Home /News /life-style /

CAN I EXERCISE WHEN I HAVE LOW BACK PAIN AND WHAT PRECAUTIONS SHOULD BE TAKEN TO REDUCE THE PAIN PRV

Health care: బ్యాక్​ పెయిన్​ ఉన్నపుడు ఎక్సర్​సైజులు చేయొచ్చా? ఎలాంటి వ్యాయామాలు బెటర్​?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నడుం నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం (exercise) చేయవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీని గురించి నడుం నొప్పి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

    దాదాపు 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి(back pain) తో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు.చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో నడుం నొప్పి ( back pain) దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్ల దాకా నడుము నొప్పి (back pain)కి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుం నొప్పి(back pain)  సర్వసాధారణం. ఎక్కువమందిలో కనిపించేదీ… అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నొప్పి మాత్రం డిస్కు సమస్యలవల్ల వచ్చే నడుము నొప్పే. కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. అలాగే నడుం నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం (exercise) చేయవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీని గురించి నడుం నొప్పి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

    వ్యాయామాలు రోజూ చేయడం వల్ల..

    బ్యాక్​ పెయిన్​ (Back pain) ఉన్నవారు వెన్నెముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు (exercise) రోజూ చేయడం వల్ల నడుం నొప్పికి చెక్ పెట్టవచ్చు. నడుముకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి (pain),  వాపు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి వాటితో కాపడం పెట్టడం వల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నడుం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పని చేయకుండా విశ్రాంతి (rest) తీసుకోవడం చాలా మంచిది.

    నొప్పి ఉన్న చోట సహజసిద్ధమైన పద్ధతులు పాటించడం తో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగ, ఈత వంటి సులభమైన ఎక్సర్​సైజులు చేయాలి. నడుం నొప్పితో పాటు జ్వరం (fever), మలబద్ధకం,మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోవడం మొదలైన సమస్యలు బాధిస్తుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నడుమునొప్పిని ఆయుర్వేదం (Ayurveda)లో కటిశూల అంటారు. ఇదొక వాత ప్రధాన వ్యాధి. దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం, వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు. నడుము నొప్పితో ఎక్కువ బాధ పడుతుంటే 100 గ్రాములు గసగసాలను మెత్తగా నూరి పొడి చేసుకుని ఈ పొడిని ఒక చెంచా మోతాదులో గ్యాస్ ఒక గ్లాస్ నీళ్ళ (water)లో కలుపుకుని తాగాలి. నడుం నొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె (coconut oil) గానీ, నీలగిరి తైలం కానీ, గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్నచోట మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి విముక్తి కలుగుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care

    తదుపరి వార్తలు