు తీయాల్సిందే..

  Published by:Nagesh Paina
  First published:

  Tags: Delhi news, Food, Life Style, National News

  ఉత్తమ కథలు