CBSE : సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేరనున్న మరో 3 సబ్జెక్ట్స్

సీబీఎస్‌ఈ సిలబస్‌లో మరో మూడు సబ్జెక్ట్స్ యాడ్ కానున్నాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ పాలనామండలి నిర్ణయం తీసుకుంది.. మరిన్ని వివరాలు..

Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 2:20 PM IST
CBSE : సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేరనున్న మరో 3 సబ్జెక్ట్స్
విద్యార్థులు (నమూనా చిత్రం)
Amala Ravula | news18-telugu
Updated: March 25, 2019, 2:20 PM IST
వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సబ్జెక్ట్స్‌లో మరో 3 సబ్జెక్ట్స్ చేరనున్నాయి. 2019-20 నుంచి సీబీఎస్‌ఈ పాఠశాలల బోధన ప్రణాళికలో విద్యార్థులకు కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణకు సంబంధించిన సబ్జెక్ట్స్‌ని పాఠ్యాంశాలుగా అందించాలని సీబీఎస్‌ఈ పాలనామండలి ఇటీవలి సమావేశంలో నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
9వ తరగతిలో కృత్రిమ మేథ ఆప్షనల్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన పరిచయం 8వ తరగతిలోనే 12 గంటలు టీచ్ చేయడం జరుగుతుంది. ఇక సీనియర్ సెకండరీ స్థాయిలో యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను ప్రవేశపెడతారు. ఇందులో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో.. ప్రజెంట్ ఉన్న ఐద పాఠ్యాంశాలతో పాటు ఈ ఒక్కటి అదనపు పాఠ్యాంశం అవుతుంది.

First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...