హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Face glow: బ్రెడ్​తోనూ మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Face glow: బ్రెడ్​తోనూ మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రెడ్‌(bread)తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు. ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి. అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి  (beauty ness) కూడా చక్కగా స‌హాయ‌ప‌డుతుంది.

ఆధునిక ప్రపంచం. మనుషుల జీవితాలు ఒకే చోట కాకుండా ప్రాంతాలను బట్టీ మారుతాయి. అయితే ఉద్యోగ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంతమంది దేశవిదేశాలూ తిరుగుతారు. దీంతో అక్కడి పరిస్థితులకు అలవాటుపడుతారు. అక్కడి ఆహార అలవాట్లు వంటపట్టించుకుంటారు. ఆ కోవకు చెందిందే. బ్రెడ్(bread)​. ఎక్కవగా ఫారిన్​ దేశాల్లో బ్రెడ్​ని తీసుకుంటారు. కానీ, కొన్ని దశబ్ధాలుగా ఈ అలవాటు ఇండియాలోనూ పెరిగి, మారుమూల ప్రాంతాలకూ చేరింది. మనదేశంలోని ప్ర‌జ‌లూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, ఇత‌ర స‌మ‌యాల్లో భోజనాలు చేస్తుంటారు. అయితే చాలా మంది కామన్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒక‌టి బ్రెడ్‌. రెండు బ్రెడ్ ముక్క‌ల‌ను కాల్చి టోస్ట్‌గా చేసుకుని దానిపై జామ్ లేదా వెన్న లాంటిది వేసుకుని కొంద‌రు తింటారు. మరికొందరు బ్రెడ్ పై జామ్ రాసుకుని లాగిస్తారు. కొంద‌రు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటారు. ముఖ్యంగా ఉద్యోగ‌స్తులు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే స‌మ‌యం, తీరిక‌ లేక బ్రెడ్‌తో క‌డుపు నింపుతుంటారు. అంతేకాదు బ్రెడ్‌(bread)తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు. ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి. అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి  (beauty ness) కూడా చక్కగా స‌హాయ‌ప‌డుతుంది. అవును బ్రెడ్ ముక్కలు తినడానికే కాదు.. అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి.

ముఖాన్ని(face) మృదువుగా, నిగారింపుగా మార్చ‌డంలో బ్రెడ్ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ బ్రెడ్ ముక్కలను పేస్ట్‌లా తయారుచేసుకుని ఇందులో కొద్దిగా మీగడ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఒక గిన్నెలో బ్రెడ్ పొడి, ఓట్స్ పొడి, తేనె వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని. కాస్త ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ ఫేస్ క్లీన్ చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం సున్నితంగా, అందంగా త‌యార‌వుతుంది.

వర్షాకాలంలో..

వ‌ర్షాకాలంలో ముఖం నిర్జీవంగా మారుతుంటుంది. అలాంట‌ప్పుడు బ్రెడ్ పొడిలో కొద్దిగా ముల్తానీ మ‌ట్టి, రోజ్ వాటర్ వేసుకుని క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి బాగా డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు కోమ‌లంగా, నిగారింపుగా కూడా మారుతుంది.  ఇక ముఖంపై ముడతలు తగ్గడానికి బ్రెడ్ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి. ఆ బ్రెడ్ పొడిలో పచ్చి పాలు వేసి ఒక రాత్రంత నానబెట్టాలి. పాలు పూర్తిగా ఇంకిపోయిన తరువాత కాస్త పాల మీగ‌డ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట త‌ర్వాత వేళ్ల‌తో మెల్ల‌గా మెల్ల‌గా రుద్దుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి ముఖం మృదువుగా మారుతుంది. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినే అలవాటు ఉంటే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఉదయాన్నే బ్రెడ్ తిన‌డం వ‌ల్ల అందులో ఉండే గ్లూటెన్ అనే ప‌దార్థం మ‌న‌కు అసిడిటీ స‌మ‌స్య‌ను తెచ్చి పెడుతుంద‌ట‌. అలాగే ఉద‌యాన్నే బ్రెడ్ తిన‌డం వల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు

First published:

Tags: Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు