Snoring: పని ఒత్తిడి తగ్గిస్తే గురకను కంట్రోల్ చేయవచ్చా.. అటుకలు తింటే గురకపై ప్రభావం చూపుతుందా? తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక(Snoring) వస్తుంది. అయితే గురకకు ప్రధాన కారణాలలో పని ఒత్తిడి కూడా ఒకటంట. నిద్రపోయేవారు గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు వైద్య నిపుణులు.

 • Share this:
  నిద్రలో గురక (Snoring) పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. మనం నిద్రపోతున్న సమయంలో మన పక్కన వారు నిద్రలో గురక పెడుతుంటే.. అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక(Snoring) వస్తుంది. అయితే గురకకు ప్రధాన కారణాలలో పని ఒత్తిడి కూడా ఒకటంట. నిద్రపోయేవారు గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు వైద్య నిపుణులు. అయితే అందుకు చాలా చిట్కాలే ఉన్నాయి.

  ఒత్తిడి..

  సాధారణంగా ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటి(Mouth)తో శ్వాస(Breathing) తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే కార‌ణం. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక(Snoring) సమస్య ఎక్కువగా ఉంటుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది. మద్యం(Drinking), పొగతాగడం(Smoking), ట్రాంక్విలైజర్ ఔషధాలైన లోరజ్ పామ్, డైజిపామ్ కండరాలకు పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి. దానివల్ల కూడా గురక రావచ్చు. ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇలా గురక సమస్య(Snoring problems)తో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి లేకుండా ఉంటే గురక కొంచెం కంట్రోల్లో ఉంటుందట.

  ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకుల(beets)ను తింటే గురక రాకుండా కంట్రోల్(control) అవుతుంద‌ట‌. అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే(before sleep) ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం(good results) కనిపిస్తుంది.రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌.

  ఇది కూడా చదవండి: ఆల్కాహాల్​ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినొద్దు.. లేదంటే ఆరోగ్య సమస్యలే..

  మీకు ముక్కు ఎప్పుడూ దిబ్బడతోనే ఉంటే, ఆ పరిస్థితి కేవలం మీ శ్వాస మీదనే కాక, అది మీ మొత్తం శరీర వ్యవస్ధ మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది. అందువల్ల మీ శ్వాస నాళాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే, మీ శరీరంలోని ద్రవాలు, ముఖ్యంగా తల భాగంలోని ద్రవాలు, అంత బ్యాలెన్స్ గా ఉంటాయి. వాటి మూలంగా అనేక విషయాలు నిర్ణయించబడతాయి. అవి మీ మెదడు పని చేసే విధానం, మీలో ఆరోగ్యంగా ఉన్నారనే భావన, మీలోని సమతుల్యత, మీ చురుకుదనం, మీ పంచేంద్రియాలలో చురుకుదనం, వీటి మీద ప్రభావం చూపుతుంది.
  Published by:Prabhakar Vaddi
  First published: