హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఇండియాలో ఆపరేషన్ ఒక్కటే కాకుండా క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ ఎన్ని రకాలు? వాటిని ఎలా చేస్తారు?

ఇండియాలో ఆపరేషన్ ఒక్కటే కాకుండా క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ ఎన్ని రకాలు? వాటిని ఎలా చేస్తారు?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మానవ శరీరంలోని వివిధ భాగాలకు క్యాన్సర్ రావచ్చు. అందువల్ల వ్యాధి రకాన్ని బట్టి చికిత్సను ఎంచుకుంటారు. ఇండియాలో వివిధ రకాల క్యాన్సర్లకు అందుబాటులో ఉన్న చికిత్స మార్గాలు ఏవో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra

క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంటుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనా, కొన్ని రకాల చికిత్స పద్ధతులతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. అయితే మానవ శరీరంలోని వివిధ భాగాలకు క్యాన్సర్ రావచ్చు. అందువల్ల వ్యాధి రకాన్ని బట్టి చికిత్సను ఎంచుకుంటారు. ఇండియాలో వివిధ రకాల క్యాన్సర్లకు అందుబాటులో ఉన్న చికిత్స మార్గాలు ఏవో తెలుసుకుందాం.

రేడియేషన్ థెరపీ (Radiation Therapy)

క్యాన్సర్‌ను నయం చేసేందుకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. కానీ వీటన్నింట్లో రేడియేషన్ థెరపీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో కణాలను చంపడానికి, కణితులను నిర్వీర్యం చేయడానికి పెద్ద మొత్తంలో రేడియేషన్‌ ఉపయోగిస్తారు. ప్రత్యేకించి ప్రోస్టేట్ లేదా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఇది బెస్ట్ ట్రీట్‌మెంట్. రేడియేషన్ థెరపీలో రెండు రకాల చికిత్సలు ఉన్నాయి. అవే ఎక్స్‌టర్నల్ రేడియేషన్, ఇంటర్నల్ రేడియేషన్.

Bad Cholesterol: బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఏయే ఫుడ్స్‌లో ఎక్కువ ఉంటుంది? దీని లక్షణాలు ఏంటి? అనర్థాలేంటి?ఎక్స్‌టర్నల్ రేడియేషన్ బీమ్

ఎక్స్‌టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ఒక రూపం. ఈ విధానంలో క్యాన్సర్ కణితి వద్ద అధిక మోతాదులో ఎనర్జీని కేంద్రీకృతం చేయడానికి శక్తివంతమైన కిరణాలను ఉపయోగిస్తారు. ఇందుకు ఉపయోగించే యంత్రం పెద్దదిగా ఉంటుంది. దీన్ని వాడే సమయంలో శబ్దం కూడా రావచ్చు. అయితే దీని సాయంతో ట్రీట్‌మెంట్ చేసే టెక్నీషియన్‌.. వివిధ కోణాల నుంచి చికిత్స నిర్వహిస్తారు. కాబట్టి ఈ విధానంలో లోకలైజ్డ్ రేడియోథెరపీతో పోలిస్తే ఎక్కువ ప్రాంతాన్ని ఒకే సెషన్‌లో కవర్ చేస్తారు. ఇలాంటి రేడియేషన్‌ను నిర్వహించే టెక్నీషియన్స్, యంత్రాలను ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. బ్రాచిథెరపీ (brachytherapy) లేదా స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ (SBR) వంటి సంప్రదాయ పద్ధతులలో పోలిస్తే ఎక్స్‌టర్నల్ బ్లాస్ట్ రేడియేషన్ చికిత్స చేసేటప్పుడు టెక్నీషియన్స్‌పై తక్కువ ఒత్తిడి ఉంటుంది.

Nutrition Myths: ఫుడ్ విషయంలో ఎక్కువమంది నమ్మే అపోహలు ఇవే.. అది తినకూడదు.. ఇది తినకూడదు అంటుంటారు.. అసలు నిజాలేంటో తెలుసుకోండి..!ఇంటర్నల్ రేడియేషన్ ట్రీట్‌మెంట్

ఇంటర్నల్ రేడియేషన్ థెరపీలో బాధితుల శరీరం లోపల రేడియేషన్ సోర్స్‌ను ఉంచుతారు. ఈ విధానంలో అత్యంత సాధారణ రకం బ్రాకీథెరపీ. ఇటీవలి కాలంలో ఈ చికిత్స మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. శరీరంలో ఏర్పడ్డ క్యాన్సర్ కణితులను చేరుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా వాటిని తొలగించడం అసాధ్యం. ఈ సమయంలో ఇంటర్నల్ రేడియేషన్ థెరపీని వివిధ పద్ధతుల ద్వారా నిర్వహించవచ్చు. శరీరం లోపల సీడ్స్, రిబ్బన్లు లేదా క్యాప్సూల్స్‌ను క్యాన్సర్ కణజాలానికి సమీపంలో ఉంచడం (ఇంటర్‌స్టీషియల్ ఇంప్లాంటేషన్ అని పిలుస్తారు) లేదా సర్జరీ ద్వారా తొలగించిన అవయవం వద్ద ఉన్న చర్మం కింద, వీలైనంత దగ్గరగా రేడియోధార్మిక పదార్థాన్ని అమర్చడం ద్వారా (పెర్క్యుటేనియస్ ఇప్సిలేటరల్ బ్రాచియల్ ప్లేక్ అప్లికేషన్) ఈ ప్రక్రియ చేపడతారు.

కీమోథెరపీ (Chemotherapy)

క్యాన్సర్ కణాలను చంపడానికి శక్తివంతమైన ట్రీట్‌మెంట్‌ కీమోథెరపీ. కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడం లేదా మందగించడం ద్వారా వ్యాధిని నిర్మూలించే ఒక రకమైన మెడిసిన్. వేగంగా పెరుగుతూ కణ విభజన చెందే క్యాన్సర్ కణాలను నిరోధించేందుకు కీమోథెరపీని రెండు విధాలుగా నిర్వహిస్తారు. ముందు క్యూరేటివ్ ఇంటెంట్ అనే విధానంలో చికిత్స చేస్తారు. ఈ చికిత్స క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తుంది. ఇందులో పాలియేటివ్ కేర్‌ మాదిరిగా క్యాన్సర్ కణితులు పునరావృతమయ్యే అవకాశం లేదు. తర్వాత కణితుల వల్ల కలిగే నొప్పి, వికారం వంటి లక్షణాలను సిస్ప్లాటిన్ (cisplatin) వంటి కెమోథెరపీ మందులు నిర్మూలిస్తాయి. కణితి కుంచించుకుపోయినప్పుడు వచ్చే రక్తపోటు సమస్యల కారణంగా ఎదురయ్యే తలనొప్పిని తగ్గిస్తాయి. అయితే కీమోథెరపీ క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాల మరణానికి కూడా దారితీస్తుంది. ఉదాహరణకు నోటి క్యాన్సర్‌కు కీమోథెరపీ చేస్తే నోటి లోపలి భాగంలో పుండ్లు ఏర్పడవచ్చు. పేగు క్యాన్సర్‌కు ఈ విధానంలో చికిత్స చేసినప్పుడు బాధితులు వికారం వంటి దుష్ప్రభావాల బారిన పడవచ్చు.

Beauty Sleep: ఎక్కువ నిద్రపోతే అందంగా అవుతారా..? ఇందులో నిజమెంతో తెలుసుకోండి..!క్యాన్సర్ శస్త్రచికిత్స

కొన్ని రకాల క్యాన్సర్లకు సర్జరీ చేసి రోగి శరీరం నుంచి క్యాన్సర్ కణితిని భౌతికంగా తొలగించవచ్చు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో, ఒకేచోట ఏర్పడ్డ కణితులను మాత్రమే సర్జరీ ద్వారా తొలగించే వీలుంటుంది. ఇది లోకల్ ట్రీట్‌మెంట్ అని చెప్పవచ్చు. అయితే లుకేమియా లేదా శరీరంలోని చాలా భాగాల్లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్ కణితులను సర్జరీ ద్వారా తొలగించడం సాధ్యం కాదు. క్యాన్సర్‌కు సర్జరీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ మార్గం ప్రామాణికంగా ఉంటుంది. 

Teeth problems: నోటి దుర్వాసన ఈ సింపుల్​ చిట్కాతో మటుమాయం.. ప్రయత్నించండిఈ ట్రీట్‌మెంట్ లక్ష్యాల్లో కణితిని పూర్తిగా తొలగించడం మొదటిది. మొత్తం కణితిని తొలగించడం వల్ల ఒక అవయవం లేదా శరీరం దెబ్బతినే అవకాశం ఉంటే, కణితిని డీబల్కింగ్ చేస్తారు లేదా పాక్షికంగా తొలగిస్తారు. ఆ తర్వాత ఇతర చికిత్సల ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలించి, సమీపంలోని అవయవాలపై ప్రభావం పడకుండా కాపాడవచ్చు. మృదు కణజాలంపై ఒత్తిడిని కలిగించే కణితి భాగాలను సర్జరీ ద్వారా తొలగించి.. నొప్పి, ఇతర క్యాన్సర్ లక్షణాలను తగ్గిచడం ఈ పద్ధతిలోని చివరి లక్ష్యం.

ఇమ్యునోథెరపీ (Immunotherapy)

ఇమ్యునోథెరపీ లేదా ఇమ్యునో-ఆంకాలజీ విధానంలో రోగి సొంత వ్యాధి నిరోధక వ్యవస్థను ఉపయోగించి క్యాన్సర్‌ను నయం చేస్తారు. ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి మన రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని ఉపయోగించే బయోలాజికల్ థెరపీ. మన రోగనిరోధక వ్యవస్థ సొంతంగానే అసాధారణ కణాల పెరుగుదలను గుర్తించి, నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో అనేక క్యాన్సర్‌ల అభివృద్ధిని నిరోధిస్తుంది. అనేక క్యాన్సర్ కణితుల దగ్గర ట్యూమర్-ఇన్‌ఫిల్ట్రేటింగ్-లింఫోసైట్‌లు లేదా TILలు కనిపించడానికి ఇదే కారణం. క్యాన్సర్ కణితి చుట్టూ ఉన్న TILలు రోగి రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ పెరుగుదలకు ప్రతిస్పందిస్తోందనడానికి సూచన.

Type 1 Diabetes: టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరికి వస్తుంది? రాకుండా ఏం చేయాలి?అయితే క్యాన్సర్ కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థ బారిన పడకుండా జన్యు మాస్కింగ్ చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో రోగనిరోధక కణాలను నిష్క్రియం చేసే ప్రోటీన్‌లను క్యాన్సర్ కణాలు ఉపరితలంపై అమర్చుకుంటాయి. లేదా ఆరోగ్యకరమైన కణాలను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటాయి. దీంతో మన శరీర వ్యవస్థలు దాన్ని గుర్తించలేవు, నాశనం చేయలేవు. ఇలాంటి సందర్భంలో ఇమ్యునోథెరపీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ను నాశనం చేయడానికి కొన్ని రకాల ఇమ్యునోథెరపీలను నిర్వహించవచ్చు. అవేంటంటే..


  1. ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్

  2. మోనోక్లోనల్ యాంటీబాడీస్

  3. T-సెల్ ట్రాన్స్ఫర్ థెరపీ

  4. ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేటర్స్


ఇమ్యునోథెరపీకి సంబంధించిన అనేక పరిశోధనలు, ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చినట్లు నిరూపించాయి. దీంతో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కంటే ఇమ్యునోథెరపీకే వైద్యులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

First published:

Tags: Breast cancer, Cancer, Health Tips

ఉత్తమ కథలు