Health Tips : బిడ్డకు పాలిస్తే తల్లికి ఎన్ని లాభాలో చూడండి..

డెలీవరీ అయిన మహిళల్లో చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ఒకటి డిప్రెషన్. అలాంటి వారు బిడ్డకు పాలు పట్టడం వల్ల ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

Amala Ravula | news18-telugu
Updated: June 26, 2019, 11:33 AM IST
Health Tips : బిడ్డకు పాలిస్తే తల్లికి ఎన్ని లాభాలో చూడండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పుట్టినపిల్లలకి తల్లీపాలు పట్టడం ఎంతో మంచిది. అయితే, ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారులకే కాదు.. తల్లికి కూడా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
బిడ్డుకు ఎక్కువకాలం పాలివ్వడం వల్ల భవిష్యత్‌లో తల్లి డిప్రెషన్‌కి గురి కాకుండా ఉంటుందని అమెరికాకి చెందిన అధ్యయన కారులు చెబుతున్నారు.
40 నుంచి50 ఏళ్ల మహిళలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో పాలివ్వని వారు డిప్రెషన్‌కి గురై ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటుంటే.. పాలిచ్చిన వారు ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి కారణమేంటో కూడా చెబుతున్నారు నిపుణులు.


పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. అందుకే వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
కాబట్టి ఏవేవో కారణాలతో పాలు ఇవ్వడాన్ని పక్కన పెడుతున్నవారు.. ఏంచక్కా చిన్నారులకి పాలివ్వండి.. వారితో పాటు మీరూ ఆరోగ్యంగా ఉండండంటూ చెబుతున్నారు వైద్యులు.
First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>