హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

health tips: గజ్జితో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క చిట్కా పాటిస్తే నయం అయినట్లే

health tips: గజ్జితో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క చిట్కా పాటిస్తే నయం అయినట్లే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనం రోజూ ఆహారంలో ఉపయోగించే ఓ కాయకూర గజ్జి, తామర లాంటి రోగాలకు చెక్​ పెడుతుంది. అదేంటి అంటారా? కాకరకాయ. గజ్జిని కాకరకాయతో ఎలా దూరం చేయవచ్చో ఒకసారి తెలుసుకుందాం..

  శరీరంలో గజ్జి(itch), తామర వంటి అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. వాటికి చికిత్స తీసుకోకపోతే శరీరమంతా వ్యాపిస్తాయి. లేదా ఇతరులకు కూడా మన ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలం(rainy)లో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.  అందుకే వీటికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. కానీ ఆయింట్మెంట్లు, మందులు అందుబాటులో లేనప్పుడు, లేదా సహజంగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చిట్కాలు పాటించండి. మనం రోజూ ఆహారంలో ఉపయోగించే ఓ కాయకూర గజ్జి(itch), తామర లాంటి రోగాలకు చెక్​ పెడుతుంది. అదేంటి అంటారా? కాకరకాయ(Kakara kaya). గజ్జిని కాకరకాయతో ఎలా దూరం చేయవచ్చో ఒకసారి తెలుసుకుందాం..

  కాకరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ లో కర్పూరం బిళ్ళలు పొడిగా చేసి వేసుకుని కలుపుకోవాలి. ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ తరచుగా ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాకరకాయలో శోధ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించటానికి సహాయ పడుతుంది. అంతే కాకుండా ఈ రెమిడీ మొటిమల సమస్యకు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

  వేపాకు(Neem leaf)తోనూ గజ్జిని దూరం చేయవచ్చు. అతి తక్కువ సమయంలో ఈ చర్మవ్యాధులను వేపాకు తగ్గిస్తుంది. మీ దురద, వ్యాధి వలన వచ్చే నల్లటి మచ్చలు, ఇబ్బంది నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేపాకులు వివిధ రకాల చర్మ వ్యాధులు, సెప్టిక్ పుండ్ల,  కాలిన గాయాలకు బాగా పనిచేస్తాయి. ఆకులు పేస్ట్ రూపంలో అప్లై చేయాలి

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda health tips, Health Tips, Vegetables

  ఉత్తమ కథలు