Home /News /life-style /

Identifying Fresh Fish: చేపలను కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం.. ఈ చిట్కాలను అనుసరించి తాజా చేపలను తీసుకోండి..

Identifying Fresh Fish: చేపలను కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం.. ఈ చిట్కాలను అనుసరించి తాజా చేపలను తీసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Identifying Fresh Fish: ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడైనా నాన్ వెజ్ దుకాణాల్లో జనాలు గుంపులు గుంపులుగా కనపడతారు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకోవాల్సిందే. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏందంటే.. చేపల గురించి. వాటిని కొనుగోలు చేసే సమయంలో ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి ...
    సెలవు రోజు లేదా ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడైనా నాన్ వెజ్ దుకాణాల్లో జనాలు గుంపులు గుంపులుగా కనపడతారు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకోవాల్సిందే. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏందంటే.. చేపల గురించి. మనం మార్కెట్లో లేదా మరేదైనా దుకాణంలో చేపలను తీసుకునే సమయంలో అవి తాజా చేపలా.. లేదా పాడైపోయినవా అనేవి గమనించకుండా తీసుకుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో కల్తీ మాయ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎది చూసిన కల్తీ వ్యాపారం నడుస్తోంది. ఇది చేపల దాకా కూడా పాకింది. ఎక్కవ శాతం జనాలు చేపలు తీసుకునే సమయంలో కేవలం ఆ చేప మొప్పలను ఎత్తి, చేపల లోపలి భాగంలో గులాబీ రంగులో ఉందో లేదో చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో మొప్పలకు గులాబీ కలర్ రంగు, ఎర్ర రంగులను కూడా పూస్తున్నారు. కేవలం ఇదొక్కటే చూసుకొని దీనిని కొనుగోలు చేయడం అనేది మంచిది కాదు. తాజా చేపలను గుర్తించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీకు చేపలు మంచివా.. కావా అనేది సులువుగా తెలుసుకోవచ్చు.

    చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటుందని.. అంతే కాకుండా పోషకాలు మెండుగా ఉంటాయని చాలామంది చికెన్, మటన్ కంటే చేపలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా చేపలను తినడం వల్ల డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్ లో ఉంటాయి కూడా. అందుకే తాజాగా ఉండే చేపలు అంటే పాడైపోయినవి కాకుండా మంచిగా ఉన్నవి తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చేపలను వాసన చూడటం ద్వారా కూడా అవి తాజాగా ఉన్నాయా.. పాడైపోయాయా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నిపుణులు చేపలను గుర్తించడంలో ఇదే ఉత్తమమైన మార్గమని అంటున్నారు. వాసన చూసే సందర్బంలో మీకు దానిలో నుంచి సముద్రపు నీరు వాసన వచ్చినట్లయితే అవి తాజా చేపలని అర్ధం. అలా కాకుండా దుర్వాసన వచ్చినట్లయితే.. అవి కచ్చితంగా పాడైపోయిన చేపలు. చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా.. అలాంటి చేపలు పాడైపోయినవి అని అర్థం.

    తాజా చేపలకు ఎప్పుడూ కూడా కళ్లు ప్రకాశవంతంగా, అలాగే ఉబ్బినట్లుగా ఉంటాయి. ఇలాంటివి గమనించి చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా మరో చిట్కాలో.. తాజాగా ఉంటే చేపల ఆకృతి లోపల, భయట ఒకేలా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా చేపల చర్మంపై ఏదైనా క్రస్ట్ ఉంటే పాడైపోయాయని అర్థం. అంటే ప్రాణం లేకుండా చాలా రోజుల నుంచి నిల్వ ఉంచారని గమనించాలి. తాజా చేపల మాంసం వాటని కోసిన తర్వాత శుభ్రంగా కనిపిస్తుంది. చేపల కళ్లను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వాటి కళ్లలో తెల్లటి పూతలు లేకుండా ఉంటాయి. అలాంటి చేపలు తాజావి అని అర్థం. అంతే కాకుండా తాజా చేపల రంగు సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. వాటి ఆకృతి కూడా కొద్దిగా తడిగా ఉంటుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలను పాటించి తాజా చేపలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Best health benefits, Fish, Health benefits, Health benefits and secrets, Health Tips, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు