బోడకాకర కాయతో భలే ప్రయోజనాలు...ఎన్నో వ్యాధులకు చెక్...

బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది.

news18-telugu
Updated: August 19, 2019, 3:23 PM IST
బోడకాకర కాయతో భలే ప్రయోజనాలు...ఎన్నో వ్యాధులకు చెక్...
బోడకాకరకాయ (Image : Facebook)
news18-telugu
Updated: August 19, 2019, 3:23 PM IST
బోడ కాకరకాయ సీజన్ వచ్చిందంటే చాలు చాలామంది దీని కూర చేసుకొని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో 'ఆకాకరకాయ' అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో సేకరించే ఈ కాయ వర్షాకాలంలో విరివిగా లభిస్తుంది. ఎంత ధరైనా సరే వెచ్చించి తినేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బోడకాకర కాయ ధర కిలో.150 పైన పలికినా కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బోడకాకరతో పులుసు, వేపుడు కూర, పొడి చేసుకునేందుకు భోజన ప్రియులు ఇష్టపడతారు. కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే లభించే బోడకాకరను గిరిజనులు అడవిలో సేకరించి మార్కెట్లో దళారులకు అమ్ముతుంటారు. ఇక బోడ కాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువల కూడా మెండుగా ఉంటాయి. ముఖ్యంగా బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. అలాగే దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది. ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. అలాగే క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా కూడా ఈ కాయ రక్షిస్తుంది. ఇక చివరగా ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...