BYJU'S Young Genius: వీళ్లు బాల మేధావులు.. ఒకరు తబలాలో మాస్టర్.. మరొకరు స్కేటింగ్ రికార్డ్ హోల్డర్

తబాలా తృప్త్రాజ్, స్కేటర్ తిలక్ కీసం

ఈ వారం నిర్వహించిన బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమంలో చిన్నవయస్సులోనే తబలా వాయిద్యంలో అద్భుత ప్రతిభను కనబర్చిన తృప్త్ర్ రాజ్ పాండ్య, అవార్డ్ విన్నింగ్ స్కేటర్ తిలక్ కీసం హాజరయ్యారు. వారు ఏం చెప్పారంటే..

  • Share this:
బైజూస్ నిర్వహిస్తున్న యంగ్ జీనియస్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. చిన్న వయసులోనే తమ తమ ఆసక్తుల్లో రాణిస్తూ మంచి పేరు సంపాదించిన ఎంతో మంది చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా పరిచయమవుతున్నారు. చిన్నవయస్సులోనే తబలా వాయిద్యంలో అద్భుత ప్రతిభను కనబర్చిన తృప్త్ర్ రాజ్ పాండ్య, అవార్డ్ విన్నింగ్ స్కేటర్ తిలక్ కీసం హాజరయ్యారు. ఈ షోలో ఇద్దరూ తమ వృత్తులకు సంబంధించిన వివరాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తమ కలలు, ఆశయాల గురించి వివరించారు.

మూడేళ్ల నుంచే తబలా సాధన..
ముంబయికి చెందిన 13 ఏళ్ల తృప్త్ర్ రాజ్ సాంస్కృతిక, కళలకు సంబంధించి 2019-20లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా బైజూస్ యంగ్ జీనియస్ షోలో సందడి చేసి తన గురించి మరిన్ని విషయాలు తెలియజేశాడు. తృప్త్ర్ రాజ్ మూడేళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శన ఇచ్చాడు. నాలుగేళ్లకే దూరదర్శన్ లో ప్రదర్శన ఇచ్చాడు. ఆరేళ్లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొని పిన్నవయస్సులో తబలా మాస్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విషయంపై అతడు మాట్లాడుతూ.. "తబలా నేర్చుకోవడానికి ఒక్క జన్మ సరిపోదు. మీరు మెరుగైన ప్రదర్శన చేయాలంటే మరింత సహనంతో సాధన చేయాలి" అని చెప్పాడు.

భవిష్యత్తులో తబలా ప్లేయర్ గా భారత తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన చేస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తృప్త్ర్ రాజ్ తబలాను ఎలా నేర్చుకున్నాడో వివరించాడు. "నాకు ఏడాదిన్నర వయస్సున్నప్పుడు మా నానమ్మ వంటగదిలో పాటలు పాడేది. నేను వంటగదిలోకి పాకుకుంటూ వెళ్లి పాత్రలపై దరువు వేసేవాడిని. నా దరువులో లయ ఉందని గమనించిన ఆమె నా తండ్రికి చెప్పింది. జీవితంలో లయ చాలా ముఖ్యం. మనకంటూ ఓ సొంత బీట్ ఉంటుంది" అని తృప్త్ర్ రాజ్ చెప్పాడు. ఈ ఎపిసోడ్ లో తృప్త్ర్ రాజ్ ప్రత్యేక తబలా ప్రదర్శన కూడా చేశాడు.

స్కేటింగ్ లో రెండు సార్లు గిన్నిస్ రికార్డు..
12 ఏళ్ల తిలక్ కీసం సుదూర లింబో స్కేటింగ్(Farthest distance limbo skating) విభాగంలో గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ టైటిల్ అధికారికంగా 2015న డిసెంబరు 20న ప్రకటించారు. అయితే 2016 డిసెంబరు 31న తన సొంత రికార్డును తానే బ్రేక్ చేసి మరోసారి గిన్నిస్ రికార్డుకెక్కాడు. మునుపటి రికార్డు 116 మీటర్లను అధిగమించి 145 మీటర్ల సుదూర లింబో స్కేటింగ్ చేశాడు. 2019 నవంబరులో లాంగెస్ట్ స్లాలోం వేవ్(వరల్డ్ రికార్డు) విభాగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. స్కేటింగ్ చేసేటప్పుడు కారులో ఉన్న భావన కలుగుతుందని తిలక్ చెప్పాడు.


తాను మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని, వింటర్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇతడి గురించి క్రీడా మంత్రి కిరణ్ రిజీజు రికార్డు చేసిన ప్రత్యేక సందేశం పంపారు. వింటర్ ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాలన్న తన కల నెరవేరుతుందని.. పట్టుదలతో, కష్టపడి పనిచేయాలని రిజిజు సందేశంలో పేర్కొన్నారు. తిలక్ స్కేటింగ్ ప్రారంభించినప్పుడు అతడికి కేవలం నాలుగేళ్లే. అప్పటి నుంచి ఇంతవరకు దాన్ని వదిలిపెట్టకుండా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. దీంట్లో మాస్టర్ చేసిన తిలక్.. లింబో స్కేటింగ్, స్లావోం వేవ్ బోర్డింగ్ కు కూడా వెళ్లాడు. ఇప్పుడు నెయిల్ ఐస్ స్కేటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు.
Published by:Nikhil Kumar S
First published: