Home /News /life-style /

BREAKFAST TIPS FOOD TIPS HOW TO MAKE 4 SOUTH INDIAN BREAKFAST FOOD WITH ONE BASIC BATTER SK

Breakfast Tips: రోజూ ఒకే టిఫిన్ బోర్ కొడుతోందా? ఈ చిట్కాతో ఇంట్లోనే రోజుకో వెరైటీ తినొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breakfast Tips: ప్రతి రోజూ ఒకేరకమైన టిఫిన్ తింటూ బోర్‌తా ఫీలవుతున్నారా? ఐతే ఒకే బ్యాటర్‌తో నాలుగు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. దాని తయారీ విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  బిజీ లైఫ్ స్టైల్​ కారణంగా కొంతమంది ఉదయం బ్రేక్​ఫాస్ట్​ (Breakfast Tips) చేయకుండానే ఆఫీసులకు పరుగులు పెడుతుంటారు. మరికొందరు వారానికో.. నాలుగు రోజులకో ఒకసారి ఇడ్లీ పిండి (Idli Batter) రుబ్బి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆ నాలుగు రోజులూ ఇడ్లీతోనే కాలం గడిపేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకే టిఫిన్ తింటే బోర్ కొడుతుంది. కానీ అన్ని రకాల పిండిలు రుబ్బి పెట్టుకోవాలన్నా సమయం సరిపోదు. మీరూ ఇలాగే అనుకుంటున్నారా? అయితే ఈ పిండి మిశ్రమం తయారీ చూసేయండి. ఈ ఒక్క మిశ్రమం ఉపయోగించి నాలుగు రకాల టిఫిన్లను చాలా సులభంగా చేసేయొచ్చు. పిండి సిద్ధంగా ఉంటే చాలు.. ఇడ్లీ నుంచి ఊతప్పం వరకూ అన్నీ క్షణాల్లో తయారై మీ ముందుంటాయి. ఫ్రిజ్ లో ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదు. మరి దాన్ని ఎలా చేయాలంటే..

  పిండి తయారు చేసుకునే విధానం:
  ఈ పిండిని తయారు చేసుకోవడం చాలా సులభం. దీనికోసం కేవలం 4 కప్పుల బియ్యం, 1 కప్పు మినప్పప్పు, 2 స్పూన్ల మెంతులు, తగినంత ఉప్పు ఉంటే చాలు.. ముందుగా, ఒక గిన్నెలో బియ్యం, పప్పు, మెంతులు వేసి బాగా కడిగి 4- నుండి 5 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తరువాత నీటిని వడకట్టి పప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో వేయండి. గిన్నెలో కొన్ని చల్లటి నీటిని జోడించి గ్రైండర్లో వేయండి. ఇప్పుడు మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని మృదువైన పేస్ట్​గా తయారు చేసుకోండి. ఇప్పుడు దానిలో రుచికి తగ్గట్లు ఉప్పు వేసి, మీ చేతితోనే బాగా కలపండి. తర్వాత గిన్నెను ఒక మూతతో కప్పి, రాత్రిపూట 12 నుండి -14 గంటల మేర పులియబెట్టండి. దాన్ని మరుసటి రోజు ఉదయం రుచికరమైన బ్రేక్​ఫాస్ట్​లను తయారు చేసేందుకు ఉపయోగించండి. ఈ పిండి ఫ్రిజ్ లో పెట్టకుంటే నాలుగైదు రోజుల వరకూ పాడు కాకుండా ఉంటుంది. దీంతో టిఫిన్లు ఎలా చేసుకోవాలంటే..

  ఇడ్లీ:
  ఇడ్లీలు తయారు చేయడం చాలా సులభం. ఇడ్లీ మౌల్డ్ తీసుకొని వాటిలో కొద్దిగా నూనె వేసి రుద్దుకోవాలి. ఆ తర్వాత పిండి వేసుకొని వాటిని 12 నుండి -15 నిమిషాల వరకు ఆవిరిలో ఉడికించండి. మౌల్ట్స్​ నుండి ఇడ్లీలను తీసి సాంబార్, కొబ్బరి పచ్చడితో కలిపి తినండి. అద్భుతంగా ఉంటుంది.

  ఊత్తప్పం:
  నాన్-స్టిక్ పెనంపై నూనె వేసి, దానిపై కొంచెం పిండిని వేసి కొద్దిగా రుద్దండి. దానిపై తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, క్యారెట్‌ వంటివి జోడించండి. ఆ తర్వాత పెనంను ఒక మూతతో కప్పండి. ఒకవైపు బంగారు రంగు వచ్చేవరకూ ఉంచి ఆపై మరోవైపు తిప్పుకోవాలి. అటు కూడా కాలిన తర్వాత ప్లేట్​లోకి సర్వ్​ చేసుకొని కొబ్బరి పచ్చడితో ఆస్వాదించండి.

  Blood Pressure in Children: పిల్లల్లో బీపీ వస్తుందా? ఎలా కొలుస్తారు? లక్షణాలేంటి

  దోశ:
  దక్షిణాది వంటకాల్లో ఆల్​ టైమ్​ ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​ దోశ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే రుచికరమైన దోశలను సిద్ధం చేసుకోవచ్చు. అయితే, దోశలను తయారు చేయడానికి ముందుగా మీ పిండి గట్టిగా ఉండేమో చూడాలి. అవసరమైతే, కొద్దిగా నీరు కలపండి. నాన్ స్టిక్ పెనంపై పిండి పోసి దోస ఆకారం వచ్చేలా దీన్ని సర్కిల్‌గా రుద్దుకోవాలి. అదనపు రుచి కోసం బంగాళాదుంపలు, పన్నీర్ లేదా ఉల్లిపాయ వంటి వాటిని దీనిపై జోడించండి. దాన్ని ప్లేట్​లోకి సర్వ్​ చేసుకొని కొబ్బరి పచ్చడి, సాంబార్​తో ఆస్వాదించండి.  పునుగులు:
  పునుగులను తయారు చేయడం చాలా సులభం. ముందుగా రాత్రి పులియబెట్టిన పిండిలో తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వంటి వాటిని జోడించి బాగా కలపండి. తర్వాత కొంచెం నెయ్యి కలిపి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. పునుగుల పెనంలో నూనె పోసి వేడి చేయండి. దానిలో పిండిని పోయండి. అన్ని వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఉడికించండి. వాటిని ఒక గిన్నెలోకి సర్వ్​ చేసుకొని.. కొబ్బరి పచ్చడితో ఆస్వాదించండి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Breakfast, Health, Horoscope, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు