అప్పుడే పుట్టిన శిశువు (New Born Baby) దగ్గర నుంచి దాదాపు 3 ఏళ్ల లోపు పిల్లలు ఏడవడం అనేది సహజం. సంవత్సరం లోపు పిల్లలు ముఖ్యంగా 3 నెలల లోపు పసి పిల్లలు అయితే తన ఏడుపుకు(Crying) గల కారణం మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు ఆకలి(Hungry) కోసమే ఇలా ఏడుస్తున్నారని చాలామంది అనుకుంటారు. అప్పుడు వాళ్లకు పాలను (Milk) పట్టిస్తే సులభంగా ఏడుపు ఆపేస్తారు. మరో సారి ఏదైనా ఇబ్బంది కలిగినా, అనారోగ్యంగా ఉన్నా.. బయటకు చెప్పలేరు కనుక.. ఏడుస్తారు. ఇలా వాళ్లు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. ఒక్కోసారి ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు కాస్త అసహనం కూడా కలుగుతుంది.
ఇది సహజమే. అయితే అటువంటి సమయంలో మనం వాళ్లను ఏడుపు మన్పించే విధంగా నానా ప్రయత్నాలు చేస్తాం. ఊయలు ఉంటే.. అందులో అడుకోబెట్టి ఊపుతాం. అయినా ఏడుపు ఆపకపోతే ఏం చేయాలి.. దాని కోసం ఓ చిట్కా ఉంది. దాని గురించి తెలుసుకుందాం. చిన్నారులు బాగా ఏడుస్తున్నప్పుడు పాల కోసం కాకపోతే.. ఏడుపును ఆపేందుకు ముందుగా వారి చేతులను ఛాతి మీదకు మడవాలి. ఇలా చేసే క్రమంలో చాలా మృదువుగా చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఆ శిశువును తమ అరచేతిలో కూర్చోబెట్టుకొని 45 డిగ్రీల కోణంలో వంచాలి. అలా చేస్తున్న క్రమంలోనే వాళ్ల పిరుదులను సున్నితంగా మర్దన చేయాల్సి ఉంటుంది. అలా ఆడిస్తున్నట్లు లాలించాలి. డాక్టర్ రాబర్ట్ హామిల్టన్ అనే వైద్య నిపుణుడు చిన్నారులను ఏడుపు సులభంగా ఎలా మాన్పించాలో కనిపెట్టిన టెక్నిక్ ఇది. ఈ విధంగా చేయడం వల్ల పసిపిల్లలు సులభంగా ఏడుపు మానేస్తారు. ఇలా ఎవరి ఇళ్లల్లో అయితే చిన్న పిల్లలు ఇబ్బందులను కలుగజేస్తు పైన చెప్పిన విధంగా పాటించవచ్చు. దాని కోసం ఇక్కడ ఇచ్చిన వీడియో కూడా చూడొచ్చు.
ఇలా వీడియోలో డాక్టర్ చెప్పిన విధంగా చేస్తే.. చిన్న పిల్లలు ఏడుపు మానేసే అవకాశం ఉంది. ఈ టెక్నిక్ చాలా వరకు ఉపయోగపడుతుందని అతడు తెలిపాడు. ముందుగా వాళ్లకు పాలను పట్టించాలి. అయినా ఏడుపు మానకపోతే పైన చెప్పిన విధంగా పాటించాలి. ఇలా చేస్తే వాళ్లు ఏడుపు అనేది 5 సెకన్లలో మానేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, New born baby