Home /News /life-style /

BY THESE COOKING TIPS WE CAN SAVE FIFTY PERCENT GAS RNK

LPG cylinder gas: ఈ చిట్కాతో 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cooking tips: మనం ఇంట్లో వాడే సిలిండర్‌ నిర్ణీత గడువు కంటే ముందే అయిపోతే.. ఇక అంతే, ఆందోళన మొదలవుతుంది. అసలు మనం ఏ తప్పు చేస్తున్నాం. గ్యాస్‌ త్వరగా అయిపోతుందని సందిగ్ధంలో పడిపోతాం.

అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న గందరగోళం ప్రభావం పెట్రోలియం (petroleum)  డీజిల్, ఎల్‌పీజీ (LPG) పై పడింది. రెండేళ్లలో ఎల్‌పీజీ ధరలు ఆకాశాన్నంటాయి. ఎల్‌పీజీ ధర పెరుగుతున్నా కొద్ది సామాన్యుడీ పాకెట్‌ కూడా అంతే వేగంగా భారమవుతోంది. వంటగ్యాస్‌ (Cooking gas) లేకుండా గంట కూడా గడవదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఖరీదైన కుకింగ్‌ గ్యాస్‌ను చాలా తెలివిగా ఉపయోగించడం అవసరం. మనం ఎల్‌పీజీని ఎంత ఎక్కువ సేవ్‌ చేస్తామో.. అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. గ్యాస్‌ను ఆదా చేయడానికి కొన్ని ఈజీ చిట్కాలు ఉన్నాయి. దీంతో మీకు గ్యాస్‌ ఎక్కువ రోజులు వస్తుంది.

మనం ఇంట్లో వాడే సిలిండర్‌ నిర్ణీత గడువు కంటే ముందే అయిపోతే.. ఇక అంతే, ఆందోళన మొదలవుతుంది. అసలు మనం ఏ తప్పు చేస్తున్నాం. గ్యాస్‌ త్వరగా అయిపోతుందని సందిగ్ధంలో పడిపోతాం. ముందుగా వీటిని తెలుసుకుని ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. తద్వారా ఎల్‌పీజీ ఆదా అవుతుంది.

ఇది కూడా చదవండి: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!

కుకింగ్‌ గ్యాస్‌కు కొన్ని చిట్కాలు..

  • వంటగ్యాస్‌ ఆదా చేయడానికి మీరు వంట చేసే ముందు అన్ని పదార్థాలను సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది మీకు సమయం, గ్యాస్‌ రెండింటినీ ఆదా చేస్తుంది. వంట చేసేటపుడు ఎల్లప్పుడూ సరైన సైజ్‌ కడాయి లేదా ప్యాన్‌ ఉపయోగించాలి.

  • ఒక పెద్ద ప్యాన్‌ ఉపయోగించినట్లయితే.. దాన్ని వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్‌ అవసరమవుతుంది. అదే సమయంలో చిన్న సైజ్‌ ప్యాన్‌లో ఆహారాన్ని వండినప్పుడు కూడా గ్యాస్‌ మంట బయటకు వస్తుంది. వినియోగం ఎక్కువ అవుతుంది.

  • ముఖ్యంగా ఏ ఫుడ్‌ను వండిన మూత పెట్టడం మరచిపోకూడదు. లేకుంటే గ్యాస్‌ ఎక్కువగా ఖర్చవుతుంది. అటువంటి సమయంలో వంటగ్యాస్‌ మామూలు కంటే మూడు రెట్లు ఎక్కువగా వృథా అవుతుంది. కాబట్టి ఆహారాన్ని రెడీ చేసినప్పుడల్లా.. దానికి లిడ్‌ తప్పనిసరిగా పెట్టాలి.

  • పాలు, కూరగాయలు వండటానికి ముందు కనీసం 2 గంటల ముందు ఫ్రిజ్‌లోనుంచి బయటకు తీయాలి. ఆ తర్వాత మాత్రమే ఉడికించాలి. అది గ్యాస్‌ వినియోగాన్ని తగ్గిస్తుంది. మాంసం, పప్పులు, చికెన్‌ ఉడకబెట్టడం వల్ల ఎక్కువగా గ్యాస్‌ అయిపోతుంది. అందువల్ల వీటిని వండటానికి ఎప్పుడూ ప్రెజర్‌ కుక్కర్‌ వినియోగించండి.


ఇది కూడా చదవండి: రైస్‌ వాటర్‌తో ఇది కలిపి తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు!

  • ఒకవేళ మైక్రోవేవ్‌ ఉంటే దాని ముందుగా సెమీకూక్‌ చేయడం తర్వాత అది మరింత త్వరగా ఉడికిపోతుంది.

  • గ్యాస్‌ మీద వంట చేసేటప్పుడు గ్యాస్‌ను మీడియం మంటపై ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.ఎందుకంటే ఆహారం అధికమంట మీద, చాలా తక్కువ మంట మీద చేస్తే.. గ్యాస్‌ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

  • ఇక శీతాకాలంలో గ్యాస్‌ బండ త్వరగా అయిపోతుంది. ఏవైనా పదార్థాలను వేడి చేయడానికి ఇదొక్కటే ఆధారం. అందువల్ల గ్యాస్‌ స్టవ్, ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌ లేదా సోలార్‌ పవర్‌తో వేడి చేసే పరికరాలను ఉపయోగించాలి.

Published by:Renuka Godugu
First published:

Tags: LPG Cylinder

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు