Home /News /life-style /

BUTTERMILK RICE VS CURD RICE WHICH ONE BETTER FOR OUR HEALTH HERE SOME INTERESTING FACTS SRD

Health benefits: మజ్జిగ అన్నం vs పెరుగన్నం.. రెండిట్లో ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిది...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Buttermilk Rice: పెరుగన్నం, మజ్జిగ అన్నంలలో ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది? ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిది ఇక్కడ తెలుసుకోండి.

    మండే ఎండల్లో, ఒంటికి చలువ కోసం భారతదేశంలోని ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగను విరివిగా వాడుతుంటారు. పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అరుగుదల మెరుగుపడుతుందని రోజులో ఒక్కసారైనా పెరుగు తింటారు. అయితే పెరుగన్నం, మజ్జిగ అన్నంలలో ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది? అని ప్రశ్నిస్తే మజ్జిగ అన్నమే మరింత ఆరోగ్యకరమైనదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో కాస్త నీళ్లు కలిపి మజ్జిగ చేసి దానిని అన్నంతో కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.

    మజ్జిగ అన్నం తీసుకోవడం ద్వారా శరీరం ప్రోటీన్లను బాగా శోషించుకుంటుంది. అలాగే మజ్జిగ అన్నంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే మజ్జిగ, పెరుగు మధ్య తేడా ఏంటి? మజ్జిగ అన్నం పెరుగన్నం కంటే ఎందుకు ఆరోగ్యకరమైనది? వంటి విషయాలు తెలుసుకుందాం.

    ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే మజ్జిగ.. ప్రీబయోటిక్స్ సమృద్ధిగా ఉండే ఒక ఉల్లిపాయ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది. అప్పట్లో ప్రజలు రోజూ రాత్రిపూట ఉడికించిన ఉల్లిపాయతో మజ్జిగ అన్నం తినే వారు. ఈ ఆహారంలో ఉండే ఔషధ గుణాల వల్ల అప్పటి ప్రజలు 80 ఏళ్లు వచ్చినా యువకుల వలె చాలా చురుగ్గా పనులు చేసేవారు. ఇప్పట్లో 50 ఏళ్లు దాటగానే చాలామంది మంచానికే పరిమితం అవుతున్నారు.

    ఇది కూడా చదవండి : బరువును తగ్గించడంలో బ్లాక్ కాఫీకి సాటి ఇంకొకటి లేదు.. అద్భుత ప్రయోజనాలివే..

    కానీ పూర్వకాలంలో 90 ఏళ్లు వచ్చే వరకు ప్రజలు నిత్యం పని చేస్తుండేవారు. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పచ్చి లేదా ఉడికించిన ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ప్రీబయోటిక్స్ అనేది జీర్ణించుకోలేని మొక్కల ఫైబర్‌లు.. ఇవి ప్రోబయోటిక్స్‌కు ఆహారంగా మారతాయి. తద్వారా మీ పొట్టలోని మంచి బాక్టీరియా (gut) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

    ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ రెండూ జీర్ణక్రియల పనితీరును పెంపొందిస్తాయి. పొట్టలోని అవసరమైన బాక్టీరియా వృద్ధి చెందడానికి ప్రోబయోటిక్స్ దోహదం చేస్తాయి. అయితే ప్రీబయోటిక్స్ ఈ బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతాయి. ప్రోబయోటిక్స్ కేఫీర్, పెరుగు వంటి ఆహారాలలో సమృద్ధిగా లభిస్తాయి. పేగులను పనితీరును పెంపొందించే బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్స్ ఆహారంగా మారతాయి. ప్రీబయోటిక్స్ లభించే ఉల్లిపాయ, వెల్లుల్లి.. ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, పులియబెట్టిన క్యారెట్, బీట్‌రూట్, ఇడ్లీలు తీసుకోవడం చాలా హెల్దీ.

    ఇది కూడా చదవండి : ఉదయాన్నే వెల్లుల్లి తింటే... ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు..

    సాధారణ సౌత్ ఇండియన్ మీల్స్ లో ముడి ఫైబర్ బాగా మిస్ అవుతుంటుంది. కానీ చిన్న మొత్తాల్లో ఫైబర్ తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన తో ఉండొచ్చు. అలాగే ఈ మీల్స్ గ్లైసెమిక్ ఇండెక్ష్‌ను తగ్గిస్తాయి. వండిన అన్నం లేదా బార్లీతో పాటు మజ్జిగ (సమాన భాగాలు పెరుగు + నీరు), తరిగిన ఉల్లిపాయలతో ఉల్లిపాయ పచ్చడి, నిమ్మరసం, ఉప్పు, తరిగిన కొత్తిమీర ఆకులు, ఓవెన్‌లో కాల్చిన వేరుశెనగలు కలిపి ఆహారంగా తీసుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పటి నుంచి మీరు కూడా మంచిగా అన్నం తిని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Curd, Health benefits and secrets, Health Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు