హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: చూయింగ్​ గమ్​ నమిలితే నిజంగానే బరువు తగ్గిపోతారా? ఏమిటీ దానిలో స్పెషాలిటీ?

Health tips: చూయింగ్​ గమ్​ నమిలితే నిజంగానే బరువు తగ్గిపోతారా? ఏమిటీ దానిలో స్పెషాలిటీ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తరచుగా చూయింగ్ గమ్ నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు. అరగంట పాటు షుగర్ లేని చూయింగ్ గమ్ నమిలిన వారితో పోల్చితే ఈ అలవాటు లేని వారు అధికంగా తింటున్నారట

  చూయింగ్ గమ్ (Chewing gum).  ఒత్తిడిగా అనిపించినా, ఏం తూచకపోయినా, పని చేస్తున్నప్పుడు నిద్రవచ్చినా, వెంటనే గుర్తొచ్చేది. ఆకలిగా అనిపించినా, చూయింగ్ గమ్ నమిలేస్తుంటారు. చూయింగ్ గమ్  ప్రస్తుతం నిత్య జీవితంలో భాగంగా మారిపోయింది. మరికొందరైతే.. చూయింగ్ గమ్ లేకుండా అసలు ఉండలేరు. కాగా, అది నములుతుంటే  మీ శ్వాసలో తాజాదనం లభిస్తుంది. మీ పళ్లను క్రిముల నుంచి రక్షిస్తుంది. అయితే కొంతమందిలో ఓ అపోహ ఉంది. నేను తరచుగా బబుల్‌గమ్ తింటున్నాను దాని వల్ల అధిక బరువు(heavy weight) సమస్య నుంచి బయటపడతామని భావిస్తుంటారు. అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం(food) తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్‌సైజ్ అవుతాయి. చూయింగ్ గమ్ నమిలినంత మాత్రాన అధిక కేలరీలు తగ్గే అవకాశం లేదని, కేవలం నిర్ణీత ఆహారం, ఫుడ్ డైట్(diet) ప్లాన్ చేస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది. తరచుగా చూయింగ్ గమ్ నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది(no hungry). ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు. అరగంట పాటు షుగర్ లేని చూయింగ్ గమ్ నమిలిన వారితో పోల్చితే ఈ అలవాటు లేని వారు అధికంగా తింటున్నారట.. ఈ ప్రక్రియే బరువు తగ్గడానికి దోహదపడుతుందట. దీనిలో స్పెషాలిటీ ఏంటో పూర్తిగా తెలుసుకుందా..

  చూయింగ్ గమ్ నమలుతూ కూర్చోవడంతో చాలామందికి ఆకలి వేయదు(no hungry). దీంతో తక్కువ ఆహారం, స్నాక్స్ తింటారు జనం. ఇది బరువు తగ్గేందుకు (Weight Loss) ఉపకరిస్తుంది. చూయింగ్ గమ్ తినేవారిలో అధిక కేలరీలు(calories) ఖర్చవుతాయట. బ్రేక్ ఫాస్ట్, లంచ్ మధ్య విరామంలోనే ఇది పనిచేస్తుందట.  మామూలుగా ఓ చోట కూర్చుని చూయింగ్ గమ్ తింటున్న వారితో పోల్చితే వాకింగ్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలే వారిలో బరువు తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు(experts) చెబుతున్నారు. నడిచేటప్పుడు అధికంగా శ్వాస(breathe) తీసుకోవడం, త్వరత్వరగా నమలడం, జీర్ణక్రియ సైతం వేగం పెరిగి అధిక కేలరీలు త్వరగా ఖర్చవుతాయి. అయితే షుగర్ ఫ్రి బబుల్ గమ్‌లు మాత్రమే నమలాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  జాగ్రత్త మరి..

  అయితే చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల పంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. వీటిల్లో ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. కాబట్టి పళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే షుగర్ లేని చూయింగ్ గమ్ అయితే మంచిదని డెంటిస్ట్ లు సూచిస్తున్నారు. చక్కెరలేని చూయింగ్ గమ్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. చక్కెరలేనిదే అయినా.. అందులో స్వీట్ నెస్ కోసం కలిపే క్సైలిటాల్ అనే స్వీటనర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది తలనొప్పి నుంచి ఉపశమనం కోసం చూయింగ్ గమ్ తీసుకుంటారు.. కానీ దీనివల్ల బ్రెయిన్ కి సైడ్ ఎఫెక్ట్ తగులుతుంది. అంతేకాదు డయాబెటీస్, ఒబేసిటీ వచ్చే ప్రమాదముంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Health Tips, Hungry people, Life Style, Weight loss

  ఉత్తమ కథలు