Home /News /life-style /

BOSSES NEVER SAY THESE 7 THINGS TO THEIR EMPLOYEES HERE IS INTERESTING DETAILS GH SK

Boss Behaviour: ఉద్యోగులతో బాస్ ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు చెప్పకూడదు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా ఉద్యోగి వచ్చి ఈ పని నేను చేయను అని చెప్తే... వెంటనే ఆ వ్యక్తి గురించి స్టేట్‌మెంట్లు ఇవ్వడం లాంటివి చేయకూడదు. దానికి బదులు అసలు ఆ పని చేయడానికి వారు ఎందుకు ‘నో’ అంటున్నారో కనుక్కోవాలి.

మంచి బాస్‌ అంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. అంతే కాదు ఉద్యోగులతో బాస్‌లు ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు చెప్పకూడదు? వీటికి సంబంధించి పెద్దలు కొన్ని విషయాలు చెబుతారు. వాటిని పాటిస్తే ఆ బాస్‌ను మంచి బాస్‌ అనొచ్చట. మరి అవేంటో చూసేయండి. ఒకవేళ మీరు బాస్‌ అయితే ‘మంచి బాస్‌’ అనిపించుకోండి.

* ప్రతిభను గుర్తించాలి
ఒకరి కష్టాన్ని మనం లాక్కోవడం అంటే... ఆ కష్టానికి వచ్చిన పేరును లాక్కోవడమే. బాస్‌ ఎప్పుడూ ఉద్యోగుల కష్టాన్ని... తన గొప్పతనంగా తీసుకోకూడదు. వారి కష్టానికి ఎప్పటికప్పుడు గుర్తింపునివ్వాలి.

* అభిప్రాయాలకు విలువ
ఉద్యోగి పని చేయడంలో మానసిక ప్రశాంత కూడా కీలక పాత్ర వహిస్తుంది. అందుకే వాళ్లు ఎక్కడికైనా దూరంగా వెళ్లి కాస్త ప్రశాంతంగా నాలుగు రోజులు గడిపి వస్తాం అంటే నో చెప్పకూడదు. అప్పుడు వర్క్ - లైఫ్‌ బ్యాలెన్స్‌ కుదురుతుంది.

* అధికార ధోరణితో చేటు
‘నేను బాస్‌ను కాబట్టి నేను చెప్పిందే ఉద్యోగులు వినాలి‘... ఈ మాట నేటి ఉద్యోగుల దగ్గర చెల్లుబాటు కాదు. తమ మాటలు, అభిప్రాయాలకు విలువ ఇచ్చే కంపెనీల్లోనే పని చేయాలని నేటి తరం అనుకుంటున్నారు. అందుకే సూచనలు ఇచ్చే ఉద్యోగిని మెచ్చుకుంటూ అవసరమైతే వాటిని తీసుకోవడం ఉత్తమం.

* అనవసర స్టేట్‌మెంట్లు వద్దు
ఎవరైనా ఉద్యోగి వచ్చి ఈ పని నేను చేయను అని చెప్తే... వెంటనే ఆ వ్యక్తి గురించి స్టేట్‌మెంట్లు ఇవ్వడం లాంటివి చేయకూడదు. దానికి బదులు అసలు ఆ పని చేయడానికి వారు ఎందుకు ‘నో’ అంటున్నారో కనుక్కోవాలి. అంతేకానీ ఓ మాట అనేయడం వల్ల మనస్పర్థలు వస్తాయి తప్ప.. పని జరగదు.

* మాటలు జాగ్రత్త..
బాస్‌ కదా అని ఉద్యోగులతో ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనుకోకూడదు. తమకు గౌరవం దక్కాలని ఎలా అనుకుంటున్నామో, ఉద్యోగులు కూడా అలానే అనుకోవాలి. వారిని అగౌరవపరిచే మాటలు కంటే.. ఆ పని చేసే సంస్థకు తద్వారా ఉద్యోగులకు కలిగే లాభం గురించి చెప్పి ఒప్పించాలి.

* ప్రశంస ముఖ్యం
‘ఈ రోజు బాగా పని చేశావ్‌’... చాలామంది బాస్‌లు ఈ మాటను ఉద్యోగులతో చెబుతుంటారు. అయితే ఇలా సాధారణంగా చెప్పే బదులు... చేసిన పని గురించి మీకు తెలిసింది అనేలా ‘ఫలానా పని చేశావ్‌.. గుడ్‌’ అంటే.. వారి పనిని మీరు బాగా పరిశీలిస్తున్నట్లు ఉద్యోగులు భావిస్తారు. అది బాస్‌కు చాలామంచింది.

* ఫీడ్ బ్యాక్ ఎలా?
‘నీ వర్క్‌తో నన్ను నిరాశపరిచావ్‌...’ ఈ మాట అంటే మీకు ఫీలింగ్‌ను ఉద్యోగితో చెబుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ మాట ఉద్యోగి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. దానికి బదులు ఉద్యోగికి మీరు చెప్పాలనుకున్న ఫీడ్‌ బ్యాక్‌ను పక్కాగా చెప్పాలి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Employees, Life Style, Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు