Home /News /life-style /

CAN CONQUER CANCER AN INITIATIVE TO INCREASE CANCER AWARENESS IN INDIANS SS

Can Conquer Cancer: వైద్యరంగం, సాంకేతిక రంగం కలిసి సాధించిన ప్రగతి (Advertisement)

Can Conquer Cancer: వైద్యరంగం, సాంకేతిక రంగం కలిసి సాధించిన ప్రగతి (Advertisement)

Can Conquer Cancer: వైద్యరంగం, సాంకేతిక రంగం కలిసి సాధించిన ప్రగతి (Advertisement)

Can Conquer Cancer | ఈ కాలంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువ సార్లు కీమో థెరపీలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ లైన్ థెరపీ, సెకండ్ లైన్ థెరపీ, థర్డ్ లైన్ థెరపీ అంటాం. ఎవరికైనా క్యాన్సర్ తగ్గి మళ్ళీ తిరగబడితే సెకండ్ లైన్ థెరపీ చేస్తాం అలాగే కొంత మందికి దీర్ఘ కాలం పాటు టార్గెటెడ్ థెరపీలు చేయవలసి వస్తుంది.

ఇంకా చదవండి ...
    సరైన వైద్య సదుపాయాలు లేక చిన్న చిన్న వ్యాధులకే వేల కొద్దీ ప్రాణాలు కోల్పోయినా పరిస్థితుల నుండి ఎంతటి క్లిష్టమైన వైద్య సమస్యనైనా సరైన సమయంలో గుర్తించి, రోగికి అత్యంత తక్కువ అసౌకర్యంతో ప్రభావవంతమైన వైద్యం చేసే స్థాయికి వైద్యరంగం, సాంకేతిక రంగం కలిసి ముందడుగు వేసాయి. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. ఈనాడు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, దీర్ఘకాలిక వైద్యాలు చేయగలిగే సౌలభ్యాలు వైద్యం రంగంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి డా. కుమార్ మనకు తెలియచేయగా, డా. రెడ్డి శతాబ్దాలుగా కొనసాగుతున్న క్యాన్సర్ మహమ్మారి గురించి కొన్ని వివరాలు అందించారు. ఈ కథనంలో మేము వాటిని మీకు అందిస్తున్నాం.

    అసౌకర్యాలను తగ్గించిన ‘మినిమల్ యాక్సెస్ సర్జరీ’


    శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై పెద్దగా కోతలు పెట్టకుండా, శరీర భాగాలను పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా సర్జరీలు చేయగలిగే ప్రక్రియ మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఉదరం భాగంలో చేసే ఈ సర్జరీని ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అని, ఛాతీ భాగంలో చేసే సర్జరీని థొరాసిక్ సర్జరీ అని అంటారు. ఈ ప్రక్రియలో ల్యాప్రోస్కోపి వంటి ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. దీనిలో మరింత ఆధునిక విధానం రోబోటిక్ సర్జరీ. ఈ రోబోటిక్ సర్జరీలో హై డెఫినిషన్ కెమెరాలు, మానిటర్‌లు ఇంకా ఇతర ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు.

    ఈ అభివృద్ధి వలన భారీ సర్జరీలను సైతం చిన్న ఇన్‌సెషన్‌తో చేయవచ్చు. రోగికి నొప్పి తక్కువ కలుగుతుంది, రక్తస్రావం తక్కువ, హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యవధి తగ్గుతుంది. వీటిని సాధారణంగా గ్యాస్ట్రో ఇంటస్టైనల్, కోలోరెక్టల్, ఉదరం అలాగే కార్సినోమా ఎండోమెట్రియం, కార్సినోమా సర్విక్స్ వంటి గైనకలాజికల్ క్యాన్సర్‌లలో ఉపయోగిస్తారు. ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడం వలన సర్జరీలలో సంక్లిష్టతలు తగ్గుతాయి, రోగికి త్వరగా ఇంటికి వెళ్ళవచ్చు, సాధారణ జీవనాన్ని తిరిగి ప్రారంభించడం సులభం అవుతుంది.

    సెంటినల్ లింఫ్‌నోడ్ బయోప్సీ


    ఇంతకు ముందు రొమ్ము క్యాన్సర్ అలాగే చర్మ క్యాన్సర్‌లలో సెంటినల్ లింఫ్‌నోడ్ బయోప్సీని ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు గైనకలాజికల్, ఓరల్ క్యావిటీ, ఉదరం, కోలన్ క్యాన్సర్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు రేడియో ఐసోపోట్ స్కాన్ చేసే వారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అలాగే రోగిని అత్యధిక స్థాయిలో రేడియేషన్‌కు గురిచేస్తుంది. ఇప్పుడు ఇండో సైన్ గ్రీన్ డై (ICG dye) పంపించి, గైడెడ్ కెమెరాతో లింఫాటిక్ ట్రాకింగ్, లింఫ్ నోడ్‌ను గుర్తించడాన్ని చేస్తున్నారు. దీనిని ఇమ్యునో ఫ్లోరోసెన్స్ పరీక్ష అంటారు. దీని వినియోగం మరింత విస్తరించి, కోలనోరెక్టల్ క్యాన్సర్‌లో, ఎనస్టమోసిస్ కోసం, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలలో ఫ్లాప్ వాస్‌క్యులారిటీ తెలుసుకోవడానికి వినియోగిస్తున్నారు. రేడియో ఐసోటోప్ స్కాన్‌కు కనీసం రెండు మూడు గంటలు సమయం పట్టేది, కానీ ఈ విధానంలో కేవలం అయిదు నిమిషాలలో సెంటినల్ లింఫ్ నోడ్ సెన్సిటివిటీని కూడా తెలుసుకోవచ్చు.

    దీర్ఘకాలిక వైద్యానికి సహకరించే ఇంట్రా వాస్‌క్యులార్ పరికరం


    ఈ కాలంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువ సార్లు కీమో థెరపీలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ లైన్ థెరపీ, సెకండ్ లైన్ థెరపీ, థర్డ్ లైన్ థెరపీ అంటాం. ఎవరికైనా క్యాన్సర్ తగ్గి మళ్ళీ తిరగబడితే సెకండ్ లైన్ థెరపీ చేస్తాం అలాగే కొంత మందికి దీర్ఘ కాలం పాటు టార్గెటెడ్ థెరపీలు చేయవలసి వస్తుంది. అలాంటి రోగుల విషయంలో చేతికి ఉన్న IV నరాలు దొరకవు. ఇలాంటి సందర్భంలో ఇంట్రా వాస్‌క్యులార్ డివైజ్, కీమో పోర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో ఇంట్రా జుగ్యులార్ లేదా సబ్ క్లావియల్ వంటి ప్రధాన నరాలకు క్యాథెటర్ పెడతారు. ఇది గుండెకు దగ్గరగా ఉంటుంది అలాగే చర్మం కింద పాకెట్స్ ఏర్పరిచి పోర్ట్ పెడతారు. ఈ పోర్ట్‌ను కనీసం మూడు నాలుగు సంవత్సరాలు అలాగే ఉంచవచ్చు.

    తరచుగా రక్తం సేకరించవలసిన సందర్భాలలో అంటే చిన్న పిల్లలలో లేదా ల్యుకేమియా వంటి వ్యాధులు ఉన్నవారిలో అలాగే దీర్ఘకాలం పాటు వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ కీమో పోర్ట్‌లు పనిని సులభం చేస్తాయి. వీటిని శరీరంలో సరిగ్గా అమర్చి, అవి సెట్ అయితే రెండు నుండి మూడు సంవత్సరాల పాటు వాటిని అలాగే ఉంచి వైద్యం చేయవచ్చు. దీని వలన రోగికి ఎలాంటి నొప్పి ఉండదు వారి అసౌకర్యం తగ్గుతుంది. ఇలాంటి ఆవిష్కరణలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్‌లను నిరోధించగలగడం హర్షించదగిన విషయం.

    భారతదేశంలో క్యాన్సర్


    గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు యాభై వేల మంది చిన్నారులు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చిన్నారులలో వచ్చే క్యాన్సర్‌లలో అత్యంత సాధారణమైనవి ల్యుకేమియా లేదా రక్త క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, న్యూరో బ్లాస్టోమా, కిడ్నీ క్యాన్సర్ మరియు బీజ కోశ క్యాన్సర్. నలభై నుండి యాభై శాతం ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా కనిపిస్తుంది. దీని తర్వత అదిక స్థాయిలో కనిపించేది లింఫోమా ల్యుకేమియా. ఇవన్నీ కూడా పూర్తిగా నయం చేయగలిగిన క్యాన్సర్‌లు.

    పెద్దలలో ముఫ్పై అయిదు నుండి నలభై అయిదు శాతం క్యాన్సర్‌లు రకరకాల కారణాల వలన వస్తాయి. ఎక్కువగా పొగాకు తీసుకోవడం, మద్యపానం, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌లు, అధిక బరువు, గుట్కా వంటి చెడు అలవాట్లు ఉండటం వంటి జీవన శైలి కారకాలు క్యాన్సర్‌కు దారి తీస్తాయి. అయితే, చిన్నారుల విషయంలో క్యాన్సర్‌కు ఖచ్చితమైన కారణాలు చెప్పడం కష్టం. పెద్దలలో సాధారణంగా వచ్చే క్యాన్సర్‌లు రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి వాటికి స్క్రీనింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ పద్ధతులను వ్యాధి లక్షణాలు కనిపించని, ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిలో క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

    చింతించవలసిన విషయం ఏమిటంటే చిన్న పిల్లలకు ఈ స్క్రీనింగ్ విధానాల సౌలభ్యం లేదు. అయితే, అడ్వాన్స్‌డ్ దశలలో గుర్తించినప్పటికీ కూడా చిన్నారులలో క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. కానీ రక్తపోటు, మధుమేహం ఇంకా ఇతరత్రా వైద్య సమస్యల కారణంగా పెద్దలు వైద్యాన్ని తట్టుకోలేరు. చిన్నారులలో తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే వారిపై ముందుల చెడు ప్రభావం కూడా అంతగా ఉండదు, కాబట్టి వారిలో వచ్చే క్యాన్సర్ నిర్మూలించి వారిని ఆరోగ్యవంతమైన పౌరులుగా చేసే అవకాశం ఉంది.

    డా. కుమార్, అలాగే డా. రెడ్డి చెప్పిన ఈ విషయాలు ఎంతో ఆశాజనకమైన విషయాలు అలాగే మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తు చేసే విషయాలు. సర్వేజనా సుఖినోభవంతు.

    వీరి ఇంటర్‌వ్యూలను ఇక్కడ చూడండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Breast cancer, Cancer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు