త్వరలో బర్గర్లు, పిజ్జాలపై 'కొవ్వు పన్ను' పోటు

మన దేశంలో సంప్రదాయ ఆహారంతోపాటూ పిజ్జాలు, బర్గర్ల వాడకం బాగా పెరిగిపోయింది. సమస్యేంటంటే ఈ జంక్ ఫూడ్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా వీటిని రెగ్యులర్‌గా తినేవాళ్లు లావైపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనుకుంటున్న కేంద్రం, అదనంగా 'కొవ్వు పన్ను' విధించే ఆలోచనలో ఉంది.

news18-telugu
Updated: November 26, 2018, 12:21 PM IST
త్వరలో బర్గర్లు, పిజ్జాలపై 'కొవ్వు పన్ను' పోటు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్డరిస్తే అరగంటలో డోర్ డెలివరీ. తినడం తేలిక, టేస్ట్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. లొట్టలేసుకు తినొచ్చు. అందుకే మన దేశంలో కూడా పిజ్జాలూ, బర్గర్లకు డిమాండ్ తెగ పెరిగిపోయింది. ఫ్రెండ్సో, లవర్సో పార్టీ చేసుకోవాలంటే జంక్ ఫూడ్ ఆర్డరిస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి వీకెండ్‌లో డోమినోస్, కేఎఫ్‌సీ వంటి రెస్టారెంట్లకు వెళ్లి, జంక్ ఫూడ్ తింటున్నారు. ఇలా ప్రతి సందర్భంలో ఈ ఈజీ, టేస్టీ ఫూడ్‌ని ఆరగిస్తున్నారు. ఐతే వాళ్లకు తెలియకుండానే, కొవ్వు పదార్థాలను స్వీకరిస్తూ, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


ప్రజారోగ్యం దృష్ట్యా జంక్ ఫూడ్‌పై కొవ్వు పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇదివరకు ప్రధాని మోడీ సారధ్యంలో 11 మంది ఉన్నతాధికారుల బృందం కొన్ని సూచనలు చేసింది. వాటిని అమలు చెయ్యాలనుకుంటోంది కేంద్రం. కొవ్వు పన్నుపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కోరింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం 14.5 శాతం కొవ్వు పన్ను విధిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


కొవ్వు పన్ను అమలైతే, బ్రాండెడ్ రెస్టారెంట్లు, హోటళ్లలో పిజ్జాలు, బర్గర్లు, కొన్ని స్వీట్లపై ఈ పన్ను పడుతుంది. అందువల్ల వీటి రేట్లు మరింత పెరుగుతాయి. కనీసం అలాగైనా ఈ తరహా ఫూడ్ తీసుకోవడం తగ్గిస్తారని కేంద్రం భావిస్తోంది. ఈ ఆలోచనపై అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలపై పన్నుల భారం వేసేందుకు కేంద్రం యత్నిస్తోందని కొందరంటున్నారు. కేరళ ప్రభుత్వం కొవ్వు పన్ను ద్వారా రూ.10 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటోంది మరి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


పెరిగిపోతున్న బరువే సమస్య:

మన దేశంలో ప్రజలు లావైపోతున్నారు. ప్రతి 100 మంది స్థూలకాయుల్లో 38 మందికి షుగర్ వ్యాధి వస్తోంది. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో కనిపించే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇండియాలోనూ సాధారణమవుతున్నాయి. డయాబెటిస్‌తోపాటూ, బీపీ, కేన్సర్, గుండె జబ్బులు కూడా ఎక్కువవుతున్నాయి. దేశంలోని మృతుల్లో సగం మంది మరణాలకు ఈ వ్యాధులే కారణమవుతున్నాయంటే ఆందోళనకరమే. అందుకే ఫ్యాట్ సంగతి చూడాలని కేంద్రం పట్టుదలగా ఉంది. శరీరంలో కొవ్వును తగ్గిస్తే, అన్నీ లాభాలే కాబట్టి, కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


కొవ్వు పన్ను విధిస్తే ప్రయోజనం ఉంటుందా?
ప్రతీ అంశానికీ రెండు కోణాలుంటాయి. కొవ్వు పన్ను విధించినంత మాత్రాన జంక్ ఫూడ్ సేల్స్ తగ్గిపోతుందని చెప్పలేమంటున్నారు కొందరు. ఎందుకంటే కేరళలో జంక్ ఫూడ్ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. దేశమంతా అమలు చేస్తే... మొదట్లో ఈ తరహా ఫూడ్‌కి సేల్స్ తగ్గినా, తర్వాత ప్రజలు పెంచిన రేట్లకు అలవాటు పడిపోతారనీ, యథావిధిగా వాటినే తింటారని చెబుతున్నారు. పన్నులు బాదే బదులు, కొవ్వు పెరిగే ఆహారం తినవద్దని ప్రచారం చేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: November 26, 2018, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading