హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి ? అవి ఏ స్థాయిలో ప్రమాదకరం ?

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి ? అవి ఏ స్థాయిలో ప్రమాదకరం ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breast Cancer: రొమ్ముల్లో ఏదైనా గడ్డ లేదా మార్పు నిరపాయమైనదా లేదా ప్రాణాంతకమైన క్యాన్సర్ కణితా అనేది తెలుసుకోవడానికి, అది భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందో లేదో విశ్లేషించడానికి నిపుణులైన వైద్యుల సహాయం తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ములో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది ఒకటి లేదా రెండు రొమ్ములలో ప్రారంభమవుతుంది. రొమ్ముల్లో కణాలు(Breast Cells) నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. సాధారణంగా ఇది మహిళల్లోనే సంభవిస్తుంది, కానీ పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడవచ్చు. రొమ్ముల్లో ఏర్పడే కణితులు చాలావరకు ప్రమాదకరం కానివే ఉంటాయి. క్యాన్సర్ కాని రొమ్ము కణితులు నిరపాయమైనవి, ప్రాణాంతకం కాదు. కానీ కొన్ని రకాల నిరపాయమైన రొమ్ము కణితులు.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. రొమ్ముల్లో ఏదైనా గడ్డ లేదా మార్పు నిరపాయమైనదా లేదా ప్రాణాంతకమైన క్యాన్సర్(Cancer) కణితా అనేది తెలుసుకోవడానికి, అది భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందో లేదో విశ్లేషించడానికి నిపుణులైన వైద్యుల సహాయం తీసుకోవాలి. అసలు రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి, నివారణ మార్గాలు, చికిత్స వివరాలు.. వంటి విషయాలు తెలుసుకుందాం.* రొమ్ము క్యాన్సర్ ఎక్కడ ప్రారంభమవుతుంది?
రొమ్ము క్యాన్సర్లు రొమ్ములోని వివిధ భాగాల నుంచి ప్రారంభమవుతాయి. రొమ్ము అనేది ఎగువ పక్కటెముకలు, ఛాతీ కండరాల పైన ఉండే ఒక అవయవం. రెండు రొమ్ముల్లో ప్రధానంగా గ్రంథులు, నాళాలు, కొవ్వు కణజాలం ఉంటాయి. నవజాత శిశువులు, చిన్నారులకు పోషణనిచ్చే తల్లిపాలను మహిళల రొమ్ములు తయారు చేస్తాయి. రొమ్ము పరిమాణం రొమ్ములోని కొవ్వు కణజాలంపై ఆధారపడి ఉంటుంది.
* రొమ్ము క్యాన్సర్ గురించి అర్థం చేసుకోవాలంటే, రొమ్ములోని వివిధ భాగాల గురించి తెలుసుకోవాలి. రొమ్ములో వివిధ భాగాలు ఉంటాయి. నిర్దిష్ట ప్రాంతంలో క్యాన్సర్ ప్రారంభం కావచ్చు.
- లోబుల్స్
లోబుల్స్ (Lobules) అంటే తల్లి పాలను తయారు చేసే గ్రంథులు. ఇక్కడ మొదలయ్యే క్యాన్సర్లను లోబ్యులర్ క్యాన్సర్ (Lobular cancers) అంటారు.
- డక్ట్స్ (Ducts)
డక్ట్స్ అనే నాళాలు చిన్న మార్గాలు. ఇవి లోబుల్స్ నుంచి చనుమొనకు పాలను తీసుకువెళ్తాయి. రొమ్ము క్యాన్సర్ ప్రారంభమయ్యే అత్యంత సాధారణ ప్రదేశం ఇది. ఇక్కడ మొదలయ్యే క్యాన్సర్లను డక్టల్ క్యాన్సర్ (Ductal cancers) అంటారు.
- చనుమొన (Nipple)
చనుమొన అనేది రొమ్ములోని అన్ని నాళాలు (Ducts) బాహ్య చర్మం వద్ద కలిసే ప్రాంతం. ఇక్కడ నాళాలన్నీ కలిసి వచ్చి పెద్ద నాళాలుగా మారుతాయి, తద్వారా రొమ్ము నుంచి పాలు బయటకు రావడం సులభమవుతుంది. చనుమొన చుట్టూ కొద్దిగా ముదురు, మందమైన చర్మం ఉంటుంది. దీన్ని అరోలా (Areola) అంటారు. పేజెట్ వ్యాధి (Paget disease) అనే రొమ్ము క్యాన్సర్ చనుమొనలో ప్రారంభమవుతుంది.
- లోబుల్స్, డక్ట్స్ చుట్టూ ఉండే కొవ్వు, బంధన కణజాలం (Stroma).. ఈ భాగాలను వాటి సరైన స్థానంలో ఉంచడంలో సహాయపడతాయి. ఫైలోడ్స్ ట్యూమర్ అనే తక్కువ సాధారణమైన రొమ్ము క్యాన్సర్ స్ట్రోమాలో ప్రారంభమవుతుంది.
- రొమ్ములో రక్త నాళాలు, లింఫ్ వెసల్స్ కూడా ఉంటాయి. ఈ నాళాల లైనింగ్‌లో యాంజియోసార్కోమా (Angiosarcoma) అనే రొమ్ము క్యాన్సర్ ప్రారంభం కావచ్చు. ఇది ఈ నాళాల లైనింగ్‌లో ప్రారంభమవుతుంది.
- రొమ్ములోని ఇతర కణజాలాలలో తక్కువ సంఖ్యలో క్యాన్సర్లు ప్రారంభమవుతాయి. ఈ క్యాన్సర్‌లను సార్కోమాస్ (Sarcomas), లింఫోమాస్ (Lymphomas) అని పిలుస్తారు. అయితే వీటిని నిజమైన రొమ్ము క్యాన్సర్‌లుగా భావించరు.
* రొమ్ము క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది
క్యాన్సర్ కణాలు రక్తం లేదా శోషరస వ్యవస్థలోకి (Lymph system) ప్రవేశించి, శరీరంలోని రొమ్ములు లేదా ఇతర భాగాలకు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.
శోషరస వ్యవస్థ (Lymph or Lymphatic system) అనేది మన శరీర రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం. ఇది శోషరస కణుపులు (చిన్న, బీన్-పరిమాణ గ్రంధులు), డక్ట్స్ లేదా నాళాలు (వెసల్స్), ఇతర అవయవాలతో కూడిన నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ శరీర కణజాలాల ద్వారా రక్తానికి శోషరస ద్రవాన్ని తీసుకువెళ్లేలా పనిచేస్తుంది. శోషరస నాళాలలోని శోషరస ద్రవం (Lymph fluid).. కణజాలాల బై-ప్రొడక్ట్స్, వ్యర్థ పదార్థాలతో పాటు రోగనిరోధక కణాలను కలిగి ఉంటుంది.
* శోషరస నాళాలు రొమ్ము నుంచి శోషరస ద్రవాన్ని తీసుకువెళతాయి. రొమ్ము క్యాన్సర్ విషయంలో, క్యాన్సర్ కణాలు ఆ శోషరస నాళాలలోకి ప్రవేశించి శోషరస కణుపులలో పెరగడం ప్రారంభిస్తాయి. రొమ్ము శోషరస నాళాలు చాలా మార్గాల్లో ప్రవహిస్తాయి. అవేంటంటే..
- చేయి కింద ఉండే లింఫ్ నోడ్స్ లేదా శోషరస కణుపులు (Axillary lymph nodes)
- ఛాతీ ఎముక దగ్గర ఛాతీ లోపల శోషరస కణుపులు (Internal mammary lymph nodes)
- కాలర్ బోన్ చుట్టూ ఉండే శోషరస కణుపులు (కాలర్ ఎముక పైన ఉండే Supraclavicular, కాలర్ ఎముక కింద ఉండే Infraclavicular లింఫ్ నోడ్స్)


క్యాన్సర్ కణాలు లింఫ్ నోడ్స్‌కు వ్యాపిస్తే, ఆ కణాలు శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే (Metastasized) అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే లింఫ్ నోడ్స్‌లో క్యాన్సర్ కణాలు ఉన్న మహిళలందరికీ మెటాస్టేజ్‌ దశ ఎదురుకాదు. అలాగే లింఫ్ నోడ్స్‌లో క్యాన్సర్ కణాలు లేని మహిళల్లో కూడా మెటాస్టేజ్‌ అభివృద్ధి చెందవచ్చు.
Cholesterol For Ages: మీ వయసు ప్రకారం.. మీ శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలో తెలుసా ?.. డాక్టర్లు ఏమంటున్నారంటే..
Causes Of Diabetes: అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది ?..ఈ సమస్యకు దారితీసే కారణాలు ఏవి?
* రొమ్ము క్యాన్సర్ రకాలు
రొమ్ము క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వ్యాధితో ప్రభావితమైన రొమ్ములోని నిర్దిష్ట రకాల కణాల ద్వారా అది ఏ రకం అనేది వైద్యులు నిర్ణయిస్తారు. సాధారణంగా చాలా రకాల రొమ్ము క్యాన్సర్లు కార్సినోమాలు (Carcinomas). డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS), ఇన్వాసివ్ కార్సినోమా వంటి అత్యంత సాధారణ రొమ్ము క్యాన్సర్‌లు అడెనోకార్సినోమాలు (Adenocarcinomas). ఈ క్యాన్సర్‌లు మిల్క్ డక్ట్స్ లేదా లోబుల్స్ (పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు)లోని గ్రంథి కణాలలో ప్రారంభమవుతాయి. ఆంజియోసార్కోమా లేదా సార్కోమా వంటి ఇతర రకాల క్యాన్సర్‌లు కూడా రొమ్ములో పెరుగుతాయి. కానీ అవి రొమ్ములోని వివిధ కణాలలో ప్రారంభమవుతాయి కాబట్టి రొమ్ము క్యాన్సర్‌గా పరిగణించరు.
రొమ్ము క్యాన్సర్లను కొన్ని రకాల ప్రొటీన్‌లు లేదా క్యాన్సర్‌కు సంబంధించిన జన్యువుల ఆధారంగా కూడా వర్గీకరిస్తారు. కణితి కణాలను ల్యాబ్‌లో నిశితంగా పరిశీలించి అది ఏ గ్రేడ్‌లో ఉందో తెలుసుకుంటారు. గుర్తించిన నిర్దిష్ట ప్రోటీన్లు, కణితి గ్రేడ్ అనేవి క్యాన్సర్ ఏ స్థాయిలో ఉంది, దీనికి ఎలాంటి చికిత్స అందించాలనే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Breast cancer

ఉత్తమ కథలు