Health Tips : అందంగా మారాలని టూత్‌పేస్ట్ ముఖంపై రాస్తున్నారా..?

Health Tips | టూత్‌పేస్ట్‌ రాస్తే మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిజమో.. కాదో తెలియకుండానే చాలా మంది మొటిమలతో ఇబ్బందులు పడేవారు టూత్‌పేస్ట్ అప్లై చేస్తున్నారు..

news18-telugu
Updated: June 3, 2019, 3:48 PM IST
Health Tips : అందంగా మారాలని టూత్‌పేస్ట్ ముఖంపై రాస్తున్నారా..?
మొటిమలను తగ్గించే చిట్కాలు
  • Share this:

చాలా మంది మొటిమలు, మచ్చలు, కంటికిందవలయాలు తగ్గించుకోవాలని ఆరాటపడుతుంటారు. అలాంటివారు.. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తారు. అందులో ఒకటే టూత్‌పేస్ట్ రాయడం. ఇలా టూత్‌పేస్ట్‌ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిజమో.. కాదో తెలియకుండానే చాలా మంది మొటిమలతో ఇబ్బందులు పడేవారు టూత్‌పేస్ట్ అప్లై చేస్తున్నారు.. దీనివల్ల ఎలాంటి పాభావం ఉంటుందో తెలుసుకోండి..



సాధారణంగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంథాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. ఇవి దంతాలపై రాస్తాం. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి.. ఏం కాదు.. కానీ ముఖంపైనున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి.. టూత్ పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా.. ఫ్యూచర్‌లో దాని తాలుకు ఇబ్బందులు తప్పవు.. పేస్ట్‌లోని కెమికల్స్.. ముఖంపైనున్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తుంది. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది..

కాబట్టి ఎప్పుడూ కూడా టూత్ ‌పేస్ట్ ముఖంపై రాయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.


ఇవి కూడా చదవండి..

First published: June 3, 2019, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading