Home /News /life-style /

CERAMIC STEEL AND TEFLON WHICH IS BEST FOR COOKING RNK

Cooking tips: టెఫ్లాన్- స్టీల్-సిరామిక్.. వంట చేయడానికి ఏది బెస్ట్? మన ఆరోగ్యానికి ఏది మంచిది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cooking tips: టెఫ్లాన్ అంటే కూకింగ్ పాత్రల ఉపరితలంపై పూసే సింథటిక్ కెమికల్..

మన లైఫ్ స్టైల్లో డ్రెస్, వెహికల్, పెట్స్ ఇలా ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెందాం. ముఖ్యంగా ఆన్ లైన్ (Online) ద్వారా చాలా అప్ డేట్ అయ్యారు. అయితే, వంట విషయానికి వస్తే..  మన పూర్తీకులు ఆహారం వండుకోవడానికి మట్టికుండ (Clay pots) లను ఉపయోగించేవారు. వాటి ధరలు కూడా తక్కువగానే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో ఇత్తడి, రాగి, ఇనుము పాత్రలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మనం ఏ పాత్రల్లో వండుకోవాలి? ఆ పాత్రలు మన ఆరోగ్యానికి మంచేవేనా? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

వంటగదులను ప్రస్తుతం ఆధునాతనంగా మార్పులు చేసుకుంటున్నారు. దానికి సరిపడా ఉపకరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, సరైన వంటపాత్రలు ఎంచుకోవడం వల్ల పెద్ద మార్పులను చూడవచ్చు. ప్రతి రకమైన వంట పాత్రలు దాని లాభాలు, నష్టాలను కలిగి ఉంటాయి. కొన్ని వంట పాత్రలు కొన్ని వంట పద్ధతులకు అనువైనవి. మీరు వండే ఆహారానికి అనువైన పాత్రలను ఎంచుకోవడం తప్పనిసరి. టెఫ్లాన్, స్టెయిన్‌లెస్ స్టీల్, సిరామిక్ అనే మూడు అత్యంత అనుకూలమైన, ఆరోగ్యకరమైన వంట పాత్రలు ఏమిటో మేము వివరంగా తెలుసుకుందాం..
1. టెఫ్లాన్ పాత్రలు:టెఫ్లాన్ అంటే కూకింగ్ పాత్రల ఉపరితలంపై పూసే సింథటిక్ కెమికల్..అందుకే ఇందులో వండిన ఆహారం పాత్రలకు అంటుకోదు. అంతేకాదు, దీంట్లో వండుకుంటే నూనె కూడా తక్కువే పడుతుంది. అలాంటి వంట పాత్రలను వాషింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తాయి. మార్కెట్‌లో లభించే ఇతర వంట పాత్రలతో పోలిస్తే టెఫ్లాన్ చౌకగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Xanthan gum: రుచిని పెంచే ఈ పదార్థంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవట..నష్టాలు..

టెఫ్లాన్ ఒక సింథటిక్ పదార్థం ,అత్యంత ప్రభావవంతమైన ప్లాస్టిక్ రకానికి చెందినది. ఇది విషాన్ని విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వంట పాత్రల పూత విచ్ఛిన్నమై విష రసాయనాలను గాలిలోకి విడుదల చేయడం ప్రారంభమవుతుంది. ఈ పొగలను పీల్చడం లేదా మీ ఆహారంలో ఈ రసాయనాలను కలవడం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. టెఫ్లాన్ వంట పాత్రల జీవితకాలం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పూత కాలక్రమేణా అరిగిపోతుంది. ఆహారం పాన్‌కు అంటుకోవడం ప్రారంభమవుతుంది.

స్టెయిన్ స్టీల్:స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ప్రతి ఇంట్లో ప్రధాన వస్తువులు. ప్రతి వంటశాలలోనూ కంటికి రెప్పలా చూసేటట్లు చూసాం. స్టెయిన్‌లెస్ స్టీల్ వంట పాత్రలు వంటగదిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కూర నుండి పాస్తా సాస్ వరకు ఏ రకమైన ఆహారాన్ని అయినా వండడానికి అనువైనది.చాలా మన్నికైనది. వీటిని శుభ్రం చేయడం కూడా సులభం. స్క్రాచ్ సులభంగా పడిపోదు. ఈ పాత్రలపై ఏ పూత లేనందుకు ఇది విషపూరితం కాదు. అధిక వేడి మీద సులభంగా ఉడికించవచ్చు.

ఇది కూడా చదవండి: Microplastics: మానవ ఊపిరితిత్తులలో మైక్రోప్లాస్టిక్స్.. అస్సలు కారణం ఇదే..దుష్ప్రభావాలు..
స్టెయిన్‌లెస్ స్టీల్ వంట పాత్రలు అధిక వేడి మీద ఉడికించడం సురక్షితం కాదు. వండుకున్న ఆహారం పాత్రలకు అంటుకోకుండా ఉండాలంటే.. నూనె, వెన్న ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. స్టీలు పాత్రలు కాస్త ఖరీదైనవి.

సిరామిక్ పాత్రలు..సిరామిక్ పాత్రలు PTFE ,PFOA వంటి రసాయనాలు లేనివి. ఇది మరింత గీతలు పడకుండా ఉపయోగించడం సులభం. పింగాణీ పాత్రలు లోహాలు లేదా విషపూరిత రసాయనాలు లేని సురక్షితమైన పరిశుభ్రమైన ఖనిజాల నుండి తయారు చేస్తారు..
దుష్ప్రభావాలు..
సిరామిక్ పూత మన్నికైనది కాదు ఎందుకంటే ఇది పగుళ్లు ,కాలక్రమేణా మార్పు కనిపిస్తుంది. ఇతర నాన్ స్టిక్ పాత్రలతో పోలిస్తే ఇది చాలా ఖరీదైనది. సిరామిక్ వంటసామానులో ఉపయోగించే కణాలు చిన్న ఖనిజ కణాలతో తయారవుతాయి. తద్వారా ఆహారాన్ని వంట ఉపరితలంతో పూర్తి సంబంధంలోకి రాకుండా చేస్తుంది. పింగాణీ వంట పాత్రలు చాలా సున్నితమైనవి ,జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాత్రలు కడగడం చాలా సున్నితమైన పని.

ప్రతి ఇంటిలో వివిధ పదార్థాలతో తయారు చేసిన వంట పాత్రల మిశ్రమం. చివరికి, వ్యక్తిగత ప్రాధాన్యత, వంట శైలి ,ఆహారం మీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు. ఏ రకమైన వంట పాత్రను నిర్ణయించుకున్నా, ఆరోగ్యంగా ఉడికించి, ఆ పాత్రలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
Published by:Renuka Godugu
First published:

Tags: Health news, Kitchen tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు