Weight loss: బెండకాయ తింటే బరువు తగ్గుతారా? బెండకాయ వల్ల ప్రయోజనాలేం ఉన్నాయి? తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లోనే దొరికే ఓ కాయకూరలోనే పోషకాలు మెండుగా ఉంటాయంట. దానిని మన ఆహారంలో భాగం చేసుకుంటే బరువు కూడా తగ్గుతారని(weight loss) నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అదేంటంటే బెండకాయ(lady finger). మార్కెట్లో అధికంగా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి.

  • Share this:
    మనం తినే కల్తీ ఆహారం(food) కారణంగా అనసరంగా అనారోగ్యాల(Unhealthy) బారిన పడుతున్నాం. చేతులో డబ్బులేక, వైద్యం చేయించుకోలేక నానా అవస్థలు పడుతున్నాం. అయితే మన ఇంట్లోనే దొరికే ఓ కాయకూరలో (Vegetables)నే పోషకాలు మెండుగా ఉంటాయంట. దానిని మన ఆహారంలో భాగం చేసుకుంటే బరువు కూడా తగ్గుతారని(weight loss) నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అదేంటంటే బెండకాయ(lady finger). మార్కెట్లో అధికంగా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. చెప్పాలంటే మిగతా కూరగాయలతో పోలిస్తే దీని రేటు మరీ పెరగదు. మరీ తగ్గదు. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు చాలామంది. వీటిని తింటే లెక్కలు బాగా వస్తాయని చాలామంది చిన్నపిల్లలకి బెండకాయ వండిపెడతారు. బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటివల్ల శరీరానికి ఎంతో మేలు(health benefits) కలుగుతుంది. అయితే ఈ బెండకాయతో కలిగే లాభాలేంటి? తింటే బరువు నిజంగానే తగ్గుతారా అనేది తెలుసుకుందాం..

    ఫైబర్​ కారణంగా..

    విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి (Immunity power)ని శరీరానికి అందించడంలో సాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల హృదయ సంబంధ ఇబ్బందులకు తావు ఉండదు. అంతేకాదు చెడుకొవ్వును (fat) శరీరం నుంచి బయటకు పంపించి వేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. విటమిన్-ఏ, బీటా కెరాటిన్ కారణంగా కంటిచూపు మెరుగుపడుతుంది. బెండకాయలో కేలరీలు (calories) తక్కువ ఉంటాయి. అదీగాక అధిక శాతం ఫైబర్(fiber) కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. తద్వారా తక్కువ తింటారు. దాని మూలంగా బరువు (weight) తగ్గుతారు.

    జీర్ణం సరిగా అవుతుంది..

    ఆహారం సరిగ్గా జీర్ణం అవడం(digest)లో బెండకాయ బాగా పనిచేస్తుంది. క్రమంగా బెండకాయ (lady finger)ను ఆహారంలో చేర్చుకున్న వారు మలబద్దకం తదితర సమస్యలతో బాధపడకుండా ఉంటారు. పేగులను శుభ్రపర్చడం(cleaning)లో కూడా సాయపడుతుంది. ఇందులోని ఎజినాల్ అనే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ తో బాధపడేవారు బెండకాయలను ఆహారంలో తీసుకుంటే మంచిదని(good for Health) చెబుతుంటారు. శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత రాకుండా బెండకాయ కాపాడుతుంది. ఫోలేట్, విటమిన్ కె మొదలగునవి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

    ఇది కూడా చదవండి: కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే వచ్చే రోగాల గురించి మీకు తెలుసా? జాగ్రత్త పడండి

    బెండకాయ కూరల్లోనే కాదు మామాలుగా తిన్నా పోషకాలు అద్భుతంగా అందుతాయట. ఎలా అంటే చిన్న బెండకాయలు 2 లేదా 3 తీసుకొని బాగా కడగాలి. వాటి మొదలు, చివర్లు తీసేయాలి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని ఉంచితే అవి బాగా నానుతాయి. వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఉదయాన్నే నీటిలోని బెండముక్కల్ని తీనేసి నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published: