Mushrooms: పుట్టగొడుగులతో మొటిమలు తగ్గిపోతాయా? పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్​ ఉండదా?

ప్రతీకాత్మక చిత్రం

పుట్టగొడుగుల (mushrooms)ను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు (patients) కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని (diabetes) తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.

 • Share this:
  మంచి ఔషధ గుణాలు (medicines) కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు (Mushrooms) అనడంలో సందేహం లేదు. వర్షాకాలం (monsoon season) వస్తే చాలు.. చాలామందికి ఇది ఫేవరెట్ ఫుడ్ (food) కూడా. పుట్టగొడుగులలో ఇర్గోథియైనైన్, సెలీనియం అనే రెండు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయట. మనలోని రోగాలకు కారకాలయ్యే ప్రీ రాడికల్స్‌‌ని ఇవి ఎదుర్కోవడమే కాకుండా… వాటిని నిర్మూలిస్తాయి కూడా. అలాగే పుట్టగొడుగుల (mushrooms)లో 80 నుండి 90 శాతం వరకూ నీరే ఉంటుంది. రోజుకి దాదాపు పావు కిలో చొప్పున.. పుట్టగొడుగుల (mushrooms)ను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు (blood pressure) కంట్రోల్‌ (control)లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు (patients) కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని (diabetes) తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.

  పుట్టగొడుగులతో ఫేస్​ ప్యాక్​..

  మొటిమల (pimples) సమస్యలతో బాధపడేవారు.. పుట్టగొడుగుల పొడితో ఫేస్ ప్యాక్ (face pack) కూడా తయారు చేసుకోవచ్చు. అందుకోసం పుట్టగొడుగులను (mushrooms) తొలుత పొడి చేయాలి. తర్వాత ఓ టీస్పూన్ మష్రూమ్ పొడికి.. మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ (oats), రెండు చుక్కల నూనె, అరటీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ మాదిరిగా కూడా వాడుకోవచ్చట. అలాగే చర్మం (skin) పొడిబారకుండా ఉండాలన్నా కూడా.. ఈ ప్యాక్‌ (pack)ను వాడవచ్చు. దీని వల్ల చర్మం తేటగా మారడమే కాకుండా.. ముఖానికి (face) సరికొత్త కాంతిని (glow) కూడా కలిగిస్తుంది.

  క్యాన్సర్​ రాకుండా..

  పుట్టగొడుగులను చాలామంది మాంసాహారంతో సమానంగా చూస్తారు. ఇందులోని పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుందట. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ (cancer) ముప్పును కూడా తొలిగిస్తాయి. పుట్టగొడుగుల వల్ల ఒక రకంగా భూమి కూడా సారవంతంగా మారుతుందట. దీనికి ఉండే చనిపోయే మొక్కలను రీసైకిల్ చేసే గుణం వల్ల.. విలువైన పోషకాలు భూమిలోకి ఇంకిపోతాయట. అలాగే పుట్టగొడుగులలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుందట. చైనా, జపాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ వారి సంప్రదాయ వైద్యంలో పుట్ట గొడుగులది అగ్ర స్థానమే.

  ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

  గుండె జబ్బుల (heart attacks)తో బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చట. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారం (food) కావడం వల్ల.. అదేవిధంగా కొలెస్ట్రాల్ అసలు లేని (no cholesterol) కారణంగా పుట్టగొడుగులను వారికి అనువైన ఆహారంగా భావించవచ్చని పలువురు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి (immunity system) కూడా పెరగుతుంది. అదేవిధంగా మొక్కల్లో కనిపించే క్లోరోఫిల్ ఇందులో కనిపించదు. అందుకే తెల్లగా ఉంటాయి.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)  ఇవి కూడా చదవండి: ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?

  గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?


  శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

  Published by:Prabhakar Vaddi
  First published: