Home /News /life-style /

BRITAIN GOVT PLANS TO INCREASE EGG AND SPERM FREEZING UP TO 55 YEARS BA GH

అండం, వీర్యం నిల్వ చేద్దామనుకునే వారికి ఓ గుడ్ న్యూస్.. ఇకపై మీరు ఇలా చేయవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తులో పిల్లలను కనేందుకు.. ముందుగానే అండం, వీర్యాలను సేకరించి ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేస్తారు. పిల్లలను పొందాలనుకున్నప్పుడు సంతానోత్పత్తి చేసుకుంటారు. ఈ ప్రక్రియలో ఐవీఎఫ్ ద్వారా సుమారు 15 గుడ్లను సేకరిస్తారు.

పిల్లలను ఎప్పుడు పొందాలో ప్రజలు నిర్ణయం తీసుకునే విధంగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అండాలు(Eggs), వీర్యాల(Sperm) నిల్వ పరిమితిని 55 సంవత్సరాలకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ గడువు 10 సంవత్సరాలుగా ఉండగా.. దాన్ని 55ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. 10 సంవత్సరాల గడువు అన్నది తీవ్ర నిర్బంధంగా ఉందని బ్రిటన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు. అధునాతన ఫ్రీజింగ్ టెక్నిక్స్​ వల్ల అండాలు ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి నష్టం జరగకుండా నిల్వ ఉంటాయి. రాయల్ కాలేజ్ ఆఫ్​ ఓబ్టెట్రిసియన్​ అధ్యయనం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో అండాలు, వీర్యాలు, పిండాల నిల్వ వ్యవధిని పెంచేందుకు బ్రిటన్ సర్కార్​ సిద్దమైంది. అయితే ఇందుకు పార్లమెంటు ఆమోదం అవసరం ఉంది. థర్డ్​పార్టీ దాతలు, మృతి చెందిన వ్యక్తుల నుంచి సేకరించిన ఘనీభవించిన కణాలను సేకరించే విషయంలో అదనపు నిబంధనలు విధించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం వీర్యం, అండం దాచుకున్న తల్లిదండ్రులు పదేళ్ల కాలం లోపు సంతానోత్పత్తి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే కణాలను నాశనం చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ పది సంవత్సరాలకు ఓ సారి కణాల నిల్వ కొనసాగించాలా.. లేదా నాశనం చేయాలా అనే ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది.

గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకుంటే మంచింది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?


ఈ విషయంలో “గడువు ముగిసిపోతుందని ఆందోళన చెందే వారికి కొత్త చట్టం ఊరట కలిగిస్తుంది. ఈ మార్పులు చేయడం వల్ల పెద్ద ముందడుగు వేసినట్టు అవుతుంది. సంతానోత్పత్తి విషయంలో ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు సమానత్వం పెంపొందించడంలోనూ ఈ మార్పు తోడ్పడుతుంది” అని జావిద్ చెప్పారు. బ్రిటిష్ ఫెర్టిలిటీ సొసైటీ చైర్మన్​ డాక్టర్ రాజ్ మాథుర్ సైతం ఈ నిబంధన మార్పును ఆహ్వానించారు.

ఆసుపత్రిలో ఇంత దారుణమా.. అబ్బాయికోరేటు.. అమ్మాయికోరేటు..!


అండం, వీర్యం, పిండం నిల్వ అంటే ఏంటి?

భవిష్యత్తులో పిల్లలను కనేందుకు.. ముందుగానే అండం, వీర్యాలను సేకరించి ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేస్తారు. పిల్లలను పొందాలనుకున్నప్పుడు సంతానోత్పత్తి చేసుకుంటారు. ఈ ప్రక్రియలో ఐవీఎఫ్ ద్వారా సుమారు 15 గుడ్లను సేకరిస్తారు. వాటిని చల్లబరిచి ద్రవ నైట్రోజన్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు గుడ్లను కరిగించి.. చెక్కుచెదరకుండా ఉన్న వాటిలో వీర్యాలను ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు అండం ఫలదీకరణ చెంది పిండం అవుతుంది.

ప్రసవం గురించి భయపడుతున్నారా? టోకోఫోబియా కావచ్చు.. చెక్ చేసుకోండి..


వీర్యం శాంపిళ్లను స్ట్రాస్ అనే వివిధ కంటైనర్లలో విభజిస్తారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు వినియోగించేందుకు వీర్యం ఉపయోగపడుతుంది. మొదటిసారి విజయవంతం కాకపోతే లేదా మరోసారి సంతానం పొందాలనుకుంటే వేర్వేరుగా నిల్వ చేసిన వీర్యం శాంపిళ్లను వినియోగిస్తారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Pregnant, Sperm

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు