ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్.. వెంటనే బ్యాడ్ న్యూస్..

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా 20ఎర్న్‌డ్ లీవ్స్ వాడుకోవాలి. వాడి తీరాలి.

Amala Ravula | news18-telugu
Updated: January 6, 2019, 2:55 PM IST
ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్.. వెంటనే బ్యాడ్ న్యూస్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 6, 2019, 2:55 PM IST
రోజూ ఆఫీస్‌కి వెళ్లి బోర్ కొడితే..సెలవుపెట్టి ఎటైనా వెళ్దామనుకుంటాం.. ప్రైవేట్ ఎంప్లాయిస్‌కి లీవ్స్ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.. కానీ, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌కి అలా ఉండదు..లీవ్స్ చక్కగా పెట్టుకోవచ్చు. అందుకే సంవత్సరం మొత్తం చూస్తారు.. అవసరముంటే వాడుకుంటారు.. లేకపోతే.. ఇయర్ ఎండింగ్‌లో కొన్ని వాడుకుని కొన్ని ఎర్న్‌డ్ లీవ్స్‌గా వాడుకుంటారు.
అసలు గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇకముందునుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా 20ఎర్న్‌డ్ లీవ్స్ వాడుకోవాలి. వాడి తీరాలి. అదే బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఒకవేళ వాడుకోకపోతే వాటిని ఎర్న్‌డ్ లీవ్స్‌గా మార్చుకోవడం కుదరదు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్స్ ఉంటాయి. కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు.. ఇకపై ఏడాదికి 10 ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయి. మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవ్వడమే..ఇప్పటికే ఈ నిర్ణయాన్ని పలు బ్యాంకులు అమలు కూడా చేస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు బలమైన కారణం కూడా ఉంది. చాలామంది ఉద్యోగులు సెలవులు వాడుకోకుండా ఎర్న్‌డ్ లీవ్స్ పెట్టుకోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఉద్యోగుల భత్యాల కోసం రూ.63,232 కోట్లు చెల్లించింది.
కాబట్టి ఉన్న సెలవులను వినియోగించుకోవడం మీకు గుడ్‌న్యూస్.. వినియోగించుకోకుండా క్యాష్ చేసుకుందామనుకునే ఆలోచనకు బ్రేక్ పడడం బ్యాడ్ న్యూస్.. మరింకెంటి? ఎక్కడికైనా ప్లాన్ వేయండి..
First published: January 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...