ఎంత వెలుతురు ఉంటే అంత టేస్ట్ అంట.. అధ్యాయనంలో ఆశ్చర్యకర విషయాలు

రుచి తీవ్రత చూపుపై ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. డచ్‌ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో మసకబారిన లైటింగ్‌, తక్కువ కాంతి ఆహారం రుచిని తగ్గించినట్లు చాలామంది భావించారని తేల్చారు.

news18-telugu
Updated: October 21, 2020, 6:36 PM IST
ఎంత వెలుతురు ఉంటే అంత టేస్ట్ అంట.. అధ్యాయనంలో ఆశ్చర్యకర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవ జ్ఞానేంద్రియాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా ఏవైనా రెండు, అంతకంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు కలిస్తేనే ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. రుచి తీవ్రత చూపుపై ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. డచ్‌ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో మసకబారిన లైటింగ్‌, తక్కువ కాంతి ఆహారం రుచిని తగ్గించినట్లు చాలామంది భావించారని తేల్చారు. వెలుగు తగ్గినప్పుడు తినేవారికి రుచి తీవ్రత కూడా తగ్గుతుందని వారు కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా ఒకే ఆహారాన్ని ఎక్కువ ప్రకాశవంతమైన లైటింగ్‌లో కూర్చున్న వారికి, కాంతి తక్కువగా ఉండే లైట్‌ కింద కూర్చున్న వారికి ఇచ్చారు. వారిలో ప్రకాశవంతమైన లైటింగ్లో కూర్చున్నవారు ఆహారం మరింత రుచిగా ఉందని చెప్పారు.

లైట్లను సవరిస్తూ సాగిన అధ్యాయనం..

నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. రెస్టారెంట్‌లోని లైట్లను సవరిస్తూ అక్కడి వాతావరణాన్ని మార్చారు. అనంతరం వారు తిన్న ఆహారం రుచి గురించి ఆరా తీశారు. ఇందుకు ఒక రెస్టారెంట్‌ను ఎంచుకున్నారు. మొత్తం 138 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. రోజును బట్టి లైట్ సెట్టింగులు మార్చారు. మొదటి వంటకం తిన్న తర్వాత వారికి ఇచ్చిన క్వశ్చనైర్‌ను నింపమని అడిగారు. దీని ద్వారా రుచితో పాటు ధ్వని(సౌండ్), వాసనకు మధ్య సంబంధాన్ని కూడా విశ్లేషించారు.

ఫస్ట్‌ టేస్ట్‌ చూపుతోనే..
ఫస్ట్‌ టేస్ట్‌ను కస్టమర్లు చూపుతోనే గ్రహించగలరని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ ప్రాంతానికి చెందిన క్రోకర్స్ ట్రింగ్ అనే రెస్టారెంట్ యజమాని ల్యూక్ గార్న్స్‌వర్తి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆహారం రుచి లైటింగ్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఎక్కువ లైటింగ్ ఉండే రెస్టారెంట్లలో తినడం వల్ల మరిన్ని ఉపయోగాలున్నాయని ఆయన వివరించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే వారు చూపుతో కూడా ఆహారాన్ని ఆస్వాదించడానికి, వారికి అందించే పదార్థాలను ఫోటోలు తీసి స్నేహితులతో పంచుకోవడానికి లైటింగ్ ఉపయోగపడుతుందని వివరించారు.

రొమాంటిక్ డిన్నర్ కోసం డిమ్ లైటింగ్..
ప్రకాశవంతమైన లైటింగ్ ఆహారాన్ని రుచిగా మారుస్తుందని అధ్యయనం తేల్చినప్పటికీ, ప్రశాంతంగా(రిలాక్స్డ్‌గా) ఆహారాన్ని ఆస్వాదించాలనుకునే వారు డిమ్ లైటింగ్ లో తినడానికి ఇష్టపడుతున్నారని తేలింది. ఇలాంటి డిమ్ లైటింగ్ కస్టమర్లను ఎక్కువ సమయం రెస్టారెంట్‌లో కూర్చోబెట్టడానికి ఉపకరిస్తుందని నార్మా, ద స్టాఫోర్డ్‌ రెస్టారెంట్ల డైరెక్టర్ బెన్ టిష్ చెబుతున్నారు. ఈ రెండు రెస్టారెంట్లూ లండన్లోనే ఉన్నాయి. రొమాంటిక్ డిన్నర్‌కు ఇది మంచి మార్గమని ఆయన చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading