హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day: నాన్నతో నీ ప్రయాణం.. ఒక్కరోజు ఆయనతో ఇలా ఉండండీ..!

Father's Day: నాన్నతో నీ ప్రయాణం.. ఒక్కరోజు ఆయనతో ఇలా ఉండండీ..!

మీ తండ్రితో మంచి బంధాన్ని కొనసాగించాలంటే ఇవి ఫాలో అవ్వండి.

మీ తండ్రితో మంచి బంధాన్ని కొనసాగించాలంటే ఇవి ఫాలో అవ్వండి.

అందరి జీవితాలలో తండ్రికి (Father) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనతో బలమైన బంధం జీవితంలోని అనేక గందరగోళాలు, తికమకలను దూరం చేస్తుంది. తండ్రితో స్ట్రాంగ్‌ రిలేషన్‌ (Relationship) పెంచుకోవడం అనేది వరంతో సమానం.

నాన్నంటే ఓ నడవడిక.. నాన్నంటే ఓ నమ్మకం.. నాన్నంటే ఓ నిజం.. నాన్నంటేనే నాన్న. నాన్న గురించి చెప్పాలంటే ఈ నాలుగు పదాలేనా.. కాదు.. కాదు.. నిర్వచించలేని ఓ అసమాన స్వరూపం నాన్న. అలాంటి నాన్న కోసం ఓ రోజు వచ్చింది. మరి మీ నాన్నతో మీ బంధం ఎలా ఉండేది.. ఒకవేళ ఆయనతో అంత బాండింగ్ లేకపోతే.. ఆ రిలేషన్ పెంచుకోవడానికి మీ కోసం మేమిచ్చే కొన్ని సూచనలు ఇవే..!

ప్రతి సంవత్సరం జూన్‌ నెల మూడో ఆదివారం Fathers Day నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 19న ఫాదర్స్‌ డే జరుపుకోనున్నారు. అందరి జీవితాలలో తండ్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనతో బలమైన relationship జీవితంలోని అనేక గందరగోళాలు, తికమకలను దూరం చేస్తుంది. అయినప్పటికీ పిల్లలు తరచుగా సాధారణ సమస్యలను లేదా జీవితంలో తీసుకుంటున్న ప్రధాన నిర్ణయాలను తండ్రులతో పంచుకోవడానికి ఆలోచిస్తుంటారు. పిల్లలు ఎంత పెద్దవారైనా ఈ వైఖరిలో మార్పు ఉండదు. అదే విధంగా పిల్లలు చాలా సమస్యలపై నాన్న చెప్పే మాటలతో విభేదిస్తుంటారు. తండ్రితో స్ట్రాంగ్‌ రిలేషన్‌ పెంచుకోవడం అనేది వరంతో సమానం. విభిన్నమైన అభిరుచులు, ఆసక్తులు, కలవడానికి చాలా తక్కువ సమయం ఉండటం వంటివి తండ్రితో అంతగా రిలేషన్‌ బలపడకపోవడానికి కారణాలు కావచ్చు.

తండ్రితో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి. వేర్వేరు పనివేళలు, అవసరాల కారణంగా childrenకు తండ్రికి కలిసే సమయం తక్కువ ఉంటుంది. వేర్వేరు పట్టణాల్లో నివసిస్తుంటే కలవడం ఇంకా కష్టం. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కలిసేలా సమయాన్ని ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం. తండ్రితో రిలేషన్‌ పెంచుకోవడానికి మరో మార్గం.. ఆయనతో అన్ని విషయాలు పంచుకోవడం, మీ ఆలోచనలు, భావాలను నిజాయతీగా ఆయనతో పంచుకోవడం. అదే విధంగా ఆయన అభిప్రాయాలు వినడానికి సిద్ధంగానూ ఉండాలి. తండ్రితో స్ట్రాంగ్‌ రిలేషన్‌ ఏర్పరుచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవే..

ఉమ్మడి ఆసక్తుల గురించి మాట్లాడండి (Talk About Common Interests) ఇద్దరికీ ఆసక్తి ఉన్న అంశాల గురించి మాట్లాడుకోవడం ద్వారా రిలేషన్‌ బలపడుతుంది. ఎక్కువ సేపు మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలు, సినిమాలు ఇలా రోజువారీ జీవితంలో, ఇద్దరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడే విషయాలను కనుక్కోవడం, తండ్రితో బలంగా కనెక్ట్ కావడానికి సహాయం చేస్తుంది.

ఇదీ చదవండి: నాన్నకు ప్రేమతో ఏం గిఫ్ట్ ఇస్తారు.. మా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి.. ఒకసారి చూడండీ..!


ఒకరికొకరు సమయాన్ని వెచ్చించండి

పిల్లలు, తండ్రి ఇద్దరూ బిజీగా ఉన్నప్పటికీ, కలిసి సమయాన్ని గడపడానికి ప్లాన్‌ చేయడం ముఖ్యం. కాఫీ కోసం బయటకు వెళ్లడం, సరదాగా వాకింగ్‌ చేయడం వంటివి చేయాలి. ఏ బంధం బలపడాలన్నా కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ముఖ్యం.

తండ్రికి నచ్చే యాక్టివిటీస్‌ చేస్తూ టైమ్‌ స్పెండ్‌ చేయండి

తండ్రికి ఇష్టమైన యాక్టివిటీస్‌ గురించి తెలుసుకోవాలి. గోల్ఫ్‌, ఫిషింగ్, హైకింగ్ లేదా చెస్‌ తదితరాలలో ఏ యాక్టివిటీని ఆయన ఇష్టపడతారో గుర్తించాలి. ఆయనకు ఇష్టమైన యాక్టివిటీస్‌ చేస్తూ కలిసి టైమ్‌ స్పెండ్‌ చేస్తే బావుంటుంది.

ముఖ్యమైన విషయాలు మాట్లాడండి

పిల్లలు ఆశలు, కలలు, భయాల గురించి తండ్రికి చెప్పాలి. ఇది పిల్లలను బాగా అర్థం చేసుకోవడానికి, సన్నిహితంగా ఉండటానికి తండ్రికి సహాయపడుతుంది.

ఒకరితో ఒకరు నిజాయతీగా ఉండండి

కష్టమైన సంభాషణలను నివారించడం చాలా సులభం, కానీ ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పడాలంటే నిజాయతీతో మాట్లాడటం కీలకం. ఇబ్బంది కలిగించే దేదైనా ఉంటే, దాని గురించి తండ్రితో పిల్లలు మాట్లాడాలి. అనుకున్నదానికంటే ఆయనకు ఎక్కువ అవగాహన ఉండవచ్చు.

ఇదీ చదవండి: రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?


ఒకరికొకరు సపోర్ట్‌ ఇవ్వండి(Support Each Other)

ప్రోత్సహించేలా మాట్లాడినా, భుజం తట్టి ధైర్యం చెప్పినా.. ఏ రూపంలో అయినా ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవడం ముఖ్యం. సపోర్ట్‌ ఇవ్వడం బంధాన్ని బలోపేతం చేయడంలో చాలా దోహదపడుతుంది.

కృతజ్ఞతలు చెప్పండి(Express Your Gratitude)

జీవితంలో తండ్రి స్థానానికి ఎంతు విలువ ఇస్తున్నారో తండ్రికి తెలియజేయండి. తండ్రికి చెప్పే చిన్న థ్యాంక్స్‌.. పిల్లలు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చూపించడంలో చాలా దూరం వెళ్ళవచ్చు.

First published:

Tags: Children, Fathers Day, Happy Fathers Day, Relationship

ఉత్తమ కథలు