Sexual Wellness: అమ్మాయిలను ఆ విషయం డైరెక్టుగా అడగొచ్చా? ఈ సందేహానికి సమాధానమిదే..

ప్రతీకాత్మకచిత్రం

Hookup: ఈ రోజుల్లో హుకప్ల సంస్కృతి ప్రబలంగా మారింది. సాంకేతికత, మీడియా ప్రభావం, లైంగిక భాగస్వాముల గురించి ప్రజలకు బహిరంగంగా చెప్పుకోవడం వల్ల ఈ సంస్కృతి పెరుగుతుంది. మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ హుకప్స్ కొనసాగించడానికి కారణాలను అంచనా వేయాలి.

  • Share this:
ప్రశ్న: నా పేరు రవి(పేరు మార్చం). నా వయసు 35 ఏళ్లు. చాలా కాలంగా ఓ సమస్య నన్ను వేధిస్తోంది. ఈ రోజుల్లో వన్ నైట్ స్టాండ్ లేదా హుకప్స్ సాధారణమైపోయాయి. శారీరక సంబంధం కోసం మా స్నేహితుల్లో ఎవరైనా అమ్మాయిలను అడిగేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే సూటిగా ఆ విషయాన్ని అమ్మాయిలను అడిగితే వారు భయపడటమో, కోపగించుకోవచటమో చేస్తారు. లేదా ఫ్రెండి షిప్ బ్రేక్ చేయవచ్చు. అంతే కాకుండా నాపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ విషయం గురించి క్లుప్తమైన సమాచారమివ్వండి.
సమాధానం: ఒక వ్యక్తి హుకప్స్ లేదా అపరిచిత శృంగారంలో పాల్గొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో హుకప్ల సంస్కృతి ప్రబలంగా మారింది. సాంకేతికత, మీడియా ప్రభావం లేదా పొర్న్ ద్వారా సెక్స్ సులవుగా లభించడం ఇందుకు కారణం. లైంగిక భాగస్వాముల గురించి ప్రజలకు బహిరంగంగా చెప్పుకోవడం వల్ల ఈ సంస్కృతి పెరుగుతుంది. మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ హుకప్స్ కొనసాగించడానికి కారణాలను అంచనా వేయాలి. మీ ఉద్దేశాల గురించి మీ భాగస్వామితో నిజాయితీగా వ్యవహరించాలి. విస్తృతంగా చెప్పాలంటే సాధారణ శృంగారంలో పాల్గొనడానికి ఎంచుకునే వారికి నాలుగు ప్రేరణలు ఉన్నాయి.

స్వయం ప్రతిపత్తి..
ఈ వ్యక్తులు సెక్స్ పట్ల ఆనందం, ఆసక్తిని కలిగి ఉంటారు. లైంగిక స్వేచ్ఛను అన్వేషించడం, ఎమోషనల్స్ తో సంబంధం లేకుండా సెక్స్ ఉంటే సరిపోతుంది. ఈ సందర్భంలో భాగస్వామితో వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం స్నేహితులుగానో పరిచయస్థులుగానో సెక్సువల్ ఎన్ కౌంటర్లు మాత్రమే ఉంటాయి.

తోటివారి ఒత్తిడి..
ఈ కోవలోకి వచ్చే వ్యక్తులు మంచి అనుభూతిని పొందాలని.. విశ్వాసం, ఆత్మగౌరవం పెంచుకోవాలని కోరుకుంటారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో వారు భాగస్వామిని సంతోషపెట్టడానికి లేదా స్నేహితులను సంతృప్తి పరచడానికో వారిని సహాయం కోరవచ్చు. అంతే కాకుండా ఎలాంటి సంబంధం లేకుండా సెక్స్ ద్వారా ప్రతికారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఓ వ్యక్తి మోసపోవడం, బలవంతంగానో లేదా మద్యం వల్ల నిర్ణయం తీసుకోలేని స్థితితో శృంగారంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంలో వారు హుకప్ ను ఆశించలేదు ఇష్టపడలేదు.

రిలేషనల్..
కొన్నిసార్లు హుకప్స్.. రొమాంటిక్ రిలేషన్ షిప్స్ కు నాంది. హాలీవుడ్ చిత్రాలైన ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కొంతమంది తమ భాగస్వామితో సాధారణంగా హకప్ అవుతారు. అయితే అది ఎక్కడికైనా దారితీస్తుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఓ అమ్మాయితో సాధారణ సంబంధాన్ని ప్రారంభించడం గమ్మత్తుగా అనిపిస్తుంది. శృంగారం కోసం ప్రత్యక్షంగా పాయింట్ కు వచ్చి సెక్స్ గురించి మాట్లాడితే అది అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా మన సమాజంలో అమ్మాయిల ముందు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడితే వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదే సమయంలో పురుషులకు కూడా భయం, ఆందోళనలను వ్యక్తం చేయడం చాలా కష్టం. ఎందుకంటే లైంగికంగా ప్రావీణ్యం కలిగిన వారు ఎమోషనల్ కనెక్షన్ కంటే శృంగారానికి ప్రాధాన్యత ఇస్తారు. మన సమాజం డబుల్ ప్రమాణాలతో నిండి ఉంటుంది. మహిళలు సాధారణ సెక్స్ కోసం గర్భనిరోధకం, భద్రతా లాంటి భారాల్ని భరించాల్సి ఉంటుంది.

అయితే ఎన్నో సెక్స్ ఎన్ కౌంటర్లు స్త్రీ ఆనందంపై దృష్టి పెట్టడం లేదు. ఈ కారణాలతో ఓ అమ్మాయి నిర్భయంగా నిర్మోహమాటంగా హుకప్స్ ను కొనసాగించడం కష్టతరంగా ఉంటుంది. మీతో సన్నిహితంగా ఉండటానికి ఆమె ఆసక్తి స్థాయిని గుర్తించడంలో మీకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. రోజు చివర్లో మీరు నిజాయితీగా ఉండాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఆరోపణలు, అపార్థాలను నివారించవచ్చు. ఆమె మీతో సమయాన్ని గడపాలని కోరుకోవచ్చు.  ఆమె కొన్ని విషయాల గురించి భయపడవచ్చు. కానీ మహిళలు సాధారణంగా సుఖంగా ఉండే పురుషులతో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలాంటి సందర్భాల్లో మహిళలు మీతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఒకవేళ మీరు ఆమెతో ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడితే వారు సాకులు చేబుతారు. అంటే దానర్థం మిమ్మల్ని ముద్దుపెట్టుకోవాలని ఇష్టం లేదని తెలుసుకోవాలి.

ఆమె కావాలని చనువుగా తాకాలని ప్రయత్నిస్తే..
ఉద్దేశపూర్వకంగా ఆమె మిమ్మల్ని తాకాలనకుంటుందని మీకు తెలియాలంటే ఆమె తన చేతిని మీ వెనక భాగంలో లేదా తొడపై వేసిందా లేదా మీకు దగ్గరగా కూర్చుందో లేదో గమనించండి. ఆమె మీ దగ్గరగా కూర్చోక పోతే లేదా ఆమె మిమ్మల్ని చూడకపోతే శారీరక సంబంధాన్ని నివారించినట్లయితే ఆమె భావాలు కేవలం సాదాసీదాగా ఉంటాయి. తప్ప మరేమి లేవు.

మీతో సరసాలాడుతుంటే..
సరసాలాడటమనేది సెక్స్ కోసం చేసే చాలా పాత సంకేతం. చాలా సార్లు సాధారణంగా చేస్తారు. మీరు మీ మాటలు, చర్యలతో ఆకర్షణను సూక్ష్మంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వారితో ఉన్నారని ఎవరికైనా చెప్పడానికి బదులుగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సరసలాడటాన్ని పరిగణనలో తీసుకుంటే ఐ కాంటాక్ట్, చిరునవ్వులు మహిళల్లో ఆకర్షణీయమైనవి. చాలా సందర్భాల్లో పలు అభినందనలు ఇవ్వడం మాటల సూచనలను ఇస్తారు.

మీ చర్యలకు సానుకూలంగా ప్రతిస్పందిస్తే..
ఒక స్త్రీ మీతో సౌకర్యవంతంగా లేదా రిలాక్స్ ఉంటే తాకినట్లు అర్థమైతే.. ఆమె మీ ప్రేమ, ప్రతిస్పందనలను గుర్తిస్తుందని తెలుసుకోవాలి. అంతే కాకుండా ఈ విషయంలో మీరు చాలా వేగంగా ముందుకు వెళ్తే.. అందుకు ప్రతిస్పందిస్తే ఆమెకు మీపై మరింత లైంగిక ఆసక్తి ఉండవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: