Weight loss tips: ఆహారం నెమ్మదిగా నమిలి తింటే బరువు తగ్గుతారా? ఇది ఎంత వరకు నిజం?

ప్రతీకాత్మక చిత్రం

వ్యాయామాలు చేయడానికి సమయం లేని వాళ్ళు, జిమ్​ వెళ్లడానికి టైం లేనివాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల క్రమంగా  బరువు తగ్గుతారట (weight loss). ఎందుకంటే ఆహారాన్ని బాగా నమలడం వల్ల జీర్ణక్రియ (digestive) కూడా  సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా  బరువు తగ్గుతారట.

  • Share this:
    అసలే బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. కాగా, సమయాభావం వల్ల చాలామంది త్వరత్వరగా (fast) తినేస్తుంటారు. ఫలితంగా అధిక బరువుకు కారణం అవుతాం.. నెమ్మదిగా తింటే (slow eating)  బరువు తగ్గుతారట. ఈ విషయాలు ఒకసారి తెలుసుకుందాం..

    బరువు తగ్గాలంటే..

    సమయం లేదని త్వరత్వరగా వేగంగా తినడం (fast eat) వల్ల అనారోగ్య సమస్యలు (health problems) వస్తాయట.  ఆరోగ్య నిపుణులు మాత్రం ఆహారాన్ని నెమ్మదిగా తినాలని (slow eat) సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఆరోగ్యం (health) బాగుండటమే కాకుండా, బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు (experts) తెలియజేస్తున్నారు. వ్యాయామాలు చేయడానికి సమయం లేని వాళ్ళు, జిమ్​ వెళ్లడానికి టైం లేనివాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల క్రమంగా  బరువు తగ్గుతారట (weight loss). ఎందుకంటే ఆహారాన్ని బాగా నమలడం వల్ల జీర్ణక్రియ (digestive) కూడా  సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా  బరువు తగ్గుతారట. ఆహారం వేగంగా తినే వారి కంటే, బాగా నమిలి నెమ్మదిగా తినే  వాళ్లకు  ముడతలు పడకుండా ఉంటుంది.

    వేగంగా తింటే అనారోగ్య సమస్యలు..

    బరువు పెరగడానికి (weight gain) ముఖ్యకారణం వేగంగా తినడం కూడా ఒకటి. ఇలా  తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందవు. అంతేకాకుండా వేగంగా భోజనం చేయడం వల్ల మధుమేహం (diabetes) కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఇక మానసిక  ప్రశాంతతతో పాటు ఒత్తిడి(stress) తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. సంతోషంగా జీవనాన్ని సాగించవచ్చు.

    పెద్దలు నెమ్మదిగా తింటారు.  అయితే పిల్లలు మాత్రం చాలా వేగంగా తింటుంటారు. అలా తినకుండా ఉండాలంటే చిన్న పిల్లలకు ఆహారం ఎలా తినాలి. ఈ విధంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని  పిల్లలకు నేర్పించాలి. వేగంగా తినడం వల్ల కలిగే అనారోగ్యాలు గురించి పిల్లలకు  చెప్పాలి. పిల్లలతో పాటు పెద్దలు కూడా  ఆహారాన్ని బాగా నమిలి దానంగా తినడంవల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.  అందుకే అందరూ తెలుసుకొని ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం మంచిది. మీ బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published: