Beauty tips: ముఖానికి వాటర్​ బేస్డ్​ మాయిశ్చరైజర్​ అందరూ వాడొచ్చా? వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి?

ప్రతీకాత్మక చిత్రం

కొంత మందికి జిడ్డు చర్మం (Oily skin), మరి కొంత మందికి పొడి చర్మం (dry skin) ఉంటుంది. అయితే చాలామంది ఒకే రకమైన మాయిశ్చరైజేషన్​ (moisturization) చేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు

  • Share this:
    ముఖం అందం (beauty) గా మెరిసిపోతూ ఉండాలని.. చక్కటి గ్లో తో హీరోయిన్ లా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం మనం ఉపయోగించే చర్మ ఉత్పత్తులు, కాలుష్యం (pollution), మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ముఖ చర్మం మెరుపును కోల్పోతుంది. అయితే మనలో చాలామందికి ఒకే రకమైన చర్మం ఉండదు. కొంత మందికి జిడ్డు చర్మం (Oily skin), మరి కొంత మందికి పొడి చర్మం (dry skin) ఉంటుంది. అయితే చాలామంది ఒకే రకమైన మాయిశ్చరైజేషన్​ (moisturization) చేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్..

    రోజూ సరైన స్కిన్ కేర్ (skin care) రొటీన్ ని పాటించడం కూడా చర్మం అందం (skin beautiful)గా కనిపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మరీ పొడి బారి పోకుండా కాపాడుకోవచ్చు. జిడ్డు చర్మం (Oily skin) ఉన్నవారు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ (water based moisturization) ఉపయోగించాలి. లేకపోతే వారు చర్మం సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. పొడి చర్మం (dry skin) ఉన్నవారు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ (oil based moisturization) వాడవచ్చు. దీనివల్ల మొటిమలు (pimples) రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ముఖం కడుక్కునే ముందు చర్మ తత్వానికి సరిపడే స్క్రబ్ ని కూడా ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సమస్య ఇబ్బంది పెట్టదు.

    చర్మానికి మసాజ్..

    అప్పుడప్పుడూ మీ చర్మానికి మసాజ్ (massage) అనేది అవసరం. దీనివల్ల మీకు హాయిగా అనిపించడంతో పాటు మీ చర్మానికి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మిగిలిన భాగాలతో పాటు ముఖానికి (face) కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న ముడతలు (wrinkles), మచ్చలు కూడా తగ్గే వీలుంటుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల మీ ముఖంపై ఎలాంటి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

    కనీసం నెలకోసారి అయినా ముఖానికి ఫేస్ ప్యాక్ (face pack) వేసుకోవడం అవసరం. పార్లర్లు మూసేసి ఉన్నాయి కదా అని ఫేషియల్ కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మన కిచెన్ లో లభించే వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వీటివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ముఖం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: