కరోనా మహమ్మారి మనుషులకు చుక్కలు చూపిస్తోంది. వేవ్‌ల వారీగా వరుసగా వస్తూ, ప్రజలను అన్ని రకాల కష్టాలూ పెడుతోంది. ఆర్థికంగా ఓవైపు చితికిపోతుంటే, మరోవైపు ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఆరోగ్య ఇబ్బందుల్లో కంటి సమస్యలు కూడా చేరాయి అంటున్నారు వైద్య నిపుణులు. ప్రముఖ నేత్ర వైద్యశాల అయిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కళ్లు ఒత్తిడికి గురవడం, పొడిబారడటం వంటి సమస్యలు ఈ మధ్య కాలంలో.. అంటే కరోనా మహమ్మారి తర్వాత కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్‌లు అంటూ అందరూ డిజిటల్ స్క్రీన్స్‌ను ఎక్కువగా చూడటం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయని అగర్వాల్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అమర్ అగర్వాల్ చెబుతున్నారు. దీంతోపాటు కాటరాక్ట్ కేసుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. 2019 ఆఖరి మూడు నెలలో వచ్చిన కాటరాక్ట్ కేసులతో పోలిస్తే... 2020 ఆఖరి మూడు నెలల్లో వచ్చిన కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో 50 శాతం కంటే ఎక్కువ కేసులే వచ్చాయట.
గతేడాది తొలి వేవ్ సమయంలో కరోనా భయంతో చాలా వరకు కంటి వైద్యం, సమస్యల నివారణ కోసం ముందుకు రావడానికి చాలామంది భయపడ్డారు. దీంతో కంటి సమస్యలు ఎక్కువయ్యాయని అగర్వాల్ హాస్పిటల్ సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో కంటి సమస్యలు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రజలు వెంటనే వైద్యం కోసం సంప్రదించాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు సమయంలో ప్రజలు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు చూసినా... అది విధుల సమయం వరకే ఉండేది. అయితే కరోనా వచ్చాక... వర్క్ ఫ్రమ్‌హోమ్ రావడం, అవసరాలు పెరగడంతో వర్కింగ్ అవర్స్ పెరిగాయి. దీంతో కళ్ల సమస్యలు పెరుగుతున్నాయి.
ఇక విద్యార్థుల సంగతి చూస్తే... చదువుకునే సమయం కాకుండా మిగిలిన సమయం మొబైల్స్, ట్యాబ్స్, సిస్టమ్స్ చూసేవారు. లేదంటే అదనపు సమాచారం కోసమో, ప్రాజెక్టుల కోసమే డిజిటల్ స్క్రీన్స్ అవసరం ఉండేవి. అయితే ఇప్పుడు చదువు అంతా డిజిటల్ స్క్రీన్ల ద్వారానే జరుగుతోంది. దీంతో సిస్టమ్ అవసరం పెరిగింది, కళ్ల సమస్య కూడా పెరిగింది. ఈ సమస్యలకు సాయం చేయడానికి అగర్వాల్ ఆసుపత్రి ఉచిత ఆన్‌లైన్ కన్సల్టన్సీని ఏర్పాటు చేసింది. 9167376973 నెంబరుకు డయల్ చేసి, లేదా www.dragarwal.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు.
ఇది చూడండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lifestyle