Home /News /life-style /

weight loss tips: నిమ్మకాయ బరువు తగ్గించడంలో నిజంగా సాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

weight loss tips: నిమ్మకాయ బరువు తగ్గించడంలో నిజంగా సాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గడానికి ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. ఈ పద్దతులు ఫాలో అవండి . బరువు తగ్గించుకోండి.

ఇంకా చదవండి ...
    అసలే బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. ఇక పిల్లలకైతే ఆటల్లో పడిపోయే ఏ సమయానికి తింటున్నారో కూడా తెలియని లోకంలో బతికేస్తున్నారు. వేళకు ఆహారం (food) తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

    ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి సాధారణంగా వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు. ఒక‌టి రెండు రోజులు చేయ‌గానే బ‌ద్ద‌కంతోనో, ప‌ని ఒత్తిడితోనో మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌న్న (weight loss) క‌ల‌.. క‌ల‌గానే ఉండిపోతుంటుంది. ఈ పద్దతులు (weight loss tips) ఫాలో అవండి . బరువు తగ్గించుకోండి.

    కొవ్వును కరిగించడంలో..

    నిమ్మకాయ (lemon) మన రక్తంలో చక్కెర స్థాయిని ఆశ్చర్యకరంగా తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో కనుగొన్నారు. సిట్రిక్ యాసిడ్ కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో, పిత్తాశయం సాఫీగా పనిచేయడంలో సహాయపడుతుందని తెలుసుకున్నారు. మూడు నెలల పాటు రోజూ నాలుగు పెద్ద నిమ్మకాయల రసాన్ని సేవించే వ్యక్తుల కాలేయంలో గుణాత్మక మార్పులను గమనించారు. దీంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరులో కూడా మార్పులు గమనించారు. కొవ్వును కాల్చే హార్మోన్ను సక్రియం చేయడంలో సిట్రిక్ యాసిడ్ పాత్ర ఉంది. నిమ్మకాయ (lemon)లో ఉండే సిట్రిక్‌ యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉన్నాయి. దీంతో అధిక బ‌రువు ఉన్న‌వారు నిమ్మర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది.

    ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది..

    ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది. గుండె సంబంధ స‌మ‌స్యలు కూడా దాదాపు రావు. డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు