Home /News /life-style /

CANT DIGEST THE FOOD EATEN THEN FOLLOW THESE TIPS EVERY MORNING AND AVOID THE PROBLEM PRV

Health tips; తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌ (gas), అసిడిటీ (acidity), క‌డుపు నొప్పి (stomach pain), అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుచుకునేందుకు, తిన్న ఆహారం (food) సరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
ఉరుకుల పరుగుల జీవితం (life). కరోనా ఒక్కసారిగా మీద పడటంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. వైద్యం కోసం ఆసుపత్రులు (hospitals) తిరగాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆర్థిక కష్టాలు (financial problems) మీద పడ్డాయి. సమయానికి నిద్ర పోవడం లేదు. వేళకు తినడం లేదు. రాత్రిళ్లు ఇంట్లో ఆహారం కాకుండా ఫాస్ట్​ఫుడ్​ వెంట పడుతున్నారు జనం. అయితే ఫాస్ట్​ఫుడ్ (fast food) తో జీర్ణం కాక... అధిక బరువు పెరగడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు (health problems) తలెత్తుతున్నాయి. ఇక మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతో పాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌టంలో జీర్ణ వ్య‌వ‌స్థ (digestive system) పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌ (gas), అసిడిటీ (acidity), క‌డుపు నొప్పి (stomach pain), అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుచుకునేందుకు, తిన్న ఆహారం (food) సరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

ఉదయాన్నే..

నిత్యం ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు (before breakfast) కొద్దిగా అల్లం ర‌సం (ginger juice) సేవిస్తే.. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే వికారం, వాంతులు (vomiting’s) త‌గ్గుతాయి. గ్యాస్‌,  అసిడిటీ రాకుండా ఉంటాయి. భోజ‌నానికి ముందు పుదీనా ర‌సం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం 9food) స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది, విరేచ‌నాలు ఆగుతాయి.

ఇది కూడా చదవండి: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

యాపిల్​తో..

యాపిల్ (apple) పండ్ల‌ (fruits)లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ (fiber) జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డం (eat fruits) వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.  సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది (digest).

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Food, Life Style, Stomach Pain

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు