హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

BYJU'S Young Genius: రెండు పియానోలు ఒకేసారి వాయించే లిడియన్ నాదస్వరం

BYJU'S Young Genius: రెండు పియానోలు ఒకేసారి వాయించే లిడియన్ నాదస్వరం

BYJU'S Young Genius: రెండు పియానోలు ఒకేసారి వాయించే లిడియన్ నాదస్వరం
(image: Youtube)

BYJU'S Young Genius: రెండు పియానోలు ఒకేసారి వాయించే లిడియన్ నాదస్వరం (image: Youtube)

BYJU'S Young Genius | ఒకేసారి రెండు పియానోలు వాయించేవారిని ఎప్పుడైనా చూశారా? కళ్లకు గంతలు కట్టుకొని పియానాను వాయించగలరా? ఈ టాలెంట్ ఉన్న లిడియన్ నాదస్వరం గురించి తెలుసుకోండి.

  దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నార్లులో ప్రతిభావంతులను వెలికితీసేందుకు న్యూస్18, బైజూస్ సంయుక్తంగా 'బైజూస్ యంగ్ జీనియస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలమేధావులను గుర్తించింది. వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఇలాంటి ప్రతిభావంతుల్లో ఇద్దరి గురించి తెలుసుకుందాం. అందులో ఒకరు లిడియన్ నాదస్వరం. వయస్సు 15 ఏళ్లు. పేరులో నాదస్వరం ఉన్నా వాయించేది మాత్రం పియానో. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ నుంచి ప్రశంసలు అందుకున్న బాలుడు ఇతను. న్యూస్18 రూపొందించిన ఎపిసోడ్‌లో తన సంగీత ప్రయాణం గురించి వివరించడం మాత్రమే కాదు... లైవ్‌లో తన టాలెంట్ చూపించాడు. రెండున్నరేళ్లకే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు లిడియన్ నాదస్వరం. అతనిలోని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి, సోదరి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పియానో నేర్చుకోవాలని తండ్రి ప్రోత్సహించాడు. ఇక అప్పట్నుంచి పియానో వాయించడంలో ఆరితేరిపోయాడు. ప్రస్తుతం 15 ఏళ్ల వయస్సు ఉన్న లిడియన్ నాదస్వరం ఇప్పటికే 500 పైగా కచేరీల్లో పాల్గొనడం విశేషం.

  పియానో నేర్చుకుంటే ఎవరైనా వాయిస్తారు కదా అందులో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? లిడియన్ నాదస్వరం ప్రత్యేకతలు వేరు. కళ్లకు గంతలు కట్టుకొని పియానో వాయించడంలో స్పెషలిస్ట్. అంతేకాదు... ఒకేసారి రెండు పియానోలు కూడా వాయించగలడు. అందుకే 2019లో ది వాల్డ్స్ బెస్ట్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, హాలీవుడ్‌లో కంపోజర్ కావాలన్నది లిడియన్ నాదస్వరం లక్ష్యం. వాల్డ్ క్లాస్ పియానిస్ట్ కావాలనుకుంటున్నాడు. అంతేకాదు... చంద్రుడిపై పియానో వాయించడానికి రెడీ అంటున్నాడు. ముంబైలో నిర్వహించిన ఇంటర్నేషనల్ పియానో డే సెలబ్రేషన్స్‌లో లిడియన్ నాదస్వరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని, అతని టాలెంట్‌కు మరింత గుర్తింపు లభిస్తుందని ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ప్రశంసించారు. లిడియన్ నాదస్వరం టాలెంట్ మీకూ తెలియాలంటే ఈ వీడియో చూడండి.

  ఇక రెండో బాలమేధావికి 'గూగుల్ గాళ్ ఆఫ్ ఇండియా'గా పేరుంది. ఆమె పేరు మేఘాలి మళబిక. స్పేస్ సైంటిస్ట్ కావాలన్నది ఆమె లక్ష్యం. జాగ్రఫీపై ఆమెకు ఉన్న జ్ఞానాన్ని మానవాభివృద్ధికోసం ఉపయోగిస్తానంటోంది. ఒకవేళ ప్రపంచ పటాన్ని మార్చగలిగే అవకాశమే లభిస్తే యుద్ధాలు చేసే దేశాలను వేరు చేసి, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చేస్తానంటోంది. ఈ షోలో జాగ్రఫీపై ఆమెను అడిగిన ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం విశేషం.

  న్యూస్18, బైజూస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'బైజూస్ యంగ్ జీనియస్' ఎపిసోడ్స్ ప్రతీ శనివారం, ఆదివారం టెలికాస్ట్ అవుతాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: BYJUS

  ఉత్తమ కథలు