క్యాప్సికం రోజూ ఆహారంలో చేరిస్తే డయాబెటిస్ దూరం..

క్యాప్సికంలో ఆల్ఫా గ్లూకోజైడేజ్‌, లైపేజ్ అనే రెండు ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కార్పొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్ర‌క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తాయి.

news18-telugu
Updated: December 1, 2019, 10:53 PM IST
క్యాప్సికం రోజూ ఆహారంలో చేరిస్తే డయాబెటిస్ దూరం..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
క్యాప్సికంను కూడా వారు రోజూ ఆహారంలో తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. క్యాప్సికంలో ఆల్ఫా గ్లూకోజైడేజ్‌, లైపేజ్ అనే రెండు ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కార్పొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్ర‌క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తాయి. దీంతో కార్బొహైడ్రేట్ల‌ను తిన్న వెంట‌నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి. అలాగే క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉంటాయి. క‌నుక ఒత్తిడి త‌గ్గాలంటే.. క్యాప్సికంను తినాలని సూచిస్తున్నారు. అలాగే క్యాప్సికం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...