Home /News /life-style /

Sex Education: సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అడల్ట్ సినిమాలు చూడొచ్చా?.. అలా చేయడం మంచిదేనా?

Sex Education: సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అడల్ట్ సినిమాలు చూడొచ్చా?.. అలా చేయడం మంచిదేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అభివృద్ధి చెందిన దేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ మనదేశంలో తల్లిదండ్రులు, టీచర్లు సెక్స్ ఎడ్యుకేషన్‌ను ఏమాత్రం పట్టించుకోరు.

అభివృద్ధి చెందిన దేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ మనదేశంలో తల్లిదండ్రులు, టీచర్లు సెక్స్ ఎడ్యుకేషన్‌ను ఏమాత్రం పట్టించుకోరు. దీంతో ఎదుగుతున్న క్రమంలో యువతీ యువకులకు సరైన లైంగిక విజ్ఞానం ఉండట్లేదు. ఫలితంగా సెక్స్ గురించి తెలుసుకోవడానికి పోర్న్ వీడియోలు, ఫోటోలు, బ్లూ ఫిల్మ్స్, అడల్ట్ సినిమాలు, కొన్ని రకాల మ్యాగజైన్లు చూస్తారు. ఇలాంటి వాటి ద్వారానే సెక్స్‌పై ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కానీ సెక్స్ ఎడ్యుకేషన్‌కు ఇలాంటివి మంచి సోర్స్ కాదని నిపుణులు చెబుతున్నారు. పోర్న్ వీడియోలు, అడల్ట్ సినిమాల్లో అసలు సెక్స్ గురించి వాస్తవికత ఉండదు. కేవలం శృంగార అనుభూతి కోసం రొమాంటిక్ ఫాంటసీని వీటిల్లో చూపిస్తారు. సెక్స్ ఎడ్యుకేషన్‌లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముందు వీటిపై అవగాహన పెంచుకోవాలి.

అడల్ట్ సినిమాలు, పోర్న్ వీడియోల్లో సెక్స్‌కు సంబంధించిన చాలా విషయాలు ఉండవు. వీటిని చూపించకుండా కేవలం రొమాంటిక్ ఫ్యాంటసీపైనే ఎక్కువగా దృష్టిపెడతారు. కండోమ్‌లను, ఇతర గర్భ నిరోధక సాధనాలను ఎలా వాడాలనే విషయాలు ఉండవు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి చూపించరు. ఆడవాళ్లలో భావప్రాప్తి గురించి, సెక్స్ చేసేటప్పుడు విడుదలయ్యే స్రావాలు, స్ఖలనం గురించి సమాచారం ఉండదు.

* సమస్యలను చూపించరు
అడల్ట్ సినిమాల్లో సెక్స్ సమస్యల ప్రస్తావన అసలు ఉండదు. సెక్స్ చేసేటప్పుడు అసౌకర్యంగా ఉండే పొజిషన్స్ గురించి చూపించరు. సెక్స్ ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఆ సమయంలో శరీరం ఎలా ఉండాలనే వివరాలు ఉండవు. అంగస్తంభన సమస్యలు, సెక్స్‌ను ఆస్వాదించలేకపోవడం, లూబ్రికేషన్ లేకపోవడం వంటి సమస్యలు, అపోహల గురించి వీటిలో చూపించరు. సెక్స్ గురించి తెలిసిన పెద్దవాళ్లు అడల్ట్ సినిమాలు, పోర్న్ వీడియోల నుంచి ప్రేరణ పొందవచ్చు. కానీ ఇవి సెక్స్ ఎడ్యుకేషన్‌కు సోర్స్‌గా మాత్రం ఉపయోగపడవు. వీటి నుంచి తెలుసుకున్న విషయాలను వేరే నమ్మదగిన సోర్స్‌ ద్వారా సరిచూసుకున్న తరువాతే నమ్మాలి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Porn Movies, Sexual Wellness

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు