Home /News /life-style /

CAN WE TRAVEL WITH YOUNG KIDS DURING COVID 19 PANDEMIC KNOW HERE BA GH

Covid Guidelines: పిల్లలతో కలిసి ప్రయాణాలు చేయవచ్చా? తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెద్దల్లో ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో రెండు డోసుల టీకా తీసుకున్న వారు ఉన్నారు. అయితే చాలా దేశాల్లో పిల్లలకు ఇంకా టీకాలు అందుబాటులోకి రాలేదు. అందులోనూ మూడో వేవ్​లో పిల్లలకు వైరస్ ప్రమాదం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ విలయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా దేశాల్లో లాక్​డౌన్ నిబంధనల్లో సడలింపులు వస్తున్నాయి. ప్రయాణ ఆంక్షలు సైతం క్రమంగా ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా చతికిలపడిన ఆర్థిక రంగం గాడిలో పడేందుకు కార్యకలాపాలను ప్రభుత్వాలు మళ్లీ ప్రారంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం సొంత ప్రాంతాల నుంచి కార్యాలయాలు ఉన్న నగరాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే తమ వెంట పిల్లలను తీసుకెళ్లడంపై ఇప్పుడు పెద్దల్లో సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే..

పెద్దల్లో ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో రెండు డోసుల టీకా తీసుకున్న వారు ఉన్నారు. అయితే చాలా దేశాల్లో పిల్లలకు ఇంకా టీకాలు అందుబాటులోకి రాలేదు. అందులోనూ మూడో వేవ్​లో పిల్లలకు వైరస్ ప్రమాదం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు వ్యాక్సినేషన్ పూర్తి కాని పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు ప్రకటించాయి కొన్ని దేశాలు. దీంతో పెద్దల్లో ఆందోళన నెలకొంది. వారిని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ తీసుకెళ్లినా క్వారంటైన్ నిబంధనల వల్ల వారాల పాటు ఒంటరిగా వదిలేయాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.

వివిధ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో నిబంధనలు సడలిపోవడం, ప్రయాణాలు మళ్లీ మొదలవడంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రారంభమైంది. దీంతో తమ చిన్నారులను వెంట ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ పూర్తికాని పిల్లలను అనుమతించాలంటే కఠిన నిబంధనలను కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా హాంకాంగ్​కు ఎంతో మంది వెళుతుంటారు. ఉద్యోగాలతో పాటు పర్యాటకంగానూ ఆ దేశానికి చాలా ప్రయాణిస్తుంటారు. అయితే పిల్లల కోసం ఆ దేశం ప్రత్యేక నిబంధలను అమలులోకి తెచ్చింది. వ్యాక్సినేషన్ పూర్తికాని పిల్లలు తమ దేశంలోకి రావాలంటే 72 గంటలకు మించకుండా నెగెటివ్ వచ్చిన టెస్టు రిపోర్టును సమర్పించడంతో పాటు ప్రభుత్వ పరిధిలో 21 క్వారంటైన్​లో ఉండాలనే రూల్ పెట్టింది. ఆ సమయంలోనూ మరికొన్ని కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళితే పిల్లలకు పెద్దలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భావోద్వేగపరమైన అంశం కావడంతో ఆ దేశానికి వెళ్లాల్సిన వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే పిల్లలు క్వారంటైన్​లో ఉండడంతో పాటు తరచూ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని చైనా కూడా రూల్​ తెచ్చింది. వారు చైనాకు చేరే సమయాన్ని బట్టి మార్గదర్శకాలను పాటించాలని వెల్లడించింది. పెద్దలకు క్వారంటైన్ సమయాన్ని తగ్గించినా.. 16 సంవత్సరాల లోపు వయసు వారు కచ్చితంగా 16 రోజుల ఐసొలేషన్​లోనే ఉండాలని వెల్లడించింది. దీంతో వారాల పాటు పిల్లలు.. తల్లిదండ్రులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొన్ని దేశాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే అమెరికా, ఆస్ట్రేలియాల్లో పిల్లలకు నిబంధనలు కాస్త సులభంగానే ఉన్నాయి. అమెరికాకు వెళ్లే పిల్లలు బయలుదేరే మూడు రోజుల పరిధిలో కరోనా టెస్టు చేయించుకొని నెగెటివ్​ వచ్చిన రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. అయితే అమెరికాకు చేరాక ఐదు రోజుల పాటు హోమ్ క్వారంటైన్​లో ఉండాలి. అదే ఆస్ట్రేలియాలో అయితే 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు నెగెటివ్ రిపోర్టు అవసరం లేదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Coronavirus, Covid -19 pandemic, Travel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు