Saffron Flower Benefits: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతాడా..! ఉపయోగాలేంటి..

కుంకుమ పువ్వు (ప్రతీకాత్మక చిత్రం)

Saffron Flower Benefits: మనం సాధారణంగా వింటూ ఉండే మాట ఏంటంటే.. గర్భిణులు కుంకుమ పువ్వు(Saffron flower) కలిపిన పాలు(Milk) తాగడం వల్ల.. బిడ్డలు ఎర్రగా, ఆరోగ్యంగా పుడతారని అంటుంటారు. ఇలా మన పూర్వికులు అమమ్మలు, నానమ్మలు ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తుంటారు. ఈ చిట్కాకు(Tips) సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు నిపుణులు.

 • Share this:
  మనం సాధారణంగా వింటూ ఉండే మాట ఏంటంటే.. గర్భిణులు(Pregnant) కుంకుమ పువ్వు(Saffron flower) కలిపిన పాలు(Milk) తాగడం వల్ల.. బిడ్డలు ఎర్రగా, ఆరోగ్యంగా పుడతారని అంటుంటారు. ఇలా మన పూర్వికులు అమమ్మలు, నానమ్మలు ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తుంటారు. ఈ చిట్కాకు(Tips) సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు నిపుణులు. కానీ ఆ పువ్వులో(Flower) అనేక రకాల ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయని.. ఆయుర్వేద గ్రంథాలు (Ayurvedic Texts) చెబుతున్నాయి. ముఖ్యంగా మన రక్తాన్ని శుద్ది చేయడంలో కుంకుమ పువ్వు (Saffron flower) ప్రధానమైన పాత్ర పోషిస్తుందట.

  Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..


  అయితే మనం ఉపయోగించి కుంకుమ పువ్వులో మన ఉపయోగించేది పువ్వు కాదు.. కేవలం పూల మధ్యలో ఉండే కేసరాలను మాత్రమే. ఆ కేసరాలనే వాడుకు భాషలో మనం కుంకుమ పువ్వు అని పిలుస్తూ ఉంటున్నాం. ఒక్క కిలో కుంకుమ పువ్వు రావాలంటే.. దాదాపు రెండు లక్షల పూలను సేకరించి.. కేసరాలను వేరు చేస్తారు. అందుకే కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది. ఈ కుంకుమ పూలకు ప్రాచీన కాలం నుంచే ఖరీదైనవిగా ఉన్నాయి. వీటిని మొదటి నుంచి కూడా గర్భిణుల కోసమే వినియోగిస్తారు. పాలల్లో ఈ కేసరాలను కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతాడని ఓ నమ్మకం. వైద్యులు ఇలాంటి నమ్మకానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నా.. వాటిని అలా కొనసాగిస్తూనే ఉన్నారు గర్భిణులు.

  Shocking Incident: చెప్పేవి నీతులు.. చేసివి నీచపనులు.. అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంటికి వెళ్లి ఈ కానిస్టేబుల్..


  పుట్టుబయో బిడ్డ విషయంలో రంగు మాత్రం వస్తుందనన్న నమ్మకం పక్కన పెడితే.. పువ్వు తినడం వల్ల ఇతర ప్రయోజనాలు మాత్రం కలుగుతాయంటున్నారు నిపుణులు. కుంకుమపూలలో సఫ్రానాట్, కెంఫెరోల్, క్రోసిన్, క్రొసెటిన్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి. డిప్రెషన్ కు గురైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని పలు రకాల అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. శరీరంలో ఏ అవయానికకైనా పెయిన్ అనిపిస్తే.. ఈ కుంకుమ పువ్వులు సహజమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. రోజూ పాలలో కుంకుపూలు తీసుకునే గర్భిణుల్లో తిమ్మిర్లు తక్కువగా కలుగుతాయి. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  గర్భిణి స్త్రీకి మొదటి నాలుగు నెలలు బేబీ పెద్దగా ఉండదు.. ఆరో నెల నుంచి పెరుగుతూ శరీరంలో మార్పు కలుగుతుంది. దాంతో పాటే నడుము నొప్పి పెరుగుతుంది. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలాంటి వారికి ఈ కుంకుమ పూలు మంచి పరిష్కారంగా ఉంటుంది. అంతేకాదు మానసిక ఆందోళనను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కడుపులో తిప్పినట్లు కనిపించే వారికి.. ఆందోళన లక్షణాల నుంచి బయటపడటానికి ఉపయోగపడతాయి.

  Ants Problems: ఇంట్లో చీమలతో చిరాకు వేస్తోందా.. ఈ చిట్కాలను వాడి చీమలను తరిమికొట్టేయండి..


  గోరువెచ్చటి పాలలో కుంకుమ పూలు వేసుకుని తాగితే దీన్నుంచి ఉపశమనం పొందచ్చు. గర్భిణులకు ఎక్కువగా ఐరన్(Iron) అవసరం ఉంటుంది. రక్త హీనత నుంచి బయటపడటానికి కుంకుమపూలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ రకంగా కుంకుమ పూల ఉపయోగపడతాయని.. కానీ పుట్టబోయే బిడ్డ రంగు విషయంలో తేడా కోసం అంటూ చెప్పే దానిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
  Published by:Veera Babu
  First published: