హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Milk: తల్లి పాలతో కరోనాకు చెక్.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

Breast Milk: తల్లి పాలతో కరోనాకు చెక్.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్నారులకు కరోనా సోకకుండా వారిలో యాంటీ బాడీలు వృద్ధి చేసేలా తల్లి పాలు సహకరిస్తాయని తాజా అధ్యయనం తేల్చింది. కాబట్టి తల్లి పాలే బిడ్డకు (babies) శ్రీరామరక్ష అన్న విషయం మరోమారు రుజువు అయింది.

చిన్నారులకు కరోనా సోకకుండా వారిలో యాంటీ బాడీలు వృద్ధి చేసేలా తల్లి పాలు సహకరిస్తాయని తాజా అధ్యయనం తేల్చింది. కాబట్టి తల్లి పాలే బిడ్డకు (babies) శ్రీరామరక్ష అన్న విషయం మరోమారు రుజువు అయింది. కోవిడ్-19 (covid-19) నుంచి తేరుకున్న తల్లులు ఇచ్చే పాలల్లో బలమైన యాంటీబాడీలు (antibodies) పుష్కలంగా ఉంటాయని, దీంతో వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని Professor Jennifer Hahn-Holbrook తాజా అధ్యయనంలో తేలింది. నవజాత శిశువులను సార్స్(SARS), కోవిడ్ వంటి బారిన పడకుండా కాపాడటం ఎలా అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి (pandemic) ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపథ్యంలో అసలు కరోనా సోకిన తల్లి బిడ్డకు పాలియ్యవచ్చా ? కరోనా వైరస్ బారిన నుంచి బయటపడ్డాక తన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ఎంత వరకు సురక్షితం అన్న విషయంపై సాగిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

పెద్దలకు మంచిదే..

చనుపాలలో సిక్రెటరీ టైప్ యాంటీబాడీస్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కోవిడ్-19 నుంచి కోలుకున్న తల్లి పాలల్లో ఉన్న రోగనిరోధక శక్తి పాలద్వారా చిన్నపిల్లలకు అందుతుంది. అందుకే ఈ పాలు యాంటీబాడీలను ఈజీగా వృద్ధిచేస్తాయి. అయితే పెద్దలకు కూడా ఇదే విధానం ప్రయోగిస్తే కోవిడ్-19కు విరుగుడుగా, తల్లిపాలు మందులా పనిచేసే అవకాశాలున్నాయి. యాంటీబాడీలతోనే వైరస్ కు చెక్ పెట్టగలం, యాంటీబాడీలు ఎక్కువగా ఉన్న, శక్తివంతమైన తల్లిపాలు పిల్లలు, పెద్దలు తీసుకుంటే వారికి వ్యాధినిరోధక శక్తి పెరగటం ఖాయమని అధ్యయనం వివరిస్తుండటం విశేషం. తల్లిపాలకున్న శక్తి, వాటిలోని యాంటీబాడీలపై ఉన్న అనుమానాలను వీరు Department of Psychological Sciences పటాపంచలు చేస్తున్నారు.

SARS కు కూడా

సాధారణంగా పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం బాగాలేకపోతే వారిచ్చే పాలల్లో ఉన్న యాంటీబాడీల ద్వారా ఆ పర్టికులర్ అనారోగ్యంపై పోరాడే శక్తిని శిశువు పొందుతుంది. ఇమ్యూన్ సిస్టంను చురుగ్గా ఉంచి, వ్యాధికారకాలైన కోవిడ్-19 వంటి వాటిపై పోరాడేలా యాంటీబాడీలు సహకరిస్తాయి. కానీ కోవిడ్-19 పూర్తిగా కొత్త వ్యాధి కావటంతో తల్లిపాల ప్రభావంను అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఈ అధ్యయనంలో తల్లిపాలకున్న ప్రత్యేకత తేలింది, అయితే ఇవేవీ తమకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అధ్యయనకర్తలు పేర్కొనడం విశేషం. తల్లి పాలలో ఉన్న sIgA అనే ప్రత్యేక యాంటీబాడీలు అత్యధిక స్థాయిలో ఉంటుందన్న తమ అంచనా నిజమైందని వీరు వివరిస్తున్నారు. కోవిడ్-19 సోకని తల్లులు ఇచ్చే పాలల్లోని సాధారణ రోగనిరోధక శక్తి కూడా కోవిడ్-19పై పోరు జరిపేందుకు పాలుతాగే పిల్లల్లో అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిశోధనల్లో మరింత పురోగతి సాధించేందుకు అమెరికాలో తల్లిపాల సేకరణ జోరుగా సాగుతోంది. సమీప భవిష్యత్తులో దీనిపై ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని, దీంతో సార్స్, కోవిడ్-19 వంటి భయంకరమైన వ్యాధులకు విరుగుడు కూడా దొరకచ్చని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సార్స్, కోవిడ్-19 వంటి మహమ్మారులకు చికిత్స తల్లిపాలలో ఉండచ్చనే అంచనాల నేపథ్యంలో ఈ దిశగా సరికొత్త పరిశోధనలు జోరందుకున్నాయి.

ప్లాస్మా (plasma) కంటే తల్లిపాలే మంచివి

ఈ అధ్యయనంలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఇదే. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్మా థెరపీని విజయవంతంగా ప్రయోగిస్తున్నారు. తల్లిపాలతో కరోనాపై పోరాటం జరిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక దీన్ని ప్రపంచవ్యాప్తంగా సులువుగా అమలు జరపవచ్చని భావిస్తున్నారు. ఇక తల్లిపాలు అత్యంత చవకగా లభిస్తాయి కనుక ఎంతటి నిరుపేదలైనా తల్లిపాలను తీసుకుని, కోవిడ-19 నుంచి బయటపడచ్చని అధ్యయనకర్తలు అంచనా వేస్తున్నారు. తల్లి పాలల్లోని యాంటీబాడీలు పెద్దల్లో ఎంతమాత్రం పనిచేస్తాయన్న విషయం సాంకేతికంగా రుజువు కావాల్సి ఉంది. అయితే ఇందుకు రీఫైన్డ్ చనుబాలు మాత్రమే ఉపయోగించాలా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

First published:

Tags: Breastfeeding, Coronavirus, MILK

ఉత్తమ కథలు