హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breakfast Ideas: నవోదయాన కొత్త ఉత్సాహం కోసం ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చెయ్యండి

Breakfast Ideas: నవోదయాన కొత్త ఉత్సాహం కోసం ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చెయ్యండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breakfast Ideas: ఉదయం వేళ మనం ఎనర్జీతో పనిచెయ్యాలంటే బ్రేక్‌ఫాస్ట్ అదిరిపోవాలి. అది స్ట్రెస్ తగ్గించాలి, కొవ్వు రాకుండా చెయ్యాలి. కాబ్టటి అలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఏదో తెలుసుకొని ఫాలో అయిపోదామా.

Healthy Breakfast : చాలా మంది ఉదయం వేళ టిఫిన్ తినకుండా... డైరెక్టుగా మధ్యాహ్నం అయ్యాక భోజనం చేస్తుంటారు. కొంత మంది టీయో కాఫీయో తాగి సరిపెట్టుకుంటారు. ఈ విధానం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే... రాత్రి భోజనం చేశాక... దాదాపు 8 నుంచీ 10 గంటల వరకూ ఏమీ తినం. అలాంటప్పుడు ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి. దాన్ని స్కిప్ చేయడం వల్ల గ్యాస్, ACDT వంటి సమస్యలు రావడమే కాదు..తలనొప్పి, టెన్షన్, వణుకు, నీరసం వంటి చాలా సమస్యలు తలెత్తుతాయి. అందుకే కదా ఉదయం వేళ రాజులా తినాలి, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలనే సామెత ఉంది. అందువల్ల ఉదయం వేళ తినే ఆహారం సరైనది తింటే... ఆ రోజంతా ఎనర్జీతో పని చెయ్యడానికి వీలవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన ఆహారం తినేవారు ఎక్కువ ఆరోగ్యంతో, ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచంలో బ్లూజోన్స్‌గా పిలుస్తున్న ప్రదేశాల్లో ప్రజలు వందేళ్లకు పైగా జీవిస్తున్నారు. అందుకు అనేక కారణాల్లో... టిఫిన్ మస్ట్‌గా తినడం కూడా ఒకటని తేలింది.

మన దేశంలో కేరళ, జమ్మూకాశ్మీర్, పంజాబ్, మహారాష్ట్రలో ప్రజలు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారు. అందువల్ల దేశపు సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కేరళలో ఇడ్లీ లేదా అప్పం... కాశ్మీర్‌లో బ్రెడ్ లేదా నూన్ చాయ్... పంజాబ్‌లో పరాఠా... మహారాష్ట్రలో ప్రజలు పోహా ఎక్కువగా తింటున్నారు. అందువల్ల వారంతా ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేలింది. అందువల్ల ఈ టిఫిన్లను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఐతే... వీటిని ఇళ్లలో చేసుకొని తినడం మేలు. బయటి హోటళ్లలో కొనుక్కుంటే... అక్కడ మైదాపిండి, పామాయిల్ వాడే ప్రమాదం ఉంటుంది. ఈ రెండింటినీ వాడి తయారుచేసే టిఫిన్లు ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.

ఆరోగ్య నిపుణుల ప్రకారం... బాక్సులు, ప్యాకేజీల్లో వచ్చే ఫుడ్ తినవద్దు. ఉదాహరణకు ప్యాక్ చేసిన తృణధాన్యాలు, ఓట్స్, స్మూతీస్, జ్యూస్‌లు వంటివి తీసుకోకపోవడం మేలు. పోహా, ఉప్మా, ఇడ్లీ, దోశ, నూన్ చాయ్, పరాఠా, పూరీ-సబ్జీ (కూర), మిస్సీ రోటీ, కులాత్ పరాఠా, బజ్రా కిచిడీ వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఇలాంటివి తినడం కుదరకపోతే... తప్పనిసరి పరిస్థితుల్లో అరటి పండ్లు కూడా తినవచ్చని చెబుతున్నారు. తడ్కా, చపాతీ వంటివైనా తినవచ్చని సూచిస్తున్నారు. అంబోలీ, సట్టు, మిల్లెట్స్, గింజలు, నట్స్, బెల్లంతో చేసే లడ్డూలు కూడా తినవచ్చట. ఐతే... ఇవేవీ లేకపోతే... కనీసం కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి తినమని సూచిస్తున్నారు. కాబట్టి... ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్‌ఫాస్ట్ మానొద్దు. వీలైనంతవరకూ ఆయిల్ లేని ఫుడ్ టైమ్ ప్రకారం, సరిపడా తీసుకుంటూ ఉంటే... చక్కటి ఆరోగ్యం సాధ్యమే.

First published:

Tags: Health, Health benefits, Health Tips, Tips For Women, Women health

ఉత్తమ కథలు