#CBSE latest news: ఏ పరీక్ష రాస్తారు?.. స్టూడెంట్స్‌కి సీబీ‌ఎస్‌‌ఈ ఆఫర్..

బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న పదోతరగతి విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రెండు స్థాయిల మ్యాథ్స్‌ని పరిచయం చేసి ఏ పరీక్ష సులభంగా అనిపిస్తే అదే రాసుకోవచ్చని విద్యా్థులకు సూచించింది.

news18-telugu
Updated: January 11, 2019, 6:40 PM IST
#CBSE latest news: ఏ పరీక్ష రాస్తారు?.. స్టూడెంట్స్‌కి సీబీ‌ఎస్‌‌ఈ  ఆఫర్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 6:40 PM IST
2020లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే పదోతరగతి విద్యార్థులకు ఓ ఆఫర్ ఇచ్చింది సీబీఎస్‌‌ఈ. రెండు స్థాయిల మ్యాథ్స్‌ని పరిచయం చేస్తూ ఇందులో ఏ పరీక్ష సులభంగా అనిపిస్తే అదే రాసుకోవచ్చని విద్యా్థులకు సూచించింది.
తొలిసారి బోర్డు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకే సీబీఎస్‌‌ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇలా చేయడం వల్ల కాస్తా సులభంగా ఉంటుంది. కానీ, పదో తరగతి మ్యాథమెటిక్స్ కరికులమ్‌లో ఎలాంటి మార్పు ఉండదంటూ స్పష్టం చేసింది. మొత్తం చాప్టర్ అదే విధంగా ఉంటుందని తేల్చింది. దీని ప్రకారం తొలిస్థాయి ఇప్పుడున్న మ్యాథ్సే ఉండగా.. రెండో స్థాయి మ్యాథ్స్ సులువుగా ఉంటుంది. ఇప్పుడున్న మ్యాథహెటిక్స్ స్టాండర్డ్‌గా, సులువుగా ఉన్నదాన్ని బేసిక్‌గా పిలవనున్నారు. అయితే, సబ్జెక్ట్, టీచింగ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండు స్థాయిలకు సమానంగా ఉంటాయి.
ఇప్పుడు తీసుకున్ననిర్ణయం ద్వారా.. భవిష్యత్‌లో మ్యాథ్స్ తీసుకునేవారికి స్టాండర్డ్ ఉపయోగపడుతుంది. పదో తరగతి తర్వాత మ్యాథ్స్ వద్దనుకునేవారు బేసిక్ లెవల్‌కు వెళ్లొచ్చు. ఈ రెండు లెవల్స్‌లో దేనిని ఎంపిక చేసుకున్నారో స్కూల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్‌ను సబ్‌మిట్ చేసే సమయంలో స్టూడెంట్స్ చెప్పాల్సి ఉంటుంది.

అయితే.. ఇందులోనూ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.. స్టాండర్డ్ ఎంచుకున్న విద్యార్థి మ్యాథ్స్‌లో ఫెయిలైతే కంపార్ట్‌మెంట్ టైంలో స్డాండర్డ్, బేసిక్‌లోనైనా పరీక్ష రాసుకోవచ్చు. ఒకవేళ బేసిక్‌లో పాసైన విద్యార్థి కంపార్ట్‌మెంట్ టైంలో స్డాండర్డ్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు.
తాజా నిర్ణయంతో సీబీఎస్‌‌ఈ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు