హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Diabetes Health Tips: డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?

Diabetes Health Tips: డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?

Health Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా? (Credit - Twitter - Al)

Health Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా? (Credit - Twitter - Al)

Diabetes Health Tips : ఖర్జూరాల్లోని సెలెనియం... మనలో స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ వల్లే డయాబెటిక్ సమస్యలొస్తాయి. అస్థియోపోరోసిస్ (ఎముకలు పెళుసుబారడం), కాన్సర్, అల్జీమర్స్ వంటివి స్ట్రెస్ వల్లే వస్తాయి. హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి... ఖర్జూరాల్లోని పొటాషియం, తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయి.

ఇంకా చదవండి ...

Diabetes Health Tips : ఖర్జూరాలు ఎంతో ఆరోగ్యకరమైన పండ్రు కూవడంతో... మనం తినే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే వాటిలో పోషకాలు ఎక్కువ, సహజమైన షుగర్ ఉంటుంది. అవి పొట్టను ఆరోగ్యకరంగా చేస్తాయి. వాటిలో సెలెనియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం కూడా ఉంటాయి. ఐతే... డయాబెటిస్ ఉన్నవారిని ఎక్కువ షుగర్ ఉండే, ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తినవద్దని అంటుంటారు. మరి వాళ్లు ఖర్జూరాలు తినవచ్చా? మన శరీరంలో రక్తంలో ఎంత షుగర్ ఉండాలో కంట్రోల్ చేసేది ఇన్సులిన్. డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే, రక్తంలో... షుగర్ లెవెల్స్ ఇష్టమొచ్చినట్లు తయారవుతాయి. ఇది ప్రమాదకరం. అందువల్ల ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కావాల్సిందే.

2011లో ఓ పరిశోధన జరిగింది. న్యూట్రిషన్ జర్నల్‌లో ఆ వివరాలు తెలిపారు. ఆ పరిశోధన ప్రకారం... ఖర్జూరాలలో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని తేలింది. మొత్తం ఐదు రకాల ఖర్జూరాలు... ఫరాద్, లులు, బొమాన్, డబ్బాస్, ఖలాస్ పై పరిశోధనలు చేశారు. వాటిలో గ్లిసెమిక్ ఇండెక్స్,... బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై గ్లిసెమిక్ ఇండెక్స్ ప్రభావం, టైప్ 2 డయాబెటిస్‌పై వాటి ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకున్నారు. గ్లిసెమిక్ ఇండెక్స్ 46 నుంచీ 55 ఉంటే... అవి ఆరోగ్యకరమైన ఖర్జూరాలనీ, గ్లిసెమిక్ ఇండెక్స్ 43 నుంచీ 53 మధ్య ఉంటే... అవి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి అనుకూలమైనవిగా తేల్చారు.

ఖర్జూరాల్లోని సెలెనియం... మనలో స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ వల్లే డయాబెటిక్ సమస్యలొస్తాయి. అస్థియోపోరోసిస్ (ఎముకలు పెళుసుబారడం), కాన్సర్, అల్జీమర్స్ వంటివి స్ట్రెస్ వల్లే వస్తాయి. హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి... ఖర్జూరాల్లోని పొటాషియం, తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయి. ఖర్జూరాల్లోని ఫైటోకెమికల్స్... కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, కాన్సర్‌ను దూరం చేస్తాయి. ఖర్జూరాల్లోని ఐరన్ కూడా ఎంతో మేలు చేస్తుంది.

షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి... రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ (ఎక్సర్ సైజ్‌ల వంటివి) ఉంటే... అలాంటి డయాబెటిక్స్ పేషెంట్లు... రోజుకు 1 నుంచీ 3 ఖర్జూరాలు వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐతే, ఈ విషయంలో డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మిగతా ఫ్రూట్స్‌కీ డేట్స్‌ (ఖర్జూరాలు)కీ కొంత తేడా ఉంది. ఖర్జూరాలు ఎండినట్లు ఉంటాయి కాబట్టి... వాటిలో నీరు లేకుండా... పూర్తిగా కేలరీలే ఉంటాయి. అందువల్ల వాటిని తినగానే... ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల డాక్టర్ సలహా పాటిస్తే మంచిది.

First published:

Tags: Diabetes, Health benefits, Health Tips, Women health

ఉత్తమ కథలు