అబార్షన్‌కు 20 వారాల గడువును పెంచలేం... సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం

కేవలం గర్భిణీ ప్రాణాలు కాపాడటం కోసమే గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న నియమాన్ని తొలగించాలన్నది పిటిషనర్ల వాదన. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు బదులు ఇచ్చింది.

news18-telugu
Updated: September 19, 2019, 12:13 PM IST
అబార్షన్‌కు 20 వారాల గడువును పెంచలేం... సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
అబార్షన్‌కు 20 వారాల గడువును పెంచలేం... సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గర్భస్రావం చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గడువును 26 వారాలకు పెంచలేమని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971 చట్టంలోని సెక్షన్ 3(2) (b) ప్రకారం ప్రస్తుతం అబార్షన్ చేయించుకోవడానికి 20 వారాల వరకు గడువు ఉంది. దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్టం ప్రకారం ఉన్న 20 వారాల గడువును హేతుబద్ధంగా 26 వారాలకు పెంచాలని పిటిషనర్లు కోరుతున్నారు. అంతేకాదు... కేవలం గర్భిణీ ప్రాణాలు కాపాడటం కోసమే గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న నియమాన్ని తొలగించాలన్నది పిటిషనర్ల వాదన. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు బదులు ఇచ్చింది.

పౌరుల సంరక్షణకు కట్టుబడి ఉంటూ, నైతికతను దృష్టిలో పెట్టుకొని గర్భస్రావానికి సంబంధించిన నిబంధనల్ని చట్టసభ చాలా కఠినంగా విధించిందని కేంద్రం తెలిపింది. గర్భంలోని పిండం ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్షించడం తమ బాధ్యత అని వివరించింది. 20 వారాల తర్వాత పిండంలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు గర్భస్రావం చేయించుకున్న మహిళ కన్నా చివరి వరకు పిండాన్ని మోసిన మహిళ మానసిక వేదన నుంచి త్వరగా బయటపడ్డట్టు అనేక అధ్యయనాలు తేల్చాయని కేంద్రం వాదిస్తోంది. పిండంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా 20 వారాల తర్వాత కూడా సురక్షితం కాని గర్భస్రావ పద్ధతులు పాటిస్తుండటం వల్ల భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:

LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా

Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దుCredit Card: మీ క్రెడిట్ కార్డుపై ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు తెలుసా?
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు