• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • CARROTS HEALTH BENEFITS THIS IS THE BEST SEASON TO EAT CARROTS KNOW THE HEALTH BENEFITS OF IT MS GH

Carrots Benefits: క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ రోజూవారి ఆహారంలో వీటిని ఇలా చేర్చండి

Carrots Benefits: క్యారెట్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ రోజూవారి ఆహారంలో వీటిని ఇలా చేర్చండి

ప్రతీకాత్మక చిత్రం

Carrots Health Benefits: క్యారెట్లు(Carrots) రోగనిరోధక శక్తి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇవి సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభిస్తాయి. క్యారెట్లలో అధిక పోషకాహార విలువలు ఉండటమే కాక, వీటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

  • News18
  • Last Updated:
  • Share this:
Carrots Benefits: కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. దీంతో చాలా మంది జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలాంటి పోషకాలు పుష్కలంగా లభించే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్లు(Carrots), బీట్‌రూట్(Beetroot), ముల్లంగి(Radish) వంటి కూరగాయలు రోగనిరోధక శక్తి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇవి సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభిస్తాయి. క్యారెట్లలో అధిక పోషకాహార విలువలు ఉండటమే కాక, వీటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

అందువల్ల మీ రోజూ వారి డైట్ ప్రణాళికలో క్యారెట్లను చేర్చడం మర్చిపోకండి. క్యారెట్లు అందించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. వాటిపై ఓలుక్కేయండి.

క్యారెట్లతో ఆరోగ్య ప్రయోజనాలు

1. క్యారెట్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. సుమారు 100 గ్రాముల క్యారెట్‌లో 40 కేలరీలు(Calories) ఉంటాయి. అందువల్ల, వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు(Weight loss).

2. క్యారెట్లలో అధిక పోషకలు ఉంటాయి. వీటిలో విటమిన్ ‘ఎ’, బీటా కెరోటిన్(Beta Carotene), లుటిన్ (Lutein )వంటివి పుష్కలంగా లభిస్తాయి. దీన్ని మీ రోజూవారి డైట్‌లో తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం(Eye healthy) గణనీయంగా మెరుగుపడుతుంది.

3. క్యారెట్లలో ఫైబర్(Fibre) కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇవి ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడం, జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడం వంటి వాటికి సహాయపడుతుంది.

4. శరీరంలోని చెడు కొవ్వు(Cholesterol )ను తగ్గించడానికి క్యారెట్లు సహాయపడతాయి. ఇది గుండె సబంధిత సమస్యలను దూరం చేయడానికి బాగా పనిచేస్తుంది.

5. క్యారెట్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) అధికంగా ఉంటాయి. ఇవి చర్మంతో పాటు జుట్టును పెంచడానికి సహాయపడతాయి. అందుకే, కాస్మెటిక్ కంపెనీలు తమ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో క్యారెట్ కంటెంట్ ఉందని పేర్కొనడానికి ఇది కూడా ఒక కారణం.



మీ రోజూవారి ఆహారంలో క్యారెట్లను ఇలా జోడించండి

క్యారెట్ జ్యూస్

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అర గ్లాసు క్యారెట్ జ్యూస్(Juice)ను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేయగలదని డాక్టర్లు పేర్కొంటున్నారు. అంతేకాక, ఇది జీర్ణాశయ సమస్యలు, మలబద్ధకం సమస్యలను దూరం చేయగలదు. క్యారెట్ జ్యూస్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

క్యారెట్ సలాడ్

క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ సలాడ్‌(Salad )తో కలిపి త్రాగండి. ఇది అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.

పచ్చి క్యారెట్లు

పచ్చి క్యారెట్లను తినడం ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, పచ్చి క్యారెట్లను తినే ముందు వాటిని పూర్తిగా శుభ్రపరచాలని గుర్తించుకోండి. వీటిని స్నాక్స్లో కూడా చేర్చి తినవచ్చు.

క్యారెట్ సూప్

సూప్‌లతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. తక్కువ కేలరీల కంటెంట్, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, క్యారెట్లు అద్భుతమైన సూప్‌(Soup)లను తయారు చేయగలవు.
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు