Health Tips : యోగా సంగీతం వినండి.. హృదయాన్ని కాపాడుకోండి

నిద్రపోయే ముందు యోగా సంగీతం వింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జైపూర్‌లోని ఓ హాస్పిటల్‌‌లో జరిగిన పరిశోధన ప్రకారం... పడుకునేముందు ధ్యానం, యోగా‌కి సంబంధించిన మ్యూజిక్ వినడం వల్ల హృదయ స్పందన సరిగ్గా ఉందని తేలింది.

నిద్రపోయే ముందు యోగా సంగీతం వింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జైపూర్‌లోని ఓ హాస్పిటల్‌‌లో జరిగిన పరిశోధన ప్రకారం... పడుకునేముందు ధ్యానం, యోగా‌కి సంబంధించిన మ్యూజిక్ వినడం వల్ల హృదయ స్పందన సరిగ్గా ఉందని తేలింది.

  • Share this:
నిద్రపోయే ముందు యోగా సంగీతం వింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జైపూర్‌లోని ఓ హాస్పిటల్‌‌లో జరిగిన పరిశోధన ప్రకారం... పడుకునేముందు ధ్యానం, యోగా‌కి సంబంధించిన మ్యూజిక్ వినడం వల్ల హృదయ స్పందన సరిగ్గా ఉందని తేలింది. ఈ పరిశోధనలో 26 ఏళ్ల వయస్సున్న 149 మందిని మూడు విభాగాలు విభజించారు. అందులో ఒక విభాగానికి పడుకునే మందు ధ్యానంకు సంబంధించిన మ్యూజిక్, మరో గ్రూప్‌కి పాప్ మ్యూజిక్‌ని, మూడో గ్రూప్‌ చుట్టుపక్కల సైలెన్స్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఐదు నిమిషాల అనంతరం వీరిని పరీక్షించిన శాస్త్రవేత్తలు... యోగాకి సంబంధించిన సంగీతం విన్నవారికి హృదయ స్పందనలో వైవిధ్యం పెరిగిందని, పాప్ మ్యూజిక్ విన్నవారిలో స్పందనలు తగ్గాయని, అదేవిధంగా, అసలు సంగీతం వినని వారిలో ఎలాంటి మార్పురాలేదని గుర్తించారు.

ఇక తక్కువ హృదయ స్పందనలు ఉన్నవారిలో 32-15శాతం గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదముంటుందని తెలిపారు. అంతేకాదు.. దాదాపుగా సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా ఆందోళనలు ఉంటాయని, ఇవి గుండెసంబంధిత సమస్యలకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

వీరి పరిశోధన ప్రకారం పడుకునేముందు ధ్యానం వంటి సంగీతం వినడం ద్వారా ఆందోళనలు తగ్గుతాయి. తద్వారా గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయని తేలింది. అదే పాప్ మ్యూజిక్, ఏ సంగీతం వినని వారిలో ఆందోళనలు పెరుగుతాయని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.


మా హాస్పిటల్స్‌లో మ్యూజిక్ థెరపీ వంటి ప్రయోగాల ద్వారా పేషెంట్స్‌కి ట్రీట్‌మెంట్ చేయడంతో అనూహ్య ఫలితాలను సాధించాం, వారి సమస్యలను తక్కువసమయంలో తీర్చగలిగాం.. ట్రీట్‌మెంట్ తప్పా మరే వైద్యం పనికిరాదని సైన్స్ అంగీకరించకపోవచ్చు. కానీ భారతీయులు దీర్ఘకాలంగా చికిత్స కోసం ఇతర పద్ధతులను నమ్ముతారు
-డాక్టర్ నరేష్ సేన్


ఇలా ప్రముఖ వైద్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో.. పడుకునే ముందు మీరు యోగా మ్యూజిక్ వినండి.. ఆరోగ్యంగా జీవించండంటూ అందరికీ సలహాలిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
First published: