Health : కందిపప్పుతో ఆరోగ్యానికి ఎంతో మేలు... కేంద్ర మంత్రి సలహా

Health : ఉల్లిపాయలు, టమాటాలు ఎలాగో... కంది పప్పు కూడా మన ఇళ్లలో రెగ్యులర్‌గా వాడుతాం. ఐతే... ఈమధ్య కందిపప్పు వాడకం తగ్గడంతో... కేంద్ర మంత్రి దాని అవసరాన్ని వివరించారు.

news18-telugu
Updated: January 19, 2020, 11:58 AM IST
Health : కందిపప్పుతో ఆరోగ్యానికి ఎంతో మేలు... కేంద్ర మంత్రి సలహా
కందిపప్పుతో ఆరోగ్యానికి ఎంతో మేలు... కేంద్ర మంత్రి సలహా
  • Share this:
Health : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్... ఒక్కసారి డాక్టర్‌గా మారిపోయారు. ఏ ఆహారం తింటే మంచిదో చెబుతూ... ఓ ట్వీట్ చేశారు. ప్రధానంగా మాంసకృత్తులు (ప్రోటీన్స్) ఉండే కందిపప్పును రోజూ ఎందుకు తినాలో వివరింటారు. మనందరికీ కందిపప్పు అంటే ఇష్టమే అంటూ... రోజువారీ బాడీకి కావాల్సిన ఫైబర్‌ను కప్పులో నాలుగో వంతు కందిపప్పు ఇస్తుందని ఆయన వివరించారు. కందిపప్పు వల్ల... జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది, గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుంది... గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ కందిపప్పు తినాలనీ, తద్వారా ఆరోగ్యకరమైన భారత్‌ సాధ్యమవుతుందని ఆయన కోరుతున్నారు.


ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ హర్ష వర్ధన్ ఇలాంటివి చాలా చేస్తున్నారు. ఇటీవలే యూత్ ఎఫైర్స్, క్రీడా శాఖ మంత్రిని కలిసి... దేశంలో ఫిట్‌నెస్ పెంచడానికి ఏం చెయ్యాలో చర్చించారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా... విద్యార్థులకు మరిన్ని క్రీడల్ని కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం... ఈ ఏడాది ఆరంభంలోనే... విద్యార్థులంతా గేమ్స్‌ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపిచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి ఇలా ప్రత్యేకించి ఓ పప్పును తినమని కోరడం విశేషం.
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు