Hyderabad : తెలంగాణలో మరో పర్యాటక కేంద్రం రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే చారిత్రకంగా ప్రాచూర్యం పోందిన దాన్ని మరింత అధ్భుతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూపోందించాయి.
ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్ అందర్ని ఆకట్టుకోవడానికి సిద్దంగా ఉంది. ఇక్కడికి మీరు వెళ్లత్తే భూటన్ వెళ్లినట్లే ఉంటుంది. అంతలా బౌద్ద సంస్కృతి సంప్రదాయాలు మేలవించేలా ఈ ప్రదేశాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. సిటీకి ఇప్పటికే వీకెండ్ గేట్ వే ఉన్న నాగార్జున సాగర్ సమీపంలో భౌద్దవనం పేరుతో ప్రభుత్వం చెప్పట్టిన ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. త్వరలో ఇది సందర్శకులకు స్వాగతం పలకునుంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ వద్ద 'బుద్ధవనం' పేరుతో బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌తో ఏర్పాటు చేసింది, ఇది రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా రానున్న రోజుల్లో మారనుంది.
బుద్ధుని జీవితం, బోధనల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ఎవరికైనా బుద్ధవనం వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో, హెరిటేజ్ పార్క్ బుద్ధుని జీవితం విషయాలతోపాటు బౌద్ద సంప్రదాయాలు సంస్కృతికి చిహ్నంగా ఈ పార్క్ ను డిజైన్ చేశారు, బుద్దిని జీవితంలో వివిధ దశలకు సంబంధించి చక్కని శిల్పాలు, కాంస్య విగ్రహాల ద్వారా అర్దమైనరీతిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. కృష్ణా నది ఎడమ ఒడ్డున నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 274 ఎకరాల స్థలంలో శ్రీపర్వత ఆరామంగా పిలువబడే ప్రాంతంలో ఈ బుద్దవనం నిర్మించారు .
2003లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బ్యాంక్రోల్ చేసి, దాదాపు రూ.67 కోట్లతో అభివృద్ధి చేశారు. చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా ఈ స్థలంలో బుద్ధవనం నిర్మించాలని నిర్ణయించారు. 1927 నుండి ఇక్కడ లభించిన పురావస్తు ఆధారాలు - మఠాలు, పుణ్యక్షేత్రాలు, స్థూపాలు వంటి బౌద్ధ నిర్మాణాలు - ఈ ప్రదేశం బౌద్ధ చరిత్రలో గొప్పదని తెలుపుతుంది. బౌద్ధ పండితుడైన ఆచార్య నాగార్జునుడు తన చివరి రోజులు నాగార్జున కొండ అనే కొండపై గడిపిన సంగతి తెలిసిందే. బుద్ధవనం ఎనిమిది విభాగాలుగా విభజించబడింది, ఇది బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగమార్గాన్ని సూచిస్తుంది. ఈ సెగ్మెంట్లకు బుద్ధచరితవనం, జాతక పార్క్, ధ్యానవనం, స్థూపా పార్కు, ఆచార్య నాగార్జున ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హయ్యర్ బౌద్ధ అభ్యాసం, కృష్ణా వ్యాలీ పార్క్, తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధమతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్, మహాస్థూపం అని బుద్ధవనం ప్రాజెక్టు అధికారులు న్యూస్ 18 కి తెలిపారు.
ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోపురం ఆకారంలో ఉన్న నిర్మాణంలోకి అడుగు పెడితే, 360-డిగ్రీల సూర్యరశిమిలో మహాస్తూపం లోపలి భాగం మీరు ఆకాశంలో ఉన్నట్లు భావించే విధంగా రూపొందించబడింది ఈ రూపురేఖల కోసం ప్రత్యేకంగా జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అల్యూమినియం షీట్లకు రంగులు వేశారు. ఈ అనుభూతిని మీరు పొందాలంటే, మీరు మీ కళ్ళు మూసుకుని గోపురంలోకి అడుగు పెట్టాలని, పూర్తిగా లోపలికి వచ్చాక వాటిని తెరవాలని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మార్నింగ్ వాక్ చేయడానికి అనుకూలంగా ఒక చిట్టడవి లాంటి మార్గం కూడా ఏర్పాటు చేశారు, ఈ ఏర్పాటు చేసిన దారిలో భారీ శిల్పాలు, బుద్ధుని పూర్వ జీవితాల ప్రసిద్ధ కథలను చూడవచ్చు.
ఈ కథలు భారతదేశంలోని ప్రసిద్ధ బౌద్ధ ప్రదేశాలైన మయన్మార్, ఇండోనేషియాలోని బోరోబుదూర్ చైనా వంటి అనేక ఇతర ప్రదేశాల నుండి తీసుకోబడ్డాయి.ఈ బుద్ధవనం నిర్మాణంలో ఉన్నప్పుడు, దలైలామా 2006లో ఈ స్థలాన్ని సందర్శించారు బోధ్ గయ నుండి తెచ్చిన బోధి వృక్షాన్ని ఇక్కడ ఆయన నాటారు, ఇది అసాధారణంగా పొడవాటి ఆకులతో ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తోంది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.