ఈ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక రోగాల్లో క్యాన్సర్ (Cancer Disease) ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఎంతో మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వైద్యరంగంలో సరికొత్త సాంకేతిక వచ్చినా.. శాస్త్రవేత్తలు కొత్తకొత్త మందులు కనిపెడుతున్నా.. క్యానర్ భూతం మాత్రం మనల్ని వదలడం లేదు. ఐతే ఇన్నాళ్లు ఓ సానుకూల ఫలితం వచ్చింది. ముల్లును ముల్లుతోనే తీసినట్లు.. వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్లు... క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఓ వైరస్‌ను ప్రయోగిస్తున్నారు. ఈ వైరస్ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కణాల భరతం పడుతుంది. క్యాన్సర్‌ను నాశనం చేసే రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అమెరికాలో ఇప్పటికే ఓ క్యాన్సర్ బాధితుడికి ఈ వైరస్‌తో కూడిన ఔషధాన్ని ఇచ్చారు. క్యాన్సర్ పేషెంట్‌కు ఇలాంటి మందు ఇవ్వడం వైద్య చరిత్రలో ఇదే తొలిసారి.
లిచీ పండ్లు తెలుసా? వీటి లాభాలు అన్నీ ఇన్నీ కావు.. తెలిస్తే షాకవ్వాల్సిందే
అమెరికా (America)లోని సిటీ ఆఫ్ హోప్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఆస్ట్రేలియా (Australia)కు చెందిన ఇమ్యూజీన్ సంస్థ శాస్త్రవేత్తలు CF33-hNIS అనే జన్యుమార్పిడి వైరస్‌తో క్యాన్సర్ ఔషధానాన్ని అభివృద్ధి చేశారు. దీనినే వ్యాక్సీనియా (Vaxinia) అని పిలుస్తున్నారు. దీనిని క్యాన్సర్ పేషెంట్ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. అది క్యాన్సర్ కారక కణాలకు ఇన్పెక్షన్ కలిగిస్తుంది. ఆరోగ్యకమైన కణాలను జోలికి మాత్రం వెళ్లదు. ఇలాంటి వైరస్‌లను వైద్య పరిభాషలో అంకోలైటిక్ వైరస్‌గా పేర్కొంటారు. వ్యాక్సీనియా.. క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశించి.. తన సంఖ్యను అమాంతం పెంచుకుంటుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారినపడిన క్యాన్సర్ కణాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ క్రమంలోనే వేల సంఖ్యలో వైరస్ కణాలు బయటకు వచ్చి.. యాంటీజెన్లా పనిచేస్తాయి. ఇవన్నీ తమ సమీపంలో ఉండే క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఈ తరహా వైద్య చికిత్స ఇమ్యునో థెరపీగా పిలుస్తారు.
Hair problem tips: మీ జుట్టు రాలిపోవడం మొదలైందా? అయితే ఈ టిప్స్ పాటించి.. జుట్టు బలంగా చేసుకోండి
వ్యాక్సీనియాను ఇప్పటికే జంతువులపై ప్రయోగించగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు మనుషులపై ప్రయోగిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాల క్యాన్సర్ బాగా ముదిరిపోయి.. ఇక ఏ చికిత్స ఇచ్చినా ఫలితం ఉండదనే స్థితిలో ఉన్న.. 100 మంది రోగులను ఎంపిక చేసి.. వారికి వ్యాక్సీనియా మందు ఇస్తారు. ఇందులోని వైరస్ హ్యూమన్ సోడియం అయోడైడ్ సింపోర్టర్ (HNIS) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వైరస్ క్యాన్సర్ కణాల్లోకి వెళ్లి.. తమ సంఖ్యను పెంచుకునే తీరును చిత్రీకరిస్తుంది. రేడియో ధార్మిక అయోడిన్‌ను జోడిస్తే.. క్యాన్సర్ కణాలకు మరింత నష్టం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులకు ఈ మందు సురక్షితమేనా? అని మొదట పరీక్షిస్తారు. దీనిని క్యాన్సర్ రోగులు తట్టుకుంటారా? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అనే అంశాలను ట్రయల్స్‌లో గమనిస్తారు. అన్నీ విజయంతమైతేనే మనుషులు ఈ మందును వాడేందుకు ఆమోదం లభిస్తుంది. ఇది ఎలాంటి హాని చేయకుండా.. ప్రభావవంతంగా పనిచేస్తే.. క్యాన్సర్‌పై పోరులో సరికొత్త ఆయుధం వచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Medical Research, Medical study, Technology